[racchabanda] రచ్చబండ కవితలు

 

 

 

Revolving doors

 

ప్రతిసారీ ప్రయాణమై పోయేప్పుడు

అప్పుడు మాత్రం ఆమెతో

అతడు వాదులాడడు. సకల సపర్యలు చేస్తాడు

బహుమతి పుస్తకాలిస్తాడు. శిష్యురాలా! రోజూ పాఠం

సాధకం చేస్తుండూ! అంటాడు.

ఆమెతో ఎలివేటర్ దాకా నడుస్తాడు.

అక్కడ బిగి కౌగిలిస్తాడు. 'మీ టూ' కేమెరాలు ఉన్నవి.

తెలియప్పోతేగా!  ఏమో! అతని దృష్టికి ఆమె అందగత్తె.

అంచేత నిగ్రహించలేడేమో.

 

అంతేనా! ఆ చర్యలలో ఒక

గూఢపు జెనెటిక్ territory marking  ఉండే ఉంటుంది.

అతడు అటు తిరగగానే, ఇటు;

ఆమె ఇంట్లో ఆమె తలగడ తడిసిపోవాలనీ, 

ఆమె కావ్యనాయికలా కృశించాలనీ,

చేతి ఉంగరాలు గాజులవ్వాలనీ, గాజులు మెడలో కంటెలవ్వాలనీ!

అతని పురాతన పురుష అంతరంగం వాంఛిస్తుందేమో.

 

కానీ అష్టవిధ నాయికల స్థాయీ భావాలు ఖరాకండీగా

అంత ప్రస్ఫుటం కావామెలో.

ఎవరిలోనూ అర్ధ భాగంగా ఉండటం రుచించదు.

అలమటించటానికి ఆమె ఆసక్తి చూపదు.

గురువుకి పదహారు వేల భామలు దేశదేశంలో

ఉండే పాసిబిలిటీ ఆమెకు తెలియదా!

 

సొంతంగా అమర్చుకుని, ఫైవ్ స్టార్ విహారయాత్రకి వెళ్లిపోయి

తోటలుండే కేసిల్స్ లో చెకిన్ చేసి, నలుగురితో నలుగులు పెట్టించుకుని

ఛెఫ్ లతో మంచి వంటలు వండించుకుని తిని, తిరిగి,

ఆ తోటల ఘుమఘుమలతో నవనవలాడుతూ తిరిగి వస్తుంది.

 

అతడు కష్టించి విదేశాలలో పనిచేసి తిరిగి వచ్చి,

కులాసాగా, ఝూమ్మంటూ ఉన్న ఆమెను చూసి అసూయ పడతాడా?

విరక్తుడౌతాడా,

లేక ప్రణయం ఉధృతమౌతుందా?

 

Who knows!  It's a new season. It needs to be played out.

It is as good as any show on Netflix.

 

Lyla



__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (268)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: