Re: [racchabanda] హరి హరి యని ..

 

Suprabha gArU:  2 va  padyaMlO  mIru   ``kalamula rANiki pati ataDu''   annAru.
idi  ``hari'' ni guriMci  ceptunnAru kadA?  ``kalamula rANi''   aMTE  sarasvati kadA?
AviDa Barta  Hari  kAdu, Brhma.   kanuka idi  tappu anukuMTunnAnu.
mUrti.

2018-07-23 12:41 GMT-04:00 suprabha u saarada@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com>:


హరి హరి యని ..
--------------------

--

మాత్రాబద్ధము (13)
గేయము

--

తొలి యేకాదశి శుభదినము
తలఁపుల నిలుపుచు శ్రీహరిని
కొలిచెదరెందఱొ సన్మతులు 
కలిగిన దానిని నర్పించి

--

కలుములరాణికి పతియతఁడు
వెలుఁగులఁజిమ్మెడి విభుఁడతఁడు
కలఁడో లేఁడో యను శంక 
కలుగనీయకుఁడు మదిలోన

--

హరి హరి యనుటే చాలునుగ
హరియించఁగ మన పాపములు
కరుణను బ్రోచెడి తాత యయి
హరియే దరికినిఁ జేర్చునుగ

--

ఆకులు పూవులు నీరయిన 
శ్రీకరుఁడెంచును భక్తినిడ 
కైకొని యవియే ప్రీతిమెయి
కాఁకను దీర్చెడి ఘనుఁడతఁడు

--

వాకొనె మనకయి వేదములు 
చేకొనె నెన్నియొ రూపములు
పోకిరి దైత్యుల నణగార్చి 
ప్రాకటముగ నిలఁ గాచుటకు 

--

స్మరణమాత్రమున మన్నించు
హరుఁడును  జెలుఁడై సుఖియించు 
చిఱుచిఱు నగవుల మురిపించు
పరమ సుఖంబును గలిగించు

--

గురుఁడై జగతికి నందించె
ధరపై ధర్మము నిలుపుటకు
సరియౌ దారిని నడపుటకు 
వరముగ గీతా శాస్త్రమును 

--

నిరతినిఁ గొలుచుట యిష్టమగు 
పరపీడామతి నచ్చదను 
నెరుగుట యాత్మను శ్రేయమను
నరయఁగ నందఱు నొక్కటను 

--

శక్తియు యుక్తియు రూపించి 
భక్తుల కెల్లెడ రక్షయగు 
వ్యక్తము చేసిన నాకాంక్ష
ముక్తియునొసఁగెడు దైవమగు

--

హరి హరి యని మఱి పలికెదమ
మఱువక నిత్యము దలఁచెదమ  
హరిపదమెదలో నిలిపెదమ
స్థిరమగు భక్తినిఁ గొలిచెదమ

--

వరదుని ధ్యానము సలిపెదమ
సరగునఁ గృపఁగొని వెలిగెదమ

--

సుప్రభ
1:56 AM
07-23-2018
 

 



__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: