[racchabanda] ఔపచ్ఛందసికా ప్రవృత్తకము #aupachChaMdasikA pravRttakamu#

 

ఔపచ్ఛందసికా ప్రవృత్తకము - 

బేసి పాదములు - లగ + 3 - ర/య
సరి పాదములు - 3 + గ + 3 - ర/య

క్రింద నా ఉదాహరణములు - 

నిజమ్ముగా - నిన్ను దల్చుచుంటిన్ 
సుజనపోషకుఁడ - సోయగాలు నిండన్ 
ధ్వజమ్ములా - దారి చూప రారా 
రజనివేళ యిది - రమ్యమైన కాంతుల్ 

మదాలసా - మంజులాంబుజాస్యా 
ముదము నిచ్చు నవ - మోహనాంగి నీవా 
సుదర్శనా - సోమకాంతి నీవే 
వదలలేను నిను - వందకోట్లకైనన్ 

రెండు పాదములను ఒకే మారు చదివి, రెండవ పాదములోని మొదటి రెండు లఘువులను ముందు పాదముతో ఊతగా చేర్చినప్పుడు ఈ ఛందస్సు గానయోగ్యమవుతుందని నా ఊహ. దానికి ఉదాహరణములు - 

అనంతమౌ - నాదిదేవుఁ డీవా - నా 
ప్రణామముల్ - భక్తితోడఁ జేతున్  
వినంగ రా - విశ్వవీణ పల్కుల్ - నా 
మనమ్ములో - మాధురీ స్రవమ్మై 

విరాగిణీ - ప్రేమికుండు లేఁడా - నీ 
స్వరమ్ములో - వాని వంత నిండెన్ 
నిరాశలో - నీవు మున్గ నేలా - నీ 
వరమ్ముగా - వాఁడు వచ్చు నీకై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aupachChaMdasikA pravRttakamu - 

bEsi pAdamulu - laga + 3 - ra/ya
sari pAdamulu - 3 + ga + 3 - ra/ya

kriMda nA udAharaNamulu - 

nijammugA - ninnu dalchuchuMTin 
sujanapOshaku@MDa - sOyagAlu niMDan 
dhvajammulA - dAri chUpa rArA 
rajanivELa yidi - ramyamaina kAMtul 

madAlasA - maMjulAMbujAsyA 
mudamu nichchu nava - mOhanAMgi nIvA 
sudarSanA - sOmakAMti nIvE 
vadalalEnu ninu - vaMdakOTlakainan 

reMDu pAdamulanu okE mAru chadivi, reMDava pAdamulOni modaTi reMDu laghuvulanu muMdu pAdamutO UtagA chErchinappuDu ee ChaMdassu gAnayOgyamavutuMdani nA ooha. dAniki udAharaNamulu - 

anamtamau - nAdidEvu@M DIvA - nA 
praNAmamul - bhaktitODa@M jEtun  
vinaMga rA - viSvavINa palkul - nA 
manammulO - mAdhurI sravammai 

virAgiNI - prEmikuMDu lE@MDA - nI 
svarammulO - vAni vaMta niMDen 
nirASalO - nIvu mun&ga nElA - nI 
varammugA - vA@MDu vachchu nIkai 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: