[racchabanda] వృషభగతి రగడ లయతో ఝుల్లిక #vRshabhagati ragaDa layatO jhullika#

 

వృషభగతి రగడ లయతో ఝుల్లిక - 

ఆధారము - కల్పితము 

వృషభగతి రగడకు ప్రతి పాదములో నాలుగు సప్తమాత్రలు (3,4) ఉంటాయి. మత్తకోకిలకు, దాని లయతో ఉండే పద్యములకు వృషభగతి రగడకన్న చివర రెండు మాత్రలు తక్కువ. వృషభగతి రగడ లయతో ఏదైనా వృత్తము ఉన్నదా అని వెదికి విఫలుడ నయ్యాను. మత్తకోకిలకు చివర ఇంకొక గురువును తగిలిస్తే మనకు ఈ రగడ లయ సాధ్యమవుతుంది. వృత్త సంఖ్య మారదు, ఛందము మాత్రము మారుతుంది. ఆ వృత్తమునకు ఝుల్లిక అని పేరు నుంచినాను. 

ఝుల్లిక - ర/స/జ/జ/భ/ర/గ UI UII UI UII UI UII UI UU
19 అతిధృతి 93019

వృషభగతి రగడవలె అక్షరసామ్య యతితో - 

నందగోపుని యింటఁ జూడఁగ - నాల్గు పూటల నాట్యమేగా 
సుందరాంగుఁడు చిందులేయఁగ - సొంపు నిండఁగ విందులేగా 
వంద పువ్వుల పూఁత నింపిన - వర్ణజాలపు గంధమేగా 
డెంద మందున దివ్య గానపు - టిక్కుటిక్కుల రావమేగా 

ప్రతి సప్తమాత్రకు అక్షరసామ్య యతితో - 

నీదు రూపము - నేను గంటిని - నిద్రలో నొక - నిండు వెల్గై 
నీదు నామము - నే స్మరించుచు - నేల వీడితి - నింగిఁ బుల్గై 
మోదమందున - మున్గిపోదును - మోహనాంగుఁడు - ముద్దు లీయన్ 
ఖేదమందునఁ - గిన్క గల్గును - గృష్ణుఁ డీనను - ఖిన్నఁ జేయన్

ప్రతి సప్తమాత్రకు ప్రాస యతితో - 

కల్ల కాదిది - యెల్ల దిక్కుల - నల్లఁగా నిశి - మెల్లఁ దోఁచెన్ 
నల్లఁగా నగ - మల్లఁ గన్పడె - నల్లఁగాఁ దరు - లల్లఁ జూచెన్ 
దల్లడిల్లుచు - డిల్లఁ బోవఁగ - వెల్లువై వెత - లల్లె మమ్మున్ 
దెల్లవారునొ - ఝుల్లికన్ రవి - మళ్లి యిచ్చునొ -  యుల్లసమ్మున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vRshabhagati ragaDa layatO jhullika - 

aadhAramu - kalpitamu 

vRshabhagati ragaDaku prati pAdamulO nAlugu saptamAtralu (3,4) uMTAyi. mattakOkilaku, dAni layatO uMDE padyamulaku vRshabhagati ragaDakanna chivara reMDu mAtralu takkuva. vRshabhagati ragaDa layatO EdainA vRttamu unnadA ani vediki viphaluDa nayyAnu. mattakOkilaku chivara iMkoka guruvunu tagilistE manaku ee ragaDa laya sAdhyamavutuMdi. vRtta saMkhya mAradu, ChaMdamu mAtramu mArutuMdi. aa vRttamunaku jhullika ani pEru nuMchinAnu. 

jhullika - ra/sa/ja/ja/bha/ra/ga #UI UII UI UII UI UII UI UU#
19 atidhRti 93019

vRshabhagati ragaDavale axarasAmya yatitO - 

naMdagOpuni yiMTa@M jUDa@Mga - nAlgu pUTala nATyamEgA 
suMdarAMgu@MDu chiMdulEya@Mga - soMpu niMDa@Mga viMdulEgA 
vaMda puvvula pU@Mta niMpina - varNajAlapu gaMdhamEgA 
DeMda maMduna divya gAnapu - TikkuTikkula rAvamEgA 

prati saptamAtraku axarasAmya yatitO - 

nIdu rUpamu - nEnu gaMTini - nidralO noka - niMDu velgai 
nIdu nAmamu - nE smariMchuchu - nEla vIDiti - niMgi@M bulgai 
mOdamaMduna - mun&gipOdunu - mOhanAMgu@MDu - muddu lIyan 
khEdamaMduna@M - gin&ka galgunu - gRshNu@M DInanu - khinna@M jEyan

prati saptamAtraku prAsa yatitO - 

kalla kAdidi - yella dikkula - nalla@MgA niSi - mella@M dO@Mchen 
nalla@MgA naga - malla@M gan&paDe - nalla@MgA@M daru - lalla@M jUchen 
dallaDilluchu - Dilla@M bOva@Mga - velluvai veta - lalle mammun 
dellavAruno - jhullikan ravi - maLli yichchuno -  yullasammun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: