[racchabanda] వసంతతిలకము - సరసాంకము - యతి #vasaMtatilakamu - sarasAMkamu - yati#

 

వసంతతిలకము - సరసాంకము - యతి - 

శ్రీవేంకటేశ సుప్రభాతములో ఎక్కువగా వాడబడిన వృత్తము వసంతతిలకము. సంస్కృత కవులకు ఈ వృత్తము bread and butter లాటిది. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో అక్షరసామ్య యతి లేక వడి 1, 8 అక్షరాలకు. ఇక పోతే ఈ వసంత తిలకమునకు ఒక కవల గలదు. దాని పేరు సరసాంకము. వసంత తిలకములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేస్తే ఈ సరసాంక వృత్తము లభిస్తుంది. ఈ సరసాంక వృత్తమునకు యతి 1, 10 అక్షరాలకు. అనగా లయ రీత్యా వసంతతిలకములోని యత్యక్షరమునకు పక్కన ఉండే అక్షరముతో. శార్దూల మత్తేభ విక్రీడితములకు, చంపకోత్పల మాలలకు యత్యక్షరాలు లయ రీత్యా ఒక్కటే. మఱి వసంతతిలక సరసాంకములకు ఎందుకు ఈ తేడా? 

నా ఉద్దేశములో వసంతతిలకము ఇంద్రవజ్రనుండి పుట్టినదని. ఇంద్రవజ్ర లయకు రెండు అక్షరాలు అదనము ఇందులో. నేను ఇంద్రవజ్రకు లయ రీత్యా ఆఱవ అక్షరముతో యతిని ఉంచుతాను. అదే విధముగా వసంతతిలకమునకు కూడ 10వ అక్షరముతో యతిని ఉంచుతాను, సరసాంకములోవలె. 

 UUI UII IU IIUI UU - వసంతతిలకము 
IIUI UII IU IIUI UU - సరసాంకము
 UUI UU     IIUI UU - ఇంద్రవజ్ర

(Courier New font తో గురులఘువుల అమరికను గమనించండి.) 

వసంతతిలకము - త/భ/జ/జ/గగ 
(యతి రెండక్షరములతో నుంచినాను) 

ఆనందసంద్రమున - నాయల లేచె నెత్తై
కానంగ వేగముగఁ - గాకను తీర్ప రావా 
నీనవ్వు పూవులను - నే నిధిగాను జేర్తున్ 
వేణూరవమ్ము వినెదఁ - బెంపెసగంగ దేవా 

సరసాంకము - స/జ/స/స/య

మనమందుఁ దల్చితినిరా - మదనస్వరూపా 
వదనమ్ములోని నగవుల్ - వరమయ్యె నాకున్ 
ముదమీయ రమ్ము త్వరగా - పులకల్ గలుంగన్ 
పదమొండుఁ బాడెదనురా - వర మోహనాంగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vasaMtatilakamu - sarasAMkamu - yati - 

SrIvEMkaTESa suprabhAtamulO ekkuvagA vADabaDina vRttamu vasaMtatilakamu. saMskRta kavulaku ee vRttamu #bread and butter# lATidi. saMskRtamulO dIniki yati lEdu. telugulO axarasAmya yati lEka vaDi 1, 8 axarAlaku. ika pOtE ee vasaMta tilakamunaku oka kavala galadu. dAni pEru sarasAMkamu. vasaMta tilakamulOni modaTi guruvunu reMDu laghuvulugA chEstE ee sarasAMka vRttamu labhistuMdi. ee sarasAMka vRttamunaku yati 1, 10 axarAlaku. anagA laya rItyA vasaMtatilakamulOni yatyaxaramunaku pakkana uMDE axaramutO. SArdUla mattEbha vikrIDitamulaku, chaMpakOtpala mAlalaku yatyaxarAlu laya rItyA okkaTE. ma~ri vasaMtatilaka sarasAMkamulaku eMduku ee tEDA? 

nA uddESamulO vasaMtatilakamu iMdravajranuMDi puTTinadani. iMdravajra layaku reMDu axarAlu adanamu iMdulO. nEnu iMdravajraku laya rItyA aa~rava axaramutO yatini uMchutAnu. adE vidhamugA vasaMtatilakamunaku kUDa 10va axaramutO yatini uMchutAnu, sarasAMkamulOvale. 

# UUI UII IU IIUI UU# - vasaMtatilakamu 
#IIUI UII IU IIUI UU# - sarasAMkamu
# UUI UU     IIUI UU# - iMdravajra

(#Courier New font# tO gurulaghuvula amarikanu gamaniMchaMDi.) 

vasaMtatilakamu - ta/bha/ja/ja/gaga 
(yati reMDaxaramulatO nuMchinAnu) 

aanaMdasaMdramuna - nAyala lEche nettai
kAnaMga vEgamuga@M - gAkanu tIrpa rAvA 
nInavvu pUvulanu - nE nidhigAnu jErtun 
vENUravammu vineda@M - beMpesagaMga dEvA 

sarasAMkamu - sa/ja/sa/sa/ya

manamaMdu@M dalchitinirA - madanasvarUpA 
vadanammulOni nagavul - varamayye nAkun 
mudamIya rammu tvaragA - pulakal galuMgan 
padamoMDu@M bADedanurA - vara mOhanAMgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: