www.telugubhakti.com Digest Number 4711

13 Messages

Digest #4711
2
Ramayanam by p_gopi_krishna
3.1
Positive Life by p_gopi_krishna
4a
Satsangam by p_gopi_krishna
5.1
Quotable Quote by p_gopi_krishna
5.2
Quotable Quote by p_gopi_krishna
5.3
Quotable Quote by p_gopi_krishna
6.1
Sri Satya Sai Baba by p_gopi_krishna
7.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
7.2
Srimad Bhagavad Gita by p_gopi_krishna
8
10

Messages

Thu Jul 5, 2018 6:10 am (PDT) . Posted by:

p_gopi_krishna

*రామాయణ కల్పవృక్షమమును విష వృక్షముగా చిత్రీకరిస్తూ చేస్తున్న విషపు తేళ్ళ దాడులు – వాటిని తొక్కిపెట్టి మదమణచే రామనామాంకిత సమాధానములు.*
(చదివి Share చేయగలరు)

రామాయణము పైనా శ్రీ రాముడి పైనా బురద జల్లే ప్రయత్నాలు మంద బుద్ధులు మరియు వక్రపు బుద్ధులు కలిగిన వారు ఏనాటి నుంచో చేస్తూనే ఉన్నారు, కానీ అవి ఏవీ నిలువక ఆ నిశాచరుల చీకటి వలన మరింతగా రామాయణపు వెలుగు విలువ మరింతగా వెలుగులోకి వచ్చి దేదీప్యమానముగా వెలుగొందుతున్న రామ నామమమును చూస్తున్ననూ ఆ చీకటి బుద్ధులకు తెలియకున్నది ఏమనగా, ఎప్పటివరకు ఈ భూమి పైన నదులూ పర్వతాలూ చెట్లూ మనుష్యులూ ఉంటారో అప్పటి వరకు రామ నామమూ రామాయణమూ గానము చేయబడుతూనే ఉంటుంది. ఇది సాక్షాత్తు బ్రహ్మ ఉవాచ.

ఒకసారి వారు బుద్ధి తక్కువతో లేదా వక్రబుద్ధితో చేస్తున్న వక్రీకరపు నిందారోపణలు కొన్ని తీసుకుంటే వాటిలో శంబూక వధ, వాలి వధ,విభీషణుడి సహకారం, రావణుడి గుండె కిందకు బాణము వేసాడన్న అపోహ, సీతా అగ్నిప్రవేశం, సీతాదేవిని విడిచిపెట్టుట వంటి ముఖ్యమైన 6 వక్రీకరపు నిందారోపణలు వాటి అసలు యదార్ధ విషయములను ప్రామాణికముగా అతి క్లుప్తముగా పరిశీలిద్దాము.

గమనిక : *నేను ఎంతో కాలముగా పరిశీలన చేసి విశ్లేషణ చేసిన నా కృషిని కొంతైనా గుర్తించి నా పేరుని మార్చి మీ పేరులు వేసుకోవద్దని అది ధర్మము కాదని విజ్ఞప్తి.*

1)*రావణుడి గుండెకు కాక పొట్టలోకి రాముడు బాణమేసెనా? ఇది కూసిన వారికి మతి భ్రమించినదా ఏమి ?* :

(వాల్మీకి రామాయణం 111వ సర్గము 18, 19, 20 శ్లోకములు)
స విసృష్టో మహా వేగః శరీరాంతకరః శరః ! బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః !!

రుధిరాక్తః స వేగేన జీవితాఽన్తకరః శరః ! రావణస్య హర న్ప్రాణాన్ వివేశ ధరణీ తలమ్ !!

స శరో రావణం హత్వా రుధిరాఽర్ద్రీ కృత చ్ఛవిః ! కృత కర్మా నిభృతవత్ స్వ తూణీం పునః ఆవిశత్ !!

అనగా రాముడు మహా వేగముగా విడిచిపెట్టిన బ్రహ్మాస్త్రము అతి వేగముగా వెళ్ళి దురాత్ముడైన రావణుడి వక్షస్థలమున నాటుకొని అతడి హృదయముని చీల్చి వేసెను. శత్రువులను సంహరించటంలో తిరుగులేని ఆ అస్త్రము రావణుని ప్రాణములు హరించి రక్తసిక్తమై, మరుక్షణమే భూమిలోని ప్రవేశించి రావణుని హతమార్చిన పిమ్మట ఆ శరము తిరిగి శ్రీరాముని తూణీరమున చేరెను.

ఇందులో అసలు రాముడు రావణాసురుడు పొట్టపైన గురి పెట్టడం ఎక్కడ ఉంది? గుండె కిందకు బాణాలు వేయడం ఎక్కడ ఉన్నది?అంత స్పష్టంగా ఉంటే ఒక పక్కన ఈ విధంగా అనాలోచిత ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉన్నదా? జ్ఞానం ఉన్నదా? పోనీ తెలిసి మరీ చేస్తుంటే సత్యాన్ని అసత్యంగా వక్రీకరించి తెలియని వారికి తప్పుగా చూపించడానికి సిగ్గూ మానాభిమానాలు ఉన్నవా?ఎందుకు అటువంటి నీచ జన్మ?? ఇటువంటి వక్రీకరణలు చేసే దుర్బుద్ధులకు ప్రమాణీకముగా బుద్ధి చెప్పవలసిన అవసరము అప్పుడప్పుడూ ఉంటుంది.

______________________________________________________

2) *రావణ వధలో విభీషణుడి సహకారం* :

విభీషణుడు రావణుడికి చేసిన ధర్మ హితభోధ రుచించని వాడై యుండగా విభీషణుడుని రావణుడు ఇంద్రజిత్తులు ఎంతగానో తూలనాడి నిందించడము జరిగినది (యుద్ధకాండ 15వ 16వ సర్గలు). ఎంతగానో హెచ్చరించినా రావణుడు వినకుండని వాడై ఉండగా, ఇక ధర్మస్థాపన కొరకు తప్పక అధర్మ పరుడైన రావణుడిని వీడి విభీషణుడు మూర్తీభవించిన ధర్మాత్ముడైన రాముడిని చేరి శ్రీ రామ శరణార్తుడయ్యేను(యుద్ధకాండ 17వ సర్గ).

*సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి యాచతే | అభయం సర్వ భూతేభ్యో దాదామ్యే తద్వ్రతం మమ ||*

*ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమాస్యాభయం మయా |విభీషణోవా సుగ్రీవ యది వా రావణః స్వయం || * *(యుద్ధకాండ 18వ సర్గలో 35, 36 శ్లోకాలు)*

"నేను నీవాడను అని పలుకుతూ సర్వ భూతములలో ఎవరు నన్ను శరణుజొచ్చిననూ నేను తప్పక అభయమిస్తాను ఇది నేను బూనిన వ్రతము. సుగ్రీవా విభీషణుడికి నేను అభయమిచ్చుచున్నాను అతనిని తీసుకొని రమ్ము, అతనికే కాదు స్వయంగా రావణుడు వచ్చి శరణుకోరినా నేను అభయమిస్తాను ఇది నా వ్రతము" అని తాను శరణార్ధులను ఆదుకునే వ్రతము బూనిన విషయమును శరణాగత వత్సలుడైన శ్రీ రాముడు విభీషణుడుకి శరణమిచ్చి తనను తన వాడిగా అంగీకరించాడు. తన వాడుగా మారిన విభీషణుడు ధర్మము కొరకు శ్రీరాముడుకి రావణుడి బలాబలగములు చెప్పడములో ఎట్టి దోషమూ ఉండదు ఎందుకనగా తాను అప్పుడు రాముడి పక్షము వాడు.

*తేన చేమం మాహాప్రాజ్ఞమ్ అభిషించ విభీషణమ్ | రాజానం రక్షసాం క్షిప్రం ప్రసన్నే మయి మానద ||*

*ఏవ ముక్తస్తు సౌమిత్రిః అభ్యషించద్విభీషణమ్ | మధ్యే వానరముఖ్యానాం రజానాం రాజాశాసనాత్ ||* *(యుద్ధకాండ 19వ సర్గ 26, 27 శ్లోకములు)*

శ్రీరాముడు విభీషణుడి ధర్మనిరతికి సంతుష్ఠుడైన వాడై లంకా రాజ్యానికి రాజుగా ఇటువంటి ధర్మాత్ముడే రాజుగా ఉండవలెనని ఎరింగిన వాడై లక్ష్మణుడితో వెంటనే సముద్ర జలమును తీసుకురమ్మని మిక్కిలి బుద్ధిమంతుడైన విభీషణుడికి ఆ జలముతో లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుని గావింపమని చెప్పెను. ప్రభువైన శ్రీ రాముడి ఆదేశము శాసనముగా భావించిన లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షమున ఆ సముద్రజలములతో లంకకు విభీషణుని రాజుగా అభిషిక్తుని చేసెను.

శ్రీరాముడి యుద్ధము లంక పైన కనుక లంక తనదే అవుతుంది కావున లంకకు విభీషణుడుని ముందుగానే రాజ్యాభిషేకం చేసెను. అప్పుడు లంకలో ఉన్నవాడు రావణుడుని సంహరించడానికి తన సామంతుడైన వాడు అందునా శరణార్తిగా వచ్చి తన వాడైన విభీషణుడి సలహాలు కాదు కదా యుద్ధములో తనను పాలుగొమ్మనడం కూడా ధర్మమే అవుతుంది.

ధర్మాధర్మ విచక్షణలు ఎరుగని వారు, అసలు వాల్మీకి రామాయణమే సరిగా చదవక ఏ సినిమాలలోనో లేక సీరియళ్ళలోనో చూసి లేక ఎవరెవరో రాసుకున్నవి చదివి వీరికంటూ ఒక స్వంత అభిప్రాయాలు లేక ప్రమాణీకాలకూ అప్రామాణికాలకూ తేడా తెలియని మంద బుద్ధుల మాటలు అసలైన చరిత్రకు విరుద్ధంగా ఉండడంలో ఆశ్చర్యము లేదు.

అటువంటి అల్పబుద్ధులు వక్రబుద్ధులు కలవారికి ఈ విషయమును ఈ విధమున కనీస క్లుప్తముగా తెలిపి నోర్లు మూయించుట ఎంతేని అవరసరము.

3)*వాలి వధ* :

మీరూ నేనూ కాదు వాలి తాను మరణిస్తున్నప్పుడు వాలియే అడుగుతాడు, ధర్మావతార శ్రీ రామా ఈ విధంగా నేను వేరొకరితో యుద్ధము చేయుచుండగా నా పై ఈ విధంగా బాణము విడిచి నన్ను సంహరించదలచడం నీకు తగునా ? అని..

దానికి శ్రీరాముడు ఇచ్చిన ధర్మయుక్త సమాధానము

*కిష్కిందకాండ 18వ సర్గలో 4 నుంచి 12 శ్లోకములు*

"ఓ వాలీ ధర్మార్ధ కామములను లౌకిక ఆచారములను తెలుసుకొనక నన్ను తప్పుబడుతున్నావు, ఈ భూమి(జంబూద్వీపము) అంతయూ ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనములోనిది, పాదుకా పట్టాభిషేకము చేసి రాజుగా భరతుడు దీనిని ధర్మయుక్తముగా పాలించుచున్నాడు. మేము మరియు ఇతర రాజులు ధర్మబద్ధులై ధర్మాన్ని రక్షించడానికి ఈ భూమిపై సంచరించుచున్నాము. అటువంటి ఈ ధర్మముతో నిండిన రాజ్యములో అధర్మ వర్తనులుగా ఉన్నవారిని దండించడము ధర్మమును నిలుపడమూ మా కర్తవ్యము.

*కిష్కిందకాండ 18వ సర్గలో 13, 14, 17, 18, 19, 20 ,21, 28 శ్లోకములు*

నీవు ధర్మము తప్పి ఉన్నావు, ధర్మము ప్రకారము తనకంటే చిన్నవాడైన తమ్ముడు, తన కడుపున పుట్టిన వాడు, తన వద్ద విద్యనభ్యసించిన వాడు వీరు ముగ్గురూ తనకు పుత్రులు వంటి వారు. నీవు నీ కొడుకు వంటి తమ్ముడు బతికి ఉండగానే బలవంతముగా నీ కోడలి వంటి అతని భార్యను పొంది సుఖిస్తున్నవాడివి. ఒక తండ్రి కూతురిని బలవంతముగా పొందినటువంటి అధర్మము ఇది. దీనికి మరణమే దండనము. నీ తమ్ముడు నావద్దకు వచ్చి దుఃఖించి మొరపెట్టుకున్నప్పుడు ధర్మము రక్షించవలసిన నేను అతనికి మాట ఇచ్చితిని నిన్ను దండించి తనకు రాజ్యమును తన భార్యను ఇస్తానని.

*కిష్కిందకాండ 18వ సర్గలో 39, 40, 41, 42, 43, 44 శ్లోకములు*

పైగా ధర్మముగా జీవించు వారిపై దాడి చేసే క్రూర జంతువలను వేటాడి సంహరించి వారిని కాపాడుట క్షత్రియ ధర్మము ఎందుకనగా ధర్మమున నివసించు వారిని నడిపించి వారి జీవనాధారము చూస్తూ వారి ప్రగతి కోసం కృషి చేసేది రాజే. నీవు శాఖా మృగమైన వానరుడవు, మృగములను వల వేసినైననూ, ఎదురుగానైననూ లేక పొంచి ఉన్ననూ అనేక ఉపాయములలో వేటాడవచ్చును. నిన్ను ఎటునుంచి అయిననూ నేను వేటాడి సంహరించవచ్చును,ఎందుకనగా ధర్మములో ఉన్న వారిపైన నీవు ధర్మము తప్పి క్రూరముగా దాడి చేసిన శాఖా మృగానివి. కాబట్టి ఏ విధంగా చూసినా నిన్ను ఈ విధముగా వధించడము ధర్మమే." అని ఈ విధముగా శ్రీ రాముడు ధర్మమును వాలికి తెలియజేయగా వాలి దానికి పూర్వము రాముడిని నిందించినందు భాధపడి రాముడి ధర్మ భోధను అంగీకరించి నమస్కరించి తన పుత్రుడైన అంగధుడిని శ్రీరాముడికి అప్పగించాడు.

*కిష్కిందకాండ 18వ సర్గలో 47, 48, 49, 50, 51, 52, 53, 54 శ్లోకములు*

వాలి వధ విషయములో రాముడిని నిందించిన వాలికి అందులో ధర్మమును శ్రీరాముడు తెలుపగా వాలియే దానిని తెలుసుకుని మనస్ఫూర్తిగా అంగీకరించి శ్రీరాముడి ధర్మమును కీర్తించి అప్పటివరకూ తాను ఉన్న అధర్మమును ఎరిగి శ్రీరాముడుకి నమస్కరించి తన కుమారుడిని కూడా శ్రీరాముడి చేతిలో పెట్టినప్పుడూ, ఇవన్నీ స్పష్టముగా వాల్మీకి రామాయణములోనే వివరించి ఉన్నప్పుడూ వాలికి లేని అభిప్రాయ భేధము రాముడిని దూషించే కుహానా మేధావులకు ఎందుకు? కేవలం రామాయణముపైన విషము చిమ్మే వారి వక్రపు బుద్ధి కాదా ?అటువంటి వారిని ప్రామాణీకముగా కొంతైనా విశ్లేషణాత్మక సమాధానములతో నోరు మూయించుట నేడు అవసరము.

-----------------------------------------

4)*సీతమ్మ అగ్నిప్రవేశం* :

రావణ సంహారణాంతరము సీతమ్మ అగ్ని ప్రవేశము చేసిన విషయము అందరికీ తెలిసినదే. కానీ ఈ కాలములో దాదాపు జనులు వాల్మీకి రామాయణం చదవని కారణంతో కుహానా మేధావుల కుట్ర పూరిత వ్యాఖ్యల వలన ఆనాడు అందరూ అర్ధము చేసుకున్ననూ నేడు మాత్రం శ్రీ రాముడికి అపవాదులు తప్పడం లేదు, దానికి రామాయణం చదవని వారి సంఖ్య ఎక్కువ ఉండడమే కారణం అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

ఆ ఘట్టము క్లుప్తముగా ఒకసారి చూస్తే – రావణ సంహారణాంతరము విభీషణుడు సీతమ్మను పల్లకీలో శ్రీరాముడి ముందుకి తీసుకురాగా..
*తాం తు పార్శ్వస్థితాం ప్రహ్వాం రామః సంప్రేక్ష్య మైధిలీమ్ |హృదయాంతర్గత క్రోధో వ్యాహర్తుమ్ ఉపచక్రమే ||* (యుద్ధకాండ 118వ సర్గ – 1వ శ్లోకం)

అనగా అంతట శ్రీరాముడు తనపక్కనే వినమ్రతతో నిలబడి ఉన్నసీతాదేవిని చూసి తన మనస్సులో నిఘూఢముగా ఉన్న గిలిని అంటే లోకాప వాద భయమును ఆమెతో ఈ విధముగా ప్రకటించాడు.. అంటే ఆ తరువాత తాను మాట్లాడబోయే ప్రతి మాట తాను ఉద్దేశపూర్వకముగా మాట్లాడుతున్నది కాదు కేవలం లోకులు కాకులనే ఉపమానం ఉన్నది కనుక లోకులు రావణుడి అపహరణలో ఉన్న సీతా దేవి గూర్చి అపవాదాలుగా చేసే వ్యాఖ్యలకు భయపడి అవి జరుగకుండడం కోసము తాను సీతాదేవి యొక్క పాతివ్రత్యము గూర్చి అందరికీ నిరూపితము చేయడం కొరకే తాను ఇలా మాట్లాడినట్టు అసలు ఈ ఘట్టము మొట్ట మొదటి శ్లోకములోనే తేటతెల్లముగా ఉన్నది. అది కప్పి పుచ్చి ఈ నాటి పిచ్చకాకి లోకులు కొందరు రాముడి మీదనే అపవాదాలు తీసుకురావడం వారి వెర్రికి పరాకాష్ఠ.

రాముడు తాను ఆ సంధార్భములో పరుషముగా మాట్లాడుతూనే ఒక మాట అంటాడు,
*ప్రాప్త చారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థితా ! దీపో నేత్రాఽఽతుర స్యేవ ప్రతికూలాఽసి మే దృఢమ్ !! (యుద్ధకాండ 118వ సర్గ 17వ శ్లోకం)*
అనగా నీవు రావణుడి అపహరణలో కొంత కాలముండి ఇప్పుడు నా ముందు ఉండడం వలన నీ ప్రవర్తన విషయములో నాకు సందేహం కలుగుతున్నది ఎందుకనగా నేత్ర రోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నీ విషయములో నాకు ఇలా కనిపిస్తున్నది అని అంటాడు..
దానిలోనే అర్ధమవుతున్నది అసలు సీతాదేవిలో ఏ దోషమూ లేదన్న విషయము తనకి తెలుసునని కానీ ఇంతకు ముందు తను అనుకున్న విధముగా లోకాపవాదములకు భయపడి సీతాదేవికి అంటువంటి అపవాదులు రాకూడదని తనను తానే అనుకుంటున్నట్టుగా ఆ అనబోయే లోకులను అంటూ నేత్ర రోగము ఉన్నవారి కంటికి నిన్ను చూడటం ఇష్టముందడు ఎందుకంటే నీవు దీపపు కాంతివి అనగా నీలో ఎటువంటి దోషమూ లేదు అని రాముడు చెప్పకనే చెప్పాడు.

ఆ తరువాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే రాముడు సీతమ్మను రావణుడి అపహరణలో ఉన్న తనను రాజుగా స్వీకరించలేను అని అనడము సీతమ్మ దానికి ఆవేదనతో సమాధానము తెలుపడము అగ్ని ప్రవేశము చేయడమూ, శివ బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యి శ్రీరాముడికి చెబుతునట్టుగా అందరికీ సీతా దేవి యొక్క పాతివ్రత్యము తన యొక్క వైశిష్ట్యము తెలుపడము రామాయణములో చూడవచ్చును. ఆ తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యి తాను దహించలేని సీతమ్మ పాతివ్రత్యము గూర్చి ప్రకటితము చేయడము తెలిసినదే.

దేవతలతో సహా అక్కడి వారందరికీ అదే విధముగా రాబోవు కాలములో యుగ యుగాలలో అందరికీ తెలిసేలా తన అసలు ఉద్దేశము తన మాటలలో శ్రీ రాముడు ఈ విధముగా తెలియజేసినది ఏమనగా
*యుద్ధకాండ – 121వ సర్గ – 14, 15, 16, 17 శ్లోకములు*

అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాప మఽర్హతి ! దీర్ఘ కాలోషితా చేఽయం రావణాఽన్తః పురే శుభా !!

బాలిశః ఖలు కామాఽత్మా రామో దశరథాఽత్మజః ! ఇతి వక్ష్యన్తి మాం సన్తో జానకీ మఽవిసోధ్య హి !!

అనఽన్య హృదయాం భక్తాం మ చ్చిత్త పరివర్తినీమ్ ! అహ మఽప్యఽవగచ్ఛామి మైథిలీం జనకాఽఽత్మజామ్ !!

ప్రత్యయార్ధం తు లోకానాం త్రయాణాం సత్యా సంశ్రయః |ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం ||

అనగా "అగ్నిదేవా సీతాదేవి యందు ఎటువంటి దోషమూ లేదు తను పవిత్రురాలు, కానీ రావణుని అపరహరణలో ఉండుట చేత లోకాపవాదములు రాకుండగా తన పాతివ్రత్యము ముల్లోకముల వారికీ నిరూపించుటకు ఈ పరీక్ష నెరపవలసి వచ్చినది. ఎటువంటి పరీక్ష లేకుండా నేను స్వీకరిస్తే దశరధ రాముడు మూర్ఖుడు కామాతురుడునని అదే లోకులు నిందిస్తారు. జానకి తన మనస్సు నాయందే నిలిపుకుని నా మనసు ఎరిగే ప్రవర్తించునని నేను కూడా ఎరుగుదును, సత్య వ్రతుడనైన నేను సీతాదేవి శీలమును ముల్లోకములకు విశ్వసించుటకు మాత్రమే సీతా దేవి అగ్ని ప్రవేశము చేస్తున్ననూ ఉపేక్షిస్తున్నాను. అంతే కానీ ఈమెను నేను పరిత్యజించుట అసంభవము. "

ఈ విధముగా రాముడే తన ఉద్దేశములను పరిపూర్ణముగా తేటతెల్లముగా చెప్పినప్పుడు, దానికి సీతమ్మతో కలిసి అందరూ ఆనందించి రాముడిని తన ధర్మనిష్ఠకు అందరూ కీర్తించగా సీతమ్మకే ఆనందము కలిగితే, ఈ కుహానా మేధావులకు కలుగవలసిన మానసిక అశాంతి ఏమీ లేదు. వారి మాటల వెనుక వారి కుళ్లూ కుతంత్ర కుట్రలు ఏమిటో గ్రహించి వారికి తగిన బుద్ధి వెనువెంటనే తెలుపగలరు.
_____________________________________________________

5)*సీతమ్మ వాల్మీకీ మహర్షి ఆశ్రమ ప్రవేశం* :

మొట్ట మొదటిగా సీతమ్మను శ్రీరాముడు అడవులలో వదిలేశాడు అని తెలియక కొందరు అమాయకులూ వారితో పాటు తెలిసి కూడా కొందరు కుహానా మేధావులూ అంటారు. కానీ శ్రీ రాముడు సీతమ్మను వదిలేయడము కాదు అది, అడవులలో అంతకన్నా కాదు. శ్రీ రాముడు లక్ష్మణుడుతో తమసా నదీ తీరములో గల వాల్మీకీ మహర్షి ఆశ్రమ సమీపములో రధములో తీసుకువెళ్లి విడిచి పెట్టమని చెప్పాడు. అంటే శ్రీ రాముడు తన ప్రాణ సమానురాలైన సీతాదేవిని మహర్షి ఆశ్రమములో నివసింపజేయుటకు నిశ్చయించాడు. అంతే కానీ అది అడవులలో వదిలేయుట కాదు.(ఉత్తరకాండ 45వ సర్గలో 16, 17, 18 శ్లోకములు).

మరి తన ప్రాణ సమానురాలైన భార్యను ఏక పత్నీ వ్రతుడైన శ్రీ రాముడు ఎందుకని ఆశ్రమము వద్ద విడిచి పెట్టమని పరమ దుఃఖముతో చెప్పవలసి వచ్చినదో తెలుసుకోవలసి ఉన్నది.

శ్రీరాముడు తన సభలో ఆసీనుడై రాజ్యములో ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో సమగ్రముగా తెలుపమని సభలోని భద్రుడను వాడిని ప్రశ్నించగా, భద్రుడు రాముడికి అంజలి ఘటించి నమస్కరించి రాజ్యములోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తమ పాలనకు ఎంతగానో సంతుష్థులై భోగభాగ్యలతో ఉన్నారని తెలిపాడు. అప్పుడు రాముడు ఉన్నది ఉన్నట్టుగా తెలుపుము రాజుయొక్క గుణదోషాల గూర్చి ప్రజలు చర్చించుకొనుట సహజమే కదా నిర్భయముగా తెలుపమని తిరిగి ప్రశ్నించాడు..

*ఈ సందర్భములో చాలా మంది ఇక్కడ ఒక కులములోని వ్యక్తి చేసిన వ్యాఖ్యగా చిత్రీకరణ చేసుకొని చెప్పుకుంటారు, అది కేవలం సినిమా ప్రభావం మాత్రమే, వాల్మీకి రామాయణములో ఆ విధముగా లేదు.*

అప్పుడు భద్రుడు నమస్కరించి రాజ్యములో అన్నీ చోట్లా అందరునూ మీ గుణదోషముల గూర్చి ఈ విధముగా మాట్లాడుకుంతటున్నారు "శ్రీ రాముడు అద్భుతమయిన సేతువు నిర్మించాడు, ఎందరో రాక్షసులనూ దుర్జయుడైన రావణుడిని సంహరించాడు. కానీ యుద్ధమున గెలిచి తన రోషమును విడిచి పెట్టి సీతాదేవిని స్వీకరించి ఆమెను మరల భవనమునకు తీసుకు వచ్చాడు.

*అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి | యధా హి కురుతే రాజా ప్రజాతమనువర్తతే || (ఉత్తరకాండ 43వ సర్గలో 19వ శ్లోకం)*

కొంత కాలము పరుల చెంతన రావణ అపహరణలో ఉన్న భార్యను రాముడు ఎందుకు ఏవగించుకోవడము లేదు? ఇక మనము కూడా మన భార్యల యందు ఇట్టి సహనమునే చూపవలసి వచ్చునేమో,రాజు యొక్క మార్గమునే ప్రజలు అనుసరిస్తారు కదా " అని ఈ విధముగా అనుకుంటున్నారని భద్రుడు తెలిపాడు.

*తరువాత ఉత్తరకాండ 45వ సర్గలో 11, 12, 13 శ్లోకములలో* శ్రీ రాముడు తన తమ్ములతో భాధతో దుఃఖిస్తూ పలికిన మాటలు చూస్తే " సీతాదేవి గూర్చి పౌరులలో ప్రజలలో వ్యాపించుచున్న దుర్భర అపవాదము, నా పై వారిలో ఏర్పడిన ఏవగింపు నా హృదయాన్ని ఎంతగానో కలవర పరుస్తున్నది. అందువలన నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. లోకములో ఎవరికైననూ అపకీర్తి వస్తే ఆ అపకీర్తి నిలిచి ఉన్నంత వరకూ వారు అధోలోకములలో పడిపోతారు, అటువంటి అపకీర్తిని దేవతలు కూడా నిందిస్తారు." అని అంటాడు. దీని అర్ధమేమనగా రాజైన తనకు ఆ అపకీర్తి వలన వచ్చే అధోగతి వలన దేవతలు కూడా నిందించే అపకీర్తి వలన తాను రాజైనందున రాజ్యము పైనా ప్రజల పైన కూడా ఆ ప్రభావము తప్పక పడి రాజ్యములో రాజ్య ప్రజలలో సుఖ సంతోషాలకు బదులు దుఃఖములు కలుగవచ్చునని భాధపడినవాడు ప్రజలకు తండ్రి వంటి రాజైన శ్రీ రాముడు.

తరువాత మళ్ళీ ఉత్తరకాండ 45వ సర్గలో , 14, 15 శ్లోకములలో* "నేను ఈ లోకాపవాదముల వలన కలుగు భాధతో సోదరులైన మీతో సహా నా ప్రాణములను కూడా త్యజించడానికి వెనుకాడను,ఇక సీతా దేవి విషయము చెప్పనేల? అందువలన అంతులేని శోకములో మునిగి ఉన్న నన్ను గమనించండి. నా దృష్టిలో రాజుగా ఉన్న నాకు ఈ మిగుల దుర్భరమైన లోకాపవాదమునకు మించిన దుఃఖమే ఉండదు" అని అంటాడు శ్రీ రాముడు.

దీని అర్ధమేమనగా రాముడు ఈ లోకాపవాదములకు కలిగే భాధకు తన తమ్ముళ్ళనూ ఆఖరికి తన ప్రాణాలనయినా త్యజించాలని అనిపిస్తున్నదని కాబట్టి లోకాపవాదములకు మించిన దుఃఖమే ఉండదని తెలుపుతూ ఇక్కడ రాముడు తెలియజేస్తున్నదేమనగా,తాను రాజు కావడము చేత ఈ లోకోపవాదాలకు కలిగిన భాధలకు తమ్ముళ్లను కానీ ప్రాణాలను కానీ విడిచిపెట్టిన వాడు అయితే అది రాజ్యానికి తీవ్ర నష్టము. కాబట్టి అటువంటి లోకాపవాదమును త్యజించడమే రాజుగా తన ధర్మము.

ఇక్కడ మనము అర్ధము చేసుకోవలసినది రాముడు సీతను విడిచి పెట్టడానికి గల కారణము ఏమిటంటే రాజ్యములో ప్రజలు భావిస్తున్న విధముగా ఒకవేళ వారి భార్యలు ఎవరి చెంతన అయినా కొంత కాలము ఉండి వస్తే వారు కూడా ఆమోదించవలసి ఉంటుందేమో ఎందుకంటే తమ రాజైన రాముడు అలా చేశాడు కదా అని భావించడము. తద్వారా సీతాదేవి అగ్ని పరీక్ష చేసుకుని తనను తాను నిరూపించుకున్ననూ రాముడు అప్పుడు వేదన పడిననూ మరల సీతమ్మకు ఈ లోకాపవాదం తప్పలేదు.

ఇప్పుడు ఆ రాజ్యములో ప్రజలు అనుకుంటున్న విధముగా వారికి సమస్య వస్తే తాను ధర్మము చెప్పవలసి ఉన్నప్పుడు తన విషయములో జరిగినది వారు గుర్తు చేస్తే తాను ధర్మము చెప్పిననూ అది ప్రజలు ఆమోదింపరు, దానికి కారణము ఏర్పడిన లోకాపవాదము. కనుక ఆ లోకాపవాదములని అనగా దానికి కారణముగా కనిపిస్తున్న సీతమ్మను ఒక రాజుగా త్యజించక తప్పదు.

ఇక్కడ అసలు విషయం ఇంకొకటి ఏమిటంటే రాముడి ధర్మ నిష్ఠను సీతమ్మ కూడా అర్ధము చేసుకుని ఆమోదించినది అది మనము *ఉత్తరకాండలో 48వ సర్గలో 13, 14 , 15 శ్లోకములలో చూడవచ్చును*. ఆ సందర్భములో సీతా దేవి తనను వాల్మీకీ ఆశ్రమానికి సమీపములో వదిలిన లక్ష్మణుడితో శ్రీరాముడికి చెప్పమని పలికినదేమనగా "శ్రీరామా లోకాపవాదముల వలన నీ పైన వచ్చిన అపనిందను నేనే తొలగించవలసియున్నది, దానికి నీవు నన్ను ఇక్కడ విడిచితివి. నిత్యము ప్రజలను నీ సోదరులవలె ఆత్మీయతతో చూసుకుంటూ ఉండడము నీకు పరమధర్మము. దీని వలన నీకు శాశ్వత కీర్తి లభించును. నీ ధర్మ నిరతిని బట్టి ప్రజలు కూడా ధర్మ పరాయణులే అవుతారు" అని సీతాదేవి పలికినది. దీని వలన తెలిసినది ఏమనగా, విధి ప్రభావమున జరిగిన సంఘటనలకు లోకాపవాదములకు గాను ధర్మమును ఆచరించవలసి ఉన్నది కనుక ఈ విధముగా రాముడు చేయడమే సబబు అని సీతాదేవి కూడా తెలిపినది.

*శ్రీరాముడు సీతమ్మను ఆశ్రమ వాసానికి పంపిననూ ఇంకొక స్త్రీని వివాహము చేసుకొనెనా? లేదు కదా..* తాను ఎన్నో రాజ్యాలకు రాజై ఎందరో సామంతులను పొందిన దక్షిణ నాయకుడు. తాను ఎందరినో పెళ్లి చేసుకోవచ్చును అయినప్పటికీ తాను ఏక పత్నీవ్రతుడే అయి సీతా వియోగముతో జీవిత పర్యంతమూ అందరినీ మించి దుఃఖించినవాడే కానీ వేరొక స్త్రీని కలలో కూడా ఎరుగని ఏక పత్నీవ్రతుడు. ఇందులో శ్రీరాముడు ధర్మముకు కట్టుబడి ఉండడము తప్ప మరియొకటి ఏమీ లేదు. ఇక్కడ సీతాదేవికీ రాముడికీ ఏకాభిప్రాయము కలిగి ఉండగా, అది కూడా ధర్మముగా ఉండగా మరి ఈ విషయము పైన అయోమయము ఎందుకు వస్తున్నది ! దానికి ఆస్కారమే లేదు. ధర్మము కొన్ని సార్లు కఠినముగానే కనిపిస్తుంది. కానీ అదే ఆచరించిన ధర్మము శాశ్వత కీర్తిని తీసుకువస్తుంది.. అందుకే ఆయన శ్రీరాముడైనాడు ఆమె సీతమ్మ అయినది.

ఇక్కడ మనము గమనించవలసినది ఏమనగా అంతకు పూర్వము తన పినతల్లి కైకేయి తన తండ్రిని అడిగిన వరములకు గాను తన తండ్రి రాముడిని వనవాసముకు పంపుతానని మాట ఇచ్చినప్పటికీ, తరువాత రాముడిని వెళ్లవద్దని అయోధ్యలోనే ఉండమనీ రాజ్యము స్వీకరించమని తండ్రీ అంటాడు, తమ్ముడైన భరతుడూ అంటాడు, ఆఖరికి మాట అడిగిన కైకీయీ అంటుంది,మంత్రులూ అలాగే ప్రజలందరూ అడుగుతారు రాముడిని వెళ్లవద్దు ఉండమని. కానీ తాను అలా వెళ్ళక ఉండిపోతే తన తండ్రికి ఇచ్చిన మాటను వదిలిన వాడిగా లోకాపవాదము రావచ్చునని రాముడు క్షత్రియుడుగా ఆ లోకాపవాదమును రాకుండగా దూరము చేయడానికి తనకు తానే అడవులకు వెళ్ళాడు. అదే ఈ సందర్భములో ఆ లోకాపవాదము విధివశాత్తు సీతమ్మ చుట్టూ తిరుగుతున్నందు వలన సీతమ్మను ఆశ్రమవాసానికి పంపక తప్పలేదు. ఇక్కడ రెండు సందర్భములలో రాముడు తన క్షత్రియ ధర్మముతో లోకాపవాదము రాకుండా ధర్మముకు కట్టుబడి ఉండడము అసలు విషయము కానీ వేరొకటి కాదు. ఈ విషయమును ఇంత విశ్లేషణగా చూడవలసి ఉన్నది.

ఈ విషయము పైన సరైన అవగాహన లేకనో లేక అవగాహన ఉండి కూడా కుటిల బుద్ధితో రాముడి పైన ఆరోపణలు చేయు వారికి విశ్లేషణాత్మకంగా చెబితే అదే వారికి చెంప పెట్టు సమాధానం అవుతుంది.

6) *శంబూక వధ* :

ఈ విషయము పైన కుహానా మేధావులు సనాతన ధర్మముకి చెందిన హిందువులలో అంతః కలహాలు సృష్టించి హిందువులలో ఒక వర్గం వారిని పక్కదారి పట్టించడానికి ఎంతో కాలముగా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది హిందువులు ఈ కుళ్ళు బుద్ధి కలిగి ఉండే కుహానా మేధావుల మాటలకు అదే విధంగా సరిగా అర్ధము చేసుకోలేక పోయిన కొందరు పెద్దల వాఖ్యలకు అమాయకముగా వారి మాటలు నమ్మి ఉన్నప్పటికీ,ఎందరో హిందువులు మన ధర్మములోని విషయములు కేవలం బాహ్యార్ధానికి మాత్రమే అందనివి, సమగ్ర విశ్లేషణ లేనిదే అసలు సరిగా అర్ధమే కానటువంటి ఎంతో నిఘూడమైనవి అని గ్రహించి మన ధర్మముకి కట్టుబడి ఉన్నారు అనేది గ్రహించవలసిన విషయము.

కానీ నేడు ఈ విషయము పైన ఎన్నో అసత్య దుష్ప్రచారాలు జరుగుతున్న తరుణంలో నేను ఈ విషయములోని సూక్ష్మములు ఎందరో అర్ధము చేసుకోవలసిన అవసరము నేడు ఎంతో ఉన్నందున ఆ విషయాన్ని గూర్చి క్లుప్తముగా విశ్లేషించే సాహసము చేయుచున్నాను.

శంబూక వధను ఒకసారి పరిశీలిస్తే ఉత్తరకాండ లో 74, 75, 76 వ సర్గలలో ఈ విషయం గూర్చి సమగ్ర వివరణ ఉన్నది. అది ఆ కాలములో త్రేతా యుగములోన యుగ ధర్మానుసారం ఎలా అన్వయమైనది, ఈ కలియుగములో అసలు ఆ విషయములో ఎటువంటి పక్షపాతము లేని నిష్పక్షపాతము అందరికీ అందుబాటులో ఉండే ఈ యుగ ధర్మము గూర్చి కూడా అందులోనే ఉన్న ప్రస్తావనను క్లుప్తముగా పరిశీలిద్దము.

ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే ఆ రాజ్యములో అకాల మరణాలు ఉండవు. ఒకవేళ సంభవిస్తే ఆ రాజ్యములో ఎక్కడో అధర్మము జరిగినది అని అర్ధము. శ్రీ రాముడు తన రాజ్యమును ధర్మ యుక్తముగా పరిపాలిస్తున్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన కుమారుడైన బాలుడు అకాల మృత్యువుకి లోనైనందున దుఃఖిస్తూ రాజైన రాముడు వద్దకు ఆ వృద్ధుడు తన కుమారుడి కళేబరం తీసుకు వచ్చి చూపిస్తాడు.

ఆ మృతుడైన తన కుమారుడుని చూపించి ఓ శ్రీరామ నేనేమి పాపము చేశానో నా కుమారుడు ఇలా అకాల మృత్యువుకి లోనైనాడు, నా పాపముతో పాటు ఈ రాజ్యముకి రాజువైన నీ దోషము కూడా ఇందులో భాగమై ఈ అకాల మృత్యువుకి కారణము కావచ్చును, ఎందుకనగా ఇతర రాజ్యాలలో ఎటువంటి అకాల మరణాలు లేవు. నీ ఈ రాజ్యములో నీ దృష్టికి రాకుండా ఎక్కడో అధర్మము జరిగి ఉండవచ్చు, కాబట్టి నీవు ఆ అధర్మముని నిర్మూలిస్తే నా పుత్రుడు పునర్జీవితుడవుతాడు ఇది కేవలం అకాల మృత్యువు కనుక, నీవు ఈ కార్యం చేయకున్న నేను నా భార్య ఇక్కడే ప్రాణ త్యాగము చేస్తామని ఆ వృద్ధుడు విలపించెను.

అప్పుడు నారద మహర్షి వచ్చి ఈ బాలుడికి అకాల మృత్యువు ఎలా వచ్చినదో తెలిపెదను వినుము అని
"కృత యుగములో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సులను ఆచరించడానికి యోగ్యులు, వారికి మాత్రమే ఉపదేశముండును,ఇతర మూడు వర్ణముల వారికి ఆ అర్హత ఉండదు.

త్రేతాయుగములో బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపశ్చర్యలకు యోగ్యులే అవడంతో వారి ఇరు వర్ణముల వారూ సమానులుగా ఉంటారు ఈ యుగములో, ఇతర వర్ణముల వారికి తపస్సు చేయుటకు అనుమతి ఉపదేశం ఉండదు.

ద్వాపర యుగములో బ్రాహ్మణ క్షత్రియులతో పాటు వైశ్యులకు కూడా అర్హత కలిగి వారు కూడా తాపసులు కావచ్చును.

*భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే | అధర్మః పరమో రాజన్ ద్వాపరే శూద్ర జన్మనః ||(ఉత్తరకాండ 74వ సర్గ – 27వ శ్లోకము)*

అనగా ద్వాపర యుగము అంతక ముందు యుగములలో యాగధర్మాలను అనుసరించి శూద్ర వర్ణం వారికి తపస్సు చేయుటకు అనుమతి లేకున్నది. కానీ కలియుగములో శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి అందరూ సమానులుగా ఉందురు." కాబట్టి యుగ ధర్మమును ఆచరించి నీ రాజ్యము అంతటా సంచరించి ఎవరైనా అధర్మముని ఆచరిస్తూ ఉంటే వారిని రాజుగా సంహరించి ధర్మమును నిలబెట్టుము,తద్వారా అకాల మృత్యువు బారిన పడిన ఇతడు పునర్జీవుతుడు అవగలడు అదే విధంగా ఎటువంటి అకాల మరణములు ఉండబోవు" అని నారద మహర్షి పలికెను.

అది వినిన రాముడు తన రాజ్యమంతటా తిరుగుతూ శంబూకుడు వద్దకు చేరెను. అక్కడ శంబూకుడు అధోముఖుడై తీవ్ర తపస్సును ఆచరించు చుండగా రాముడు వచ్చి ఆయనను ఈ విధంగా ప్రశ్నించెను. "ఓ వ్రత నిష్ఠాగరిష్ఠుడా నీవు ఎంత ధన్యుడవు. తపోవృద్ధుడా నీ జన్మ ఎట్టిది? నీ శక్తి సామర్ధ్యములు ధృడమైనవి కావున కుతూహలముతో ఈ విధంగా అడుగుతున్నాను. నేను దశరధ కుమారుడైన శ్రీ రాముడిని. నీవు ఈ ఘోర తపస్సు ఏమి ఆశించి ఎందుకు చేయుచున్నావు? నీకు కావలసిన వరమేమి?స్వర్గ భోగములు కావలనా వాటికి మించినవా తెలుపుము " అని అడిగెను.

దానికి శంబూకుడు "శ్రీరామా నేను శూద్రుడను నా పేరు శంబూకుడు. ఈ శరీరముతోనే దివ్యత్వమును పొందగోరుచున్నాను. శూద్రుడైన నేను దేవలోకమును జయింపదలచి ఇట్టి ఉగ్రతపస్సును పూనుకుంటిని, నా పలుకులు నిజము" అని తెలుపగా శ్రీరాముడు తనని వధించడం జరిగినది అది కూడా ఆ యుగ ధర్మాలను అనుసరించి రాజుగా తన ధర్మముతో.

ఇక్కడ అందరూ ముఖ్యముగా గ్రహించ వలసినవి కొన్ని ఉన్నవి :

- > శంబూక వధ జరిగినది తను శూద్రుడు అని ఈ కలియుగములో మనము చర్చలు చేసుకోడానికి కాదు. ఆ యుగములోని ధర్మము అది. అది కూడా ఆ యుగములో వారు అటువంటి ఉగ్రతపస్సు చేయడం చేత ధర్మానికి హాని కలుగుతుంది కనుక.

- > ఇక్కడ శూద్రుడైన శంబూకుడు ఆ యుగ ధర్మముకి విరుద్ధముగా తపశ్సు చేయడం వలన వధ జరిగినది కానీ కేవలం శూద్రుడు కావడం చేత కాదు.. రామ రాజ్యములో ధర్మములో ఉన్న శూద్ర వర్ణము వారు అందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు అనే శ్లోకాలు రామాయణములో అనేకము కలవు.

- > శ్రీ రాముడు ఈ సంధర్భములో శంబూకుడుని వధించినది కేవలం ఒకరి వర్ణం వారి కోసమే కాదు లేక ఒక వర్ణం పైన కోపముతోనూ కాదు. తన రాజ్యములో అన్నీ వర్ణాల వారు అకాల మృత్యువులు లేకుండగా ఉండేందుకు. శంబూకుడు అనే అధర్మము చేస్తున్న ఒక్క శూద్రుడుని వధించినది అనేక మంది పిల్లలను అకాల మృత్యువు కలుగకుండా తన ధర్మముతో కాపాడేందుకు, అందులో ఎందరూ శూద్ర వర్ణముకి చెందిన బాలురు కూడా ఉంటారు అదే రాజ్యములో అనేది కూడా గ్రహించవలసిన విషయం.

- > శ్రీ రాముడు అన్నీ వర్ణాల వారిని సుఖ శాంతులతో జీవించేలా చూసుకున్నాడు అనేది వాల్మీకి రామాయణంలో రామ రాజ్య వర్ణనలో స్పష్టంగా చూడవచ్చును. ఇక్కడ ఈ సందర్భములో అధర్మముతో ఉన్న ఒక శూద్రుడుని వధించాడు. కానీ అదే రామాయణంలో అధర్మముతో ఉన్న క్షత్రియులనూ సంహరించాడు,అదే రామాయణంలో పరశు రాముడు ఎందరో అధర్మముతో ఉన్న క్షత్రియులను సంహరించిన వృత్తాంతం గురించి కూడా చూడవచ్చును . అదే రామాయణంలో రాముడి ఆదేశానుసారం శత్రుజ్ఞుడు అధర్మము చేసిన గంధర్వుడిని సంహరించడం కూడా చూడవచ్చును. అదే రామాయణంలో అసలు ఒక బ్రాహ్మణుడైన రావణుడిని చంపడానికే రాముడు పుట్టాడు కదా!! అధర్మపరుడైన ఒక బ్రాహ్మణుడైన సాక్షాత్ బ్రహ్మ వంశముకి చెందిన రావణ బ్రహ్మ అను బ్రాహ్మణుడిని కూడా సంహరించడం జరిగినది. *బ్రహ్మ వంశముకి చెందిన రావణబ్రహ్మ అనబడే రావణుడు బ్రాహ్మణుడు కాదు అనుకోవడం కొందరి అయోమయమో లేక అమాయకమో లేక ఉద్దేశపూర్వక వక్రపు ఆలోచనలో వారికే తెలియాలి మరి. !!*

కాబట్టి శంబూక వధ శూద్రుడిని వధించడంగా కాకుండా అధర్మపరుడిని వధించడం అనీ, ఒకసారి అధర్మ పరుడైన బ్రాహ్మణుడు ఒకసారి అధర్మ పరుడైన శూద్రుడు అలాగే అధర్మ పరులైన క్షత్రియులను ధర్మము కోసం వధించడం జరిగినదని దాని వలన పదకొండు వేల సంవత్సరాలు రాముడు పాలించిన రామరాజ్యంలో అన్నీ వర్ణాల అందరూ ఆనందముగా సుఖ సంతోషాలతో జీవించారు అనేది తెలుసుకోవడం ఎంతైనా అవసరము అదే ప్రామాణికమైన సత్యము.

ఇక్కడ రామాయణము ద్వారా మనము ఈ సందర్భములో గ్రహించవలసిన సత్యం ఏమనగా

ఇందాక చెప్పిన విధముగా *" భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే – అనగా కలియుగములో శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి అందరూ సమానులుగా ఉందురు."* కాబట్టి యుగాలలో వేరు వేరుగా ఉండే ధర్మాలను ఈ కుహానా మేధావులు వారికే సరిగా తెలియక లేదా కుట్రతో కుళ్ళు బుద్ధితో అందరికీ తెలియకుండా దాచి ఉంచి ఈ కలియుగంలో అందరూ సమానులే అనేది మనము గ్రహించకుండా మనలో మనకే వైషమ్యాలు పెంచి వారి వారి స్వలాభాలు పొందుతూ పబ్బం గడుపుకుంటున్నారు.

*లొసుగులు వెతికే వారికి సమాధానముగా కూడా ఇది చెప్పవలసి వస్తున్నది.*

యుగ యాగానికీ మనుష్యుల యొక్క శక్తి క్షీణిస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్నియుగములలో అన్నీ వర్ణాల వారూ తమ తమ స్వకర్మలను ఆచరించే వారు, వారిలో హెచ్చుతగ్గులు లేవు. కృత యుగములో మనుష్యులకు ఎక్కువ శక్తి ఉండడము చేత తపశ్చర్యలకు బ్రాహ్మణులు సరిపోవుదురు, త్రేతా యుగములో మనుష్యుల శక్తి కొంత క్షీణించి క్షత్రియులు కూడా తపాశ్చర్య చేయవలసి వచ్చినది. ద్వాపరయుగములో ఇంకొంత శక్తి క్షీణిస్తుంది కాబట్టి వైశ్యులు కూడా తప్శ్చర్య చేయవలసి వచ్చినది, కలియుగము వచ్చేసరికి మనుష్యుల శక్తి మరింత క్షీణించడము చేత అందరూ చేయగలిగిన తపశ్చర్య చేయవలసి ఉన్నది ధర్మము ద్వారా లోకములను కాపాడటము కొరకు.

దీని అర్ధము యే ముందు యుగాలలో మిగతా వారికి ఆ అర్హత లేదా అని కాదు, అవసరము లేదు అని. ఆనాటి వ్యవస్థ వివిధ కర్మలు పనులను బట్టి నడిచే వ్యవస్థలే కానీ రాజ్యాంగములు అనేక ఉద్యోగములు ఉండే వ్యవస్థ కాదు. అలాంటప్పుడు వివిధ పనులకు ఆయా వర్ణములలో వారు మాత్రమే ఆయా పనులు లేదా కర్మలు చేయడం అనేది విధ్యుక్తు ధర్మము లేకపోతే ఆనాటి వ్యవస్థలలో జన జీవనము అచిర కాలములలోనే స్తంభించి పోయేవి. కాబట్టి ఆ విధ్యుక్త ధర్మమును బట్టి ఆచరణ నిర్ణయింపబడి ఉన్నది దానివలనే సృష్టి మరియు మానవ మనుగడ ఆధారపడి ఉన్నది కాబట్టి. అదే లేకుంటే ఈనాడు ఇవి మాట్లాడుకోడానికి ఇది చదవడానికి కూడా మనము ఈ విధముగా జీవించి ఉండి నాగరికత కలిగి ఉండే వాళ్ళము కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన సంస్కృతీ సనాతన ధర్మము మనది.

యుగములు ఉన్నాయి అందులో ఆ యుగములో ఇలా జరిగింది అని ఎవరు మాట్లాడుతున్నా ఆయా యుగాలలో మనుష్యుల శక్తులను బట్టి ఆయా యుగలలో ఉండే వ్యవస్థలను బట్టి యుగ ధర్మాలు కూడా ఉంటాయని మనము తప్పక అంగీకరించవలసి ఉంటుంది. యుగాలు ఉంటాయి యుగ ధర్మాలు ఉంటాయి అని అంగీకరించను అని నాస్తికుడైనా లేదా ఇతర నమ్మకానికి చెందిన వాడైనా అనుకున్నప్పుడు అసలు ఈ విషయముల గూర్చి ప్రస్తావించే అర్హత కూడా ఉండదు, వారి ప్రస్తావన అప్పుడు అర్ధరహితము అవుతుంది. ఇది కనీసపు ఇంగిత జ్ఞానము. ఈనాడు ఈ కుతర్కములు చేసేవారికి అయితే ఆలోచనా లోపము కలిగి ఉండాలి లేదా విషయ పరిజ్ఞానము లేకుండాలి లేదా ఇంగిత జ్ఞానము అయినా లేకుండాలి లేదా అన్నీ ఉండి కుటిల పన్నాగాల కుళ్ళు బుద్ధి అయినా ఉండి ఉండాలి. అటువంటి వారికి విశ్లేషణగా ఇంగిత జ్ఞానమురా ఇది అని చూపిస్తూ బుద్ధి చెప్పాలి.

రామో విగ్రహవాన్ ధర్మః – మూర్తీభవించిన ధర్మాత్ముడైన రాముడు ఎవరు తనను నాకు వద్దే వద్దనినా కానీ మీరు నన్ను వద్దనుకున్నా ధర్మముతో ఉండండి ధర్మములో జీవించండి నాకు అందరూ సమానులే మీకు నేనున్నాను అంటూ శ్రీ రామ రక్షను ప్రసాదిస్తున్నాడు.. అందునా తనను శరణు అనిన వారిని శరణాగత వత్సలుడైన రాముడు తప్పక తన రక్షణలో ఉంచుతాడు.

*నేను ఎంతో కాలముగా పరిశీలన చేసి విశ్లేషణ చేసిన విషయములు పూర్తిగా ఒక రోజు సమయము తీసుకుని రాసిన విషయములను లోకాభిరాముడి గూర్చిన విషయములు కనుక అందరూ అందరికీ చెప్పవచ్చును కానీ నా కృషిని కొంతైనా గుర్తించి నా పేరుని మార్చి మీ పేరులు వేసుకోవద్దని అది ధర్మము కాదని విజ్ఞప్తి. Share చేసుకోగలరు.*

*పలికిన వాడు మునిపల్లె జ్యోతీ స్వరూప్ పలికించిన వాడు పరమేశ్వరుడు*

శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
🙏🙏🙏
శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః 🙏🙏🙏

*రచయిత
జ్యోతి స్వరూప్ మునిపల్లె*

Thu Jul 5, 2018 6:42 am (PDT) . Posted by:

Thu Jul 5, 2018 6:43 am (PDT) . Posted by:

p_gopi_krishna

This is so so good ... never had I know these profound distinctions between *Intelligence* and *Wisdom* — Worth reading on ...

1. Intelligence leads to arguments.
Wisdom leads to settlements.
2. Intelligence is power of will.
Wisdom is power OVER will.
3. Intelligence is heat, it burns.
Wisdom is warmth, it comforts.
4. Intelligence is pursuit of knowledge, it tires the seeker.
Wisdom is pursuit of truth, it inspires the seeker.
5. Intelligence is holding on.
Wisdom is letting go.
6. Intelligence leads you.
Wisdom guides you.
7. An intelligent man thinks he knows everything.
A wise man knows that there is still something to learn.
8. An intelligent man always tries to prove his point.
A wise man knows there really is no point.
9. An intelligent man freely gives unsolicited advice.
A wise man keeps his counsel until all options are considered.
10. An intelligent man understands what is being said.
A wise man understands what is left unsaid.
11. An intelligent man speaks when he has to say something.
A wise man speaks when he has something to say.
12. An intelligent man sees everything as relative.
A wise man sees everything as related.
13. An intelligent man tries to control the mass flow.
A wise man navigates the mass flow.
14. An intelligent man preaches.
A wise man reaches.

Intelligence is good but wisdom achieves better results.

Thu Jul 5, 2018 7:38 am (PDT) . Posted by:

p_gopi_krishna

Who is a Jivanmukta?
by Sri Swami Sivananda
A Jivanmukta is a liberated sage. He is released even while living. He lives in the world, but he is not of the world. He always revels in the eternal bliss of the Supreme Self. He has no identification with the body and senses. Hence he has no idea of enjoyment or enjoyer when he exhausts the residue of his Prarabdha. He has no idea of action or agent. He roams about happily without attachment and egoism, with a balanced mind and an equal vision. His state is indescribable. He is Brahman Himself.
The sage, who has realised that there is no other reality in the universe than Brahman, that he is Brahman Himself and that everything is Brahman, is freed from the round of births and deaths. He has attained freedom, perfection and immortality. He is a Jivanmukta (one who has attained liberation while living).
Not through matted locks, not through fiery lectures and erudition, not through the exhibition of miracles, does one attain perfection or knowledge of the Self. He in whom the two currents, Raga, Dvesha, egoism, lust and anger are destroyed in toto is ever happy and he is Brahman or liberated sage or Jivanmukta. A Jivanmukta or liberated sage is absolutely free from egoism, doubt, fear and grief. These are the four important signs that indicate that one has attained perfection.
For a Jivanmukta there is no distinction between a rogue and a saint, gold and stone, high and low, man and woman, man and animal, censure and praise, honour and dishonour. He beholds the one Self everywhere. He sees divinity in every one. As he is mindless, all differences and barriers have vanished for him.

For a Jivanmukta who beholds the all-pervading, immortal, indivisible, self-luminous Atman everywhere, there remains nothing to be attained or known. He has attained perfection, highest bliss and highest knowledge. The sage becomes aware that he is free. He realises that rebirth is exhausted. He realises also that he has fulfilled all his duties and that there is no further return to this world. He further realises that he has obtained everything, that all his desires are gratified, that he has nothing more to learn and that he has obtained the highest knowledge.

Thu Jul 5, 2018 7:42 am (PDT) . Posted by:

p_gopi_krishna

"What does the Bhagavadgita teach? It teaches three things: brahmavidyāyāṁ yogaśāstre śrīkṛṣṇārjunasaṁvāde. It is repeatedly dinned into our ears what the Gita teaches. The commentaries on the Gita say that it teaches karma yoga, raja yoga, bhakti yoga, jnana yoga, a synthesis of yoga, the art of living, and whatnot. But the Gita itself tells us what it teaches by a colophon, which is in three words only: brahmavidyāyāṁ yogaśāstre śrīkṛṣṇārjunasaṁvāde. Actually, these three words mean theory, practice, and realisation." - Swami KrishnanandaThu Jul 5, 2018 7:52 am (PDT) . Posted by:

p_gopi_krishna

"When someone else is jealous of your own skills, you must bring in more of Īśvara, by recognizing the order in the person's jealousy towards you, as something which the person cannot avoid.. The more you accommodate, the more virulent it becomes, so accommodation is not the solution. The only way is to understand jealousy of the person also as Īśvara the order, in the sense that the person cannot be any different given his background. Deal with it objectively by being not a victim, keep the person outside. Consider it as an opportunity to become bigger than you already are."
Svāmi Dayānanda Sarasvatī

Thu Jul 5, 2018 8:00 am (PDT) . Posted by:

p_gopi_krishna

Every trial is a blessing if it brings us nearer to God. This is what you should remember, and whatever you do on earth, do it for God. If you strive to serve God, you have served everyone. (Sri Paramahansa Yogananda)

Thu Jul 5, 2018 7:53 am (PDT) . Posted by:

p_gopi_krishna

We are unable to realise God within us because we do not realise the soiled cover in which it is wrapped up. If our clothes get dirty, we change them because we are ashamed to appear in dirty garments. If our house is dirty, we clean it so that visitors may not get a bad impression of us. But when our minds and hearts are polluted, do we feel ashamed? Is it not strange that we should be so much concerned about the cleanness of our clothes or our homes, but are not bothered about the purity of our hearts and minds which affect our entire life? To purify our hearts and minds, the first thing we must do is to lead a righteous life. Our actions must be based on morality.. Indulging in abuse of others or inflicting pain on them is not a sign of human nature. The evil that we do to others ultimately recoils on us.

Thu Jul 5, 2018 7:58 am (PDT) . Posted by:

p_gopi_krishna

To know people's backgrounds means to know what's on their back and what's under their ground

If we see someone walking with drooped shoulders, we might judge them as lethargic – till we notice that they are carrying a huge burden that isn't easily noticeable because it is of the same color as the background. Similarly, if we find someone being too pessimistic, we may understand them better if we come to know that they are facing a huge crisis, that is, they are carrying an invisible mental burden.
Conversely, if we see someone repeatedly falling down, we may be tempted to laugh at them till we notice that the floor on which they are walking is dangerously slippery. For all of us, our upbringing and the impressions we get thereby are like the inner emotional ground on which we exist. If someone has had a terrible past, those impressions may have made them psychologically scarred – and that may shape their behavior for many years to come.

Thus, knowing people's background means understanding what is on their back, what burden they are carrying, and what is under their ground, what impressions have formed the foundation of their self-conception.

Godly people want to understand others' background so that they can empathize better, not judge more. Indeed, the Bhagavad-gita (16.02) states that godly people are averse to finding faults. Their primary concern is to help others, to serve them in their service to God, Krishna. Though we all have a tendency to find faults, we can counter that tendency when we understand philosophically that everyone is essentially a soul like us but is differently influenced by what's on their back and what's under their ground.
Though people's background doesn't excuse their actions, it often explains those actions – and equips us to respond to them with a more informed empathic mood of service.

Think it over:
Has understanding the burden someone is carrying changed your attitude toward them?
Has understanding someone's upbringing helped you better understand how they are now?
Identify what you could do in any one important relationship to replace the tendency to judge with the tendency to understand.Read more https://www.gitadaily.com/to-know-peoples-backgrounds-means-to-know-whats-on-their-back-and-whats-under-their-ground/ https://www.gitadaily..com/to-know-peoples-backgrounds-means-to-know-whats-on-their-back-and-whats-under-their-ground/

Thu Jul 5, 2018 12:56 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Piety when boosted by purity paves the way to spirituality

Many people do some pious activities regularly, thinking that it will provide them both material happiness in this world and better material happiness in the next world.

The Bhagavad-gita (02.43) indicates that such people believe that there's nothing more to life or to scripture than such piety and the better material enjoyment that it provides. Such people are undiscerning – they can't get the determination necessary to stay fixed in any process for spiritual growth (02.44).

Purity refers to the desire to serve our beloved Lord simply for pleasing him and delighting in the reciprocation of love thereof. Such pure love alone satisfies the heart's innermost longing for love and joy.

Piety itself is not purity. Certainly, the pious are free from the gross impurities that characterize the demoniac. But they are impure in the sense that they are still self-interested and materially self-interested at that.

And piety is not spirituality either. Genuine spirituality centers on understanding that we are at our core souls, different from the bodies we temporarily possess. The purpose of life, specifically of life in the human body which offers the capacity for metaphysical inquiry, is to rise beyond our bodily misidentification and to realize our spiritual identity as parts of Krishna, the all-attractive supreme.

Piety is good, far better than impiety. But piety can sometimes become an obstacle to spirituality, just as the good can become the enemy of the best. By realizing that even the most pious life still perpetuates our bodily misidentification and sentences us to the repeated miseries of old age, disease and death, we can strive to rise from piety to spirituality by the diligent practice of yogic purification (06.45). Then, we can experience and enjoy our spiritual essence as beloved parts of Krishna meant for a life of eternal love with him.

Think it over:
What is the difference between piety and spirituality?
How are the pious still not pure?
How can we rise from piety to spirituality?

Read more https://www.gitadaily.com/piety-when-boosted-by-purity-paves-the-way-to-spirituality/

Thu Jul 5, 2018 10:39 pm (PDT) . Posted by:

swamypvap

Chidaanandam means Nitya Anandam(everlasting happiness) .
Eswara is Chidaananda Rupam .
As Chit signifies Eswari as Eswara Arthaangi and Eswara Chitanya Swaripini and Eswara Jhnana Swarupini Chidaananda Rupam points out to Arhanaareeswara Rupam.
Vaama Bhaagam of Arthanaareswara Rupam refers to Jagath Mata as Eswara Jhnana Rupini and Eswara Kari
Dakshina Bhaagam refers to Jagath Pita as Vairagya Rupam.
Accordingly a seeker whose Jhnanam embraces Vairagyam and becomes one with Vairagyam undergoes/realizes Nitya Anandam as Eswara is within all beings as Atma..

Thu Jul 5, 2018 10:39 pm (PDT) . Posted by:

swamypvapUNIX is the first operating system that has been designed to manage the resources in terms of hardware, manpower, data, network and security across the various hardware platforms. In fact the letter `X` here signifies that the hardware manufacturer like IBM, HP,SUN is a variable as far the management of the hardware is concerned. The System Administrator whose primary responsibility is to manage the memory space, time and the people/users is known as the ROOT.
The initial password of the root /System Administrator to install the operating system is also root.This fact signifies that nobody else needs to create the role of a System Administrator and it is the System Administrator who creates users, grants rights and privileges to them and deletes them as and when needed.
The above discussion guides us to realize that Eswara as Jagath Niyaamaka is the root(Moolam) for Creation (SrushthI), Sustaining(Sthiti) and dissolution (Layam) and Eswara is Swayam Bhuvum. Eswara is Omkaara Moolam. Thus the three Beejaaakshramulu of Omkaaram signify the above three functionalities. Eswara is Naada Moolam,Sabda Moolam and Veda Moolam. This is the significance behind Eswara having Tri Lochanamulu. The role of the System Administrator enlightens us to realize Eswara as Kaala Ateetam and Desa/Loka Ateetam and as the Jagath Prabhu/Yajamanni of all the Bhutamulu(beings) and Moola Kaaranam .
Eswara as the Universal Administrator and Trishuula Dhaari(Holder of trident) and Chidaananda Rupam (everlasting happiness) blesses us with Amrutatvam/ Nitya Anandam by destroying all the three Sareeramulu (hardware platforms) which are the factors for deaths followed by births which lead to the four types of Dukkhamulu and Taapa Trayam. Accordingly one should seek the Anugraham(blessings) of the Universal System Administrator/ Jagath Niyaamaka /Eswara using a unique password SARANAM (surrender) as a user.

Thu Jul 5, 2018 11:55 pm (PDT) . Posted by:

swamypvap

Chidambaram means Chit + Ambaram
Chit means consciousness and
Ambaram means Aakaasam(Sky)
Accordingly if the consciousness of a spiritual seeker reaches the unconscious state as signified by Aakaasam , the Hrudayam(mind) of that seeker becomes the abode of Eswara as Bhoota Naatham and Chidambara Kshetra Naatham.
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

No comments: