www.telugubhakti.com శ్రీ సూక్తము

 

శ్రీ సూక్తము...!!

పరమ ప్రయోజనకర శ్రీసూక్త రహస్యార్ధము..

వేదములయందు మహా శక్తివంతమయిన మంత్రములలో పురుష సూక్తము..
శ్రీ సూక్తము..
నారాయణ సూక్తము..
దుర్గా సూక్తము..
మొదలగునవి వేదమునకు శిరస్సు వంటివి.

వేదము అంటే జ్ఞానము, జ్ఞానమంటే వెలుగు, వెలుగు అంటే ఆనందము, ఆనందమే శ్రీమహాలక్ష్మి. వేద స్వరూపిణి, వేద మాత అయిన శ్రీమహాలక్ష్మి యొక్క మంత్రం, వేదాన్తర్గతమైన శ్రీసూక్తము, సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము.

శ్రీ సూక్తము యొక్క విశేష ప్రాశస్త్యము. జీవుల పుట్టుకకు కారణమైన ప్రకృతి పురుషులలో ప్రకృతి స్వరూపిణి యైన జగన్మాతయగు శ్రీ మహాలక్ష్మిని ఉపాసించు మంత్రమే శ్రీ సూక్తము. ముగ్గురమ్మలలో ఒకరైన శ్రీదేవి ఈ సూక్తమునకు అధిష్టాన దేవత. పదిహేను ఋక్కులతో, పదిహేను వేదమంత్రములతో శ్రీ మహాలక్ష్మి కీర్తింపబడినది. పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు గల 15 రోజులలో, 15 కళలతో, రోజుకు ఒక్కో కళ చొప్పున వృద్ది చెందుతూ పౌర్ణమినాటి చంద్రబింబములో షోడశిగా వెలుగొందే జగన్మాత యొక్క చంద్ర కళకు రహస్య సంకేతమిది.

గురుముఖత: నేర్చుకొని, స్వరయుక్తముగా సామాన్యుడు సహితము ఈ సూక్తమును ఉపాసించ వచ్చును.

దారిద్ర్య నాశనము కొఱకు, దుఖ నాశనము కొఱకు, కష్టములు తొలుగుట కొరకు, అన్న వస్త్రములు సమృద్ధిగా ఉండుట కొఱకు, సౌఖ్యము, సౌభాగ్యము, సౌందర్యము కొఱకు ఈ ఉపాసన చేయవచ్చును.

అష్ట్యైశ్వర్య సిద్ధి, అధికార ప్రాప్తి, మహా భాగ్యము, భోగము, ఆనందము, సుఖ సంతోషముల కొఱకు, శాంతి కొఱకు, సత్సంతానము, వంశాభి వృద్ధి, మోక్ష ప్రాప్తి కొఱకు ఈ శ్రీ సూక్త పఠనము చేయుట చాలా చాలా ఉత్తమము.

వేదములను, మంత్ర శాస్త్రములను ఔపోసన పట్టిన వారికి మాత్రమే, నిగూడార్ధముతో ఉన్న ఈ మంత్ర సూక్తము యొక్క రహస్యములు తెలియును.

ఐదు వందల సంవత్సరములకు పూర్వము శ్రీ విద్యారణ్య మహా స్వామి శ్రీసూక్త రహస్యార్ధములను తమ భాష్యములో చాలా వివరముగా తెలిపి వున్నారు. భక్తీ, గౌరవములతో శ్రీసూక్త ఉపాసనా మంత్ర రహస్యములను తెలుసుకొనవలెనని, ఆసక్తి కలిగిన వారు ఇది పఠించి సకల భోగ భాగ్యములను, ఆనందములను పొందగలరని ఆశింతుము.

సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము ఈ శ్రీసూక్తం. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. శ్రీసూక్తంతో అమ్మ వారికి అభిషేకము చేయుట లోకాచారము.

🌺హిరణ్య వర్ణాం హరిణీ౦ సువర్ణ రజతస్రజాం!
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా!!

బంగారు వర్ణముతో మెఱయుచు అష్ట్యైశ్వర్యములను ప్రసాదించునది, హ్రీంకారము కలిగినది, విష్ణువును కలిగినది, సూర్య మరియు చంద్ర నాడులను మెడయందు హారములుగా కలిగినది, చంద్ర సహోదరి, నారాయణ శక్తి అయిన శ్రీ దేవి నన్ను ఆవహించు గాక.

🌺తాం మ ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం |
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషా నాహమ్ ||

యజ్ఞ సంపదల నిచ్చు ఓ అగ్నిహోత్రుడా, అష్ట్యైశ్వర్యములను, సిరి సంపదలను, కామధేనువును, మంది మార్బలము, బంధు మిత్ర పరివారమును ప్రసాదించుము. ఏ సమయములయందును మమ్ములను విడువకుండా ఉండునట్లుగా ఆ శ్రీదేవిని మా యందు ఆవాహన చేయుము.

Contd..

__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

SPONSORED LINKS
.

__,_._,___

No comments: