[racchabanda] అనుష్టుప్పు పథ్యా #anushTuppu pathyA#

 

అనుష్టుప్పు పథ్యా - 

అనుష్టుప్పు వక్త్రా పాదమును 24 విధములుగా వ్రాయ వీలగును. అదెట్లనిన మొదటి మూడక్షరములు స,న కాని ఆఱు గణములు, నాలుగవ, ఐదవ అక్షరములు UI, II, ఆఱవ, ఏడవ అక్షరములు రెండు గురువులు (5,6,7 అక్షరములు య-గణము), ఎనిమిదవ అక్షరము గురువు లేక లఘువు, అనగా 6.2.2 = 24. వక్త్రలో అన్ని పాదములకు ఒకే లక్షణములు. వక్త్రలోని సరి పాదములలో 5,6,7 అక్షరములు జ-గణమయితే (య-గణమునకు బదులు) దానిని అనుష్టుప్పు పథ్యా అంటారు. ఇది మనము నిత్యము పఠించే శ్లోకపు మూస. ఇందులోని సరి పాదములను 12 విధములుగా వ్రాయ వీలగును. నేను దీనిని జయ అంటాను (జగణ, యగణములు). కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు దీనిని అమృతవాహిని అన్నారు. కన్నడ సాహిత్యములో ప్రారంభ దశలో శ్లోకమును ఉపయోగించినారు, కాని తెలుగులో దీనిని ప్రాచీన కవు లెవ్వరు వాడలేదు. క్రింద అనుష్టుప్పు పథ్యాకు నా ఉదాహరణములు - 

అనాథులకు నాథుండా 
వినాయకా విశిష్టుఁడా 
మనమ్ములోన నీవేగా 
ప్రణామమ్ముల నందుకో 

సరస్వతీ సరోజాక్షీ 
విరించిపత్ని భారతీ 
వరమ్ము లిమ్ము వాగ్దేవీ
స్మరింతు నిన్ను బ్రాహ్మణీ 

లాలింతునయ్య కన్నయ్యా 
చాలించు క్రీడ రేయిలో 
వేళాయె నిద్ర పోరాదా 
చాల కలలఁ గాంచరా 

అందాల ప్రేయసీ దేవీ 
చిందు సుధల్ ముదమ్ముగా 
బంధమ్ము వాఁడు కల్పించె 
బంధువు లింక జన్మలో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
anushTuppu pathyA - 

anushTuppu vaktraa pAdamunu 24 vidhamulugA vrAya vIlagunu. adeTlanina modaTi mUDaxaramulu sa,na kAni aa~ru gaNamulu, nAlugava, aidava axaramulu #UI, II#, aa~rava, EDava axaramulu reMDu guruvulu (5,6,7 axaramulu ya-gaNamu), enimidava axaramu guruvu lEka laghuvu, anagA 6.2.2 = 24. vaktralO anni pAdamulaku okE laxaNamulu. vaktralOni sari pAdamulalO 5,6,7 axaramulu ja-gaNamayitE (ya-gaNamunaku badulu) dAnini anushTuppu pathyA aMTAru. idi manamu nityamu paThiMchE SlOkapu mUsa. iMdulOni sari pAdamulanu 12 vidhamulugA vrAya vIlagunu. nEnu dInini jaya aMTAnu (jagaNa, yagaNamulu). kokkoMDa vEMkaTaratnamu paMtulugAru dInini amRtavAhini annAru. kannaDa sAhityamulO prAraMbha daSalO SlOkamunu upayOgiMchinAru, kAni telugulO deenini prAchIna kavu levvaru vADalEdu. kriMda anushTuppu pathyAku nA udAharaNamulu - 

anAthulaku nAthuMDA 
vinAyakA viSishTu@MDA 
manammulOna nIvEgA 
praNAmammula naMdukO 

sarasvatI sarOjAxI 
viriMchipatni bhAratI 
varammu limmu vAgdEvI
smariMtu ninnu brAhmaNI 

lAliMtunayya kannayyA 
chAliMchu krIDa rEyilO 
vELAye nidra pOrAdA 
chAla kalala@M gAMcharA 

aMdAla prEyasI dEvI 
chiMdu sudhal mudammugA 
baMdhammu vA@MDu kalpiMche 
baMdhuvu liMka janmalO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: