[racchabanda] కళాపూర్ణోదయం

 

  • ప్రాచీన తెలుగు సాహిత్యం లోని కావ్యాలు ప్రబంధాలు అన్ని పురాణాలలోనుండి ఇతిహాసాలలోనుడి.మూలకథలను,ఉపకథలనుతీసుకొని పెంచి వ్రాయబడినవి.దీనికి Exception ఒక్కటే.అది పింగళిసూరన గారి కళాపూర్ణోదయం.ఇది స్వతంత్ర రచన.కధలో కథ మళ్ళీi వాటిలో ఉపకధలురూపాలు మారిపోవడం మాయలు ఇలా సాగిపోతుంటుంది పింగళి వారి ప్రబంధం.కధలు కధలు గా ఘట్టానికి ఘట్టం గా తీసుకుంటే సూరపరాజు గారి కవితా ప్రౌఢివర్ణనా చాతుర్యం పరిశీలనా శక్తి మనకు అద్భుతం అని పిస్తుంది కావ్యం మొత్తానికి అపూర్వం అనిపించే ది ఇందులోని సుగాత్రీ శాలీనుల కథ.
   కాశ్మీరానికి ఆభరణం గా చెప్పదగినది శారదా పీఠం.ఆ శారదా పీఠం ప్రధాన పూజారి అతని భార్యల కుమార్తె సుగాత్రి.కలిగిన కుటుంబం.శాలీనుడు అనే వ్యక్తితో సుగాత్రికి వివాహం జరిపారు.శాలీనుడు ఇల్లరికపు తల్లుడు గా వచ్చేసాడు.తొలిరాజు రాత్రి సుగాత్రిని సర్వాభరణ భూషితురాలిని చేసి గదిలోకి పంపించారు వాళ్ళ అమ్మ సుగాత్రి చెలికత్తెలు.ఆ లంకారాలు ఆడంబరం చూసి శాలీనుడు భయపడి విరక్తి చెందాడు.మరునాడు ఆ మరునాడు ఆ మరునాడు అదే తంతు పునారావృతమయింది .సుగాత్రి తల్లి అనుమతి తో సఖులు సుగాత్రితో ' నీ భర్త పురుషత్వం అనుమానాస్పదం గా ఉంది. స్త్రీకి య్యవ్వనం బంగారం లాంటిది.అపుడే పురుషునితో స్వర్గం అనుభవించాలి.నీభర్త శాలీనుణ్ణి ఉత్తేజపరచు.కర్పూరపు తాంబూలాలు ఇవ్వు.( మరి ఆరోజులలో నేటి Steroids వంటివి లేవు గదా.)అన్నారు.చెలులు చెప్పినట్లే సుగాత్రి శృంగార రసానికి పనికొచ్చే ఉద్దేపన ప్రేరకాలను ఉపయోగించింది. అయినా శాలీనుడిలో మార్పు సున్నా..చిన్నతనం నుండి పతివ్రతా ధర్మాలను ఆకళింపు చేసుకున్న సుగాత్రి మంగళ సూత్రం పదిలం గా ఉంటె చాలను కుంది.సుఘత్త్రి తల్లికి బాధ గానే ఉంది,.మగ పోడిమి లేని అల్లుడి వల్ల ఏమి ప్రయోజనం.? కనీసం తోట పనియైనా చేయమని అల్లుడిని పురమాయించింది.మామూలుగానే ఇల్లరికపు అల్లుళ్లంటే చులకన.అందులోనూ మగతనం లేని అల్లుళ్ళ సంగతి చెప్పేదేముంది.కానీ అమాయకుడయిన శాలీనుడు శారదాదేవి పుష్పవనం లో సేవ ఆ సరస్వతీదేవికి సేవే గదా అని అంగీకరించాడు.అలాగే రోజూ తోట పని చేతున్నాడు.ఇక్కడ తోటపని లోతులను సూరన గారు వర్ణించిన వైనం చూడండి 
   సీస పద్యం - నీరెట్టువేళల నీరెత్తు పాదు పాదు నకు గాలువలు పొందుగ నమర్చి త్రవ్వటంబుల తరి త్ర`వ్వటంబులు వెట్టు దగినట్టి కర్రు గుద్దలి గడించి ఎరువు జల్లెడు వేళ నెఱువజల్లు. గతాభిమానుడయి గంపల దాన తెచ్చి అంటులొత్తు పదునున నంటు లొత్తునెలమి గాన్పించు లెగొమ్మలు వంచి వంచి నారు వోయగా వలయుచో నారు వోయు గొమ్మ నాటం దగునెడ గొమ్మ నాటు నొకటి విసువక యంతకంతకును హెచ్చు హాళి తో డను శాలీనుడు ఆవిరతంబు"
   ఆ తులసీ వనం లో చెంగలువలు,గేదంగులుచంపకములు ,కురువకములు లవంగములు జాజులు గొజ్జంగులు మల్లెలు సురంగములు పాటలములు కదళీకా చయము తుంగ తతులు నారఁగములు ఇలా అనేక రకాల పూలచెట్లను పండ్లచెట్లను హృదయంగమం గా.శాలీనుడు పెంచాడు..ఇంతకష్టపడి భర్త శాలీనుడు Horticulture వ్యవసాయం చేస్తుంటే పతివ్రత అయిన సుగాత్రికి దుఃఖం కలిగింది..భర్తకు సాయం చేయాలని అనుకోసాగింది.అపుడే ఒక రోజు భయంకరంగా వీరేశం కురిసింది. ఆ వర్షార్భటి ని సూరన గారు అంతే ఆర్భటి లో వర్ణించారు.
   "మిగుల జగంబు బెగ్గడిల మించే దదుద్ధత వృష్టి యద్భుతంబగుచు ఘనా ఘూనౌ ఘ సముగ్ర నిరర్గళ ఘర్ఘరార్భటీ లగ న ఘనోచ్చల జ్జల ఝలం నిర్ఝ ర జర్గరీ భవన్నగ విగళ చ్ఛిలా గణ ఘం ఘణ ఘోషణ భీషణంబుగాఁ."

   పదప్రయోగం లోనే వర్ష భీకరత్వం తెలుస్తున్నది.సముద్రంలో బడబాగ్ని ని తలపిస్తూ మెరుపులు ,నేలను ఆకాశాన్ని ఏకం చేస్తూ నీరు,ప్రళయకాల ఘోషా అనునట్లు ఉరుములు,,వాయు ప్రభంజనం ఇన్ని తోడయినాయి ఆ వర్షానికి.స`అలీనాడు తోటలో పనిచేస్తూ నే ఉన్నాడు.సుగాత్రి ఇక తట్టుకోలేక పోయింది.భర్తను కాపాడమని సరస్వతీదేవి ని ప్రార్ధించింది.తాను చేస్తున్న ఆ వ్రాత పూజా పుణ్యం లన్ని తన పతి ప్రాణ రక్షణ కయి ధారపోస్తానంది.తల్లికి తెలియకుండా అంత వర్షం లో భర్తకు సాయం గా వెళ్ళింది.తన ఒంటి మీది ఆభరణాలన్నిటిని వేసి తోట పనికి అనుకూలం గా చీరను సవరించుకొని భర్తకు సహాయం చేయడం మొదలు పెట్టింది.ఒక అందాల రాశి పొలం పని లేక తోట పని చేస్తుంటే ఎలా సినిమా లలో ఎక్సపోసింగ్ చేసి చూపిస్తారో అందరికీ తెలుసు. పింగళి సూరన గారు సుగాత్రి శరీరం లోని అంగాంగ వైభవాన్ని కడు రమ్యం గా వర్ణించాడు. సుగాత్రిలోని సహజ సౌందర్యాన్ని వయస్సు తెచ్చిన సోయగాలను మొదటి సారి చోశాడు శాలీనుడు..కాళిదాసు శకుంతల లాగ ఉన్నది సుగాత్రి.. ఆమె ను చూసి శాలీనుడు " వెర్రిదానా అతి సుకుమారివి.నీకు తోట పనా అంటూ దగ్గరకు తీసుకొని ఆమె శరీరం మీద చెమటను తుడిచాడు.సమయం కనిపెట్టి మన్మధుడు పూల బాణాలను శాలీనుడి పయి ప్రయోగించాడు.. ఆ ధాటికి తట్టుకోలేక శాలీనుడు సుగాత్రిని గట్టిగా కౌగలించుకొని ఒక పూపొదరింటి లోపలి తీసుకువెళ్లి భార్యను మదన సామ్రాజ్య మహా భోగం లో ముంచెత్తాడు.సుగాత్రి మహదానందంతో పొంగి పోయింది.ఆ పగలే ఆమెకు తొలిరాత్రి అయింది.దాచిన సొమ్ములను తీసుకొని మరల ఇంటిలోకి వెళ్ళింది. ఇంటిలోపలికి వెళ్ళింది.సూరన గారు సొమ్ముల మాట చెప్పనట్లయితే ఈనాటి భాష లో Direction Fault అయి ఉండేది.ఇంటికి వెళ్ళంగానే అం ఏచేలులు సంగతి గ్రహించి సరస సల్లాపాలు చేశారు.తల్లి గూడా సంతోషించింది.ఆరోజు రాత్రి ఇంకా ఎక్కువగా నగలతో అలంకరించి భర్త గది లోకి పంపింది..శాలీనుడు ఆ అలంకారాలనుచూసి కంగారు పడ్డాడు. ఎందుకు వచ్చావు అని అడిగాడు.దానికి సుగాత్రి స్త్రీలు పతుల యొద్దకు రాత్రివేళ ఏకాంతంగా ఎందుకు వస్తారు అన్నది. భర్త స్వభావానికి ఆమె ఆశ్చర్య పడింది. మరునాడు భర్త సహాయం చేయటానికి ఏ అలంకారం Make Up లేకుండా వెళ్ళింది.మల్లి శాలీనుడు కామ ప్రేరితుడయి ఆమెను పూర్తి గా సంతోష పరిచాడు..సుగాత్రి కి విషయం అర్ధమయింది.ఇక రోజూ పగటి పూత వారి సంసార జీవితం సుఖంగా సాగుతుంది . కానీ సుగాత్రి తల్లికి మాత్రం భయం పట్టుకుంది కాలం గాని కాలంలో సమయం గాని సమయం లో సురత క్రీడల వల్లగుణహీనులు రాక్షాస ప్రవ్రుత్తి గల సంతానం కలుగుతుందని ఆమె కుమార్తె కు చెప్పింది.. కానీ సుగాత్రి స్త్రీకి భర్తే గురువు దివము వేదము ఈశ్వరుడు . భర్త సంతోషమే స్త్రీకి సర్వస్వం అని తల్లికి సమాధాన మిచ్చింది.ఆమె తల్లే గాదు సాక్షాత్తు ఆసరస్వతి దేవి గూడా సుగాత్రి పాతివ్రత్యాన్ని గుర్తించిందన్నారు సూరన గారు.ఆవిధం గా సుగాత్రీ శాలీనుల శృంగార జీవితం సాగుతున్నది. వారి చరిత్ర గ్రంధస్తం గూడా అయింది..ఆ సరదా పీఠం లోనే ఒక వేద పండితుడు.సుగాత్రీ శాలీనుల చరిత్ర గ్రంధాన్ని తెమ్మని తన శిష్యుడొకరిని ఆదేశించాడు.ఆ శిష్యుడు ఆ దంపతుల ఇంటికి వెళ్ళాడు.ఆ సమయం లో సుగాత్రి భర్తకు పాదసేవ చేస్తున్నది.ఆశిష్యుడిని చూసిన శాలీనుడు నీకు కావలసిన పుస్తకం ఆ చెట్టు కొమ్మ మీద పెట్టాను.తీసుకవెళుదువు గాని కూర్చో అన్నాడు. బహుశా అతిధి మర్యాదలు చేయటానికి కాబోలు.. తరువాత సుగాత్రిని చూచి శాలీనుడు 'నీవు అమృతం సేవించావా సుగాత్రి లోకం లో మగవారికంటే ముందు ఆడవాళ్లకు తొందరగా వృద్ధాప్యం వస్తుందంటారు.నీ విషయం భిన్నం గా ఉన్నది.రోజులు గడుస్తున్నా కొద్దీ నే అందం ద్విగుణీ కృత మౌతున్నది.అన్నాడు.దానానికి కారణం ఎదో ఆమె చెవులో చెప్పాడు.దానికి సుగాత్రి నేను శారదాదేవిని మరో రకం గా వరం కోరానే అన్నది.ప్రణయం ప్రళయమైంది రోషం తో శాలీనుడు వెళ్లి "శత తాళ దఘ్నం " అన్న సరస్సులో దూకాడు.సహధర్మ చారిని అయిన సుగాత్రి గూడా వెళ్లి ఆసరస్సులో దూకింది. ఇదంతాచూసి బిత్తర బోయిన ఆ శిష్యుడు చెట్టుకొమ్మ పయి ఉంచిన ఆ పుస్తుకం టీసుకొని తన గురువు గారి దగ్గరకు వెళ్లి పోయాడు.ఆఖ్యాన వరిష్ఠునిగా పేరొందిన పింగళి సూరన గారు సుగాత్రీ శాలీనుల కథను మరో జన్మకు తీసుక వెళ్లారు. ప్రస్తుతానికి ఇది చాలు.ఒకటికి నాలుగు సార్లు చదివినా కళాపూర్ణోదయం కావ్యాన్ని గురించి అవగాహన రావటం కష్టం..తెలుగు సాహితీ వినీలాకాశం లో పింగళి సూరన గారు త్క్లా తలా మెరిసే ఒక ధృవతార.సూరన గారు సంస్కృతాంధ్ర భాషలలో పరిపూర్ణ పాండిత్యం గల వాడు. యోగ శాస్త్రం సంగీత శాస్త్రం రెండింటి లోతులు చూసిన వాడు.రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యాన్ని వ్రాసాడు. ఒక అర్ధం లో రామాయణం మరో అర్ధం లో భారతం.వచ్చేటట్లు ఆ కావ్యాన్ని వ్రాసిన సాహితీ దురంధరుడు.ప్రభావతీ ప్రద్యుమ్నము అం ఏఒక్క ప్రబంధాన్ని గూడా సూరన గారు వ్రాసారు..కళాపూర్ణోదయం లో మణికాంతుడనే పాత్ర చేసిన తీర్ధ యాత్ర లలో పూరీ జగన్నాథం ,శ్రీకూర్మం అహోబిలం క్షేత్రాల తో పాటు తిరుపతి గూడా వర్ణించ బడింది.శ్రీవెంకటేశ్వర స్వామీ వారిని సూరన గారు వర్ణించిన రీతి శైలీ అపూర్వం అతి అతి విశిష్టం.

                                                              Karavadi Raghava  Rao 

   Raghava Rao Karavadi...


__._,_.___

Posted by: karavadi raghavarao <karavadiraghavarao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: