[racchabanda] అనుష్టుప్పు వక్త్రా #anushTuppu vaktrA#

 

అనుష్టుప్పు వక్త్రా - 

మొదటి రెండు గణములు స,న గణములుగా నుండ రాదు. మిగిలిన ఆఱు గణములు అంగీకృతములు. 5,6,7 అక్షరములు య-గణాముగా నుండాలి. దీనికి వక్త్రా అని పేరు. క్రింద నా ఉదాహరణములు - 

అనుష్టుప్పు వక్త్రా - 

నీ నగుమోము భాసమ్మై 
రా నను జూడు రమ్యమ్మై 
వేణువు నూఁదు వేగమ్మై 
మానస మాడు ధన్యమ్మై 

వాణి విపంచి మీటంగా 
గానతరంగ మాడంగా 
ధేనువు శీర్ష మూపంగా 
మానస మిప్పు డాగంగా 

నిదాఘమ్మందు వర్షమ్మా 
మదిన్ నర్తించు హర్షమ్మా 
సదా నీతోడు హర్షమ్మే 
సుధల్ నీముద్దు వర్షమ్మే 

నీవక్త్రమందు పద్యమ్మే 
జీవమ్ము నిచ్చు చోద్యమ్మే 
భావాల మ్రోఁత వాద్యమ్మే 
సేవించ స్వాదు మద్యమ్మే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
anushTuppu vaktrA - 

modaTi reMDu gaNamulu sa,na gaNamulugA nuMDa rAdu. migilina aa~ru gaNamulu aMgIkRtamulu. 5,6,7 axaramulu ya-gaNAmugA nuMDAli. dIniki vaktraa ani paeru. kriMda nA udAharaNamulu - 

anushTuppu vaktraa - 

nI nagumOmu bhAsammai 
rA nanu jUDu ramyammai 
vENuvu nU@Mdu vEgammai 
mAnasa mADu dhanyammai 

vANi vipaMchi mITaMgA 
gAnataraMga mADaMgA 
dhEnuvu SIrsha mUpaMgA 
mAnasa mippu DAgaMgA 

nidAghammaMdu varshammA 
madin nartiMchu harshammA 
sadA nItODu harshammE 
sudhal nImuddu varshammE 

nIvaktramaMdu padyammE 
jIvammu nichchu chOdyammE 
bhAvAla mrO@Mta vAdyammE 
sEviMcha svAdu madyammE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: