[racchabanda] లలితగీతిక #lalitagItika#

 

లలితగీతిక - 

ఆధారము - కల్పితము

రెండు కరశయా (కిశోర, రాజమరాళ) వృత్తములను లల II వంతెన ద్వారా కలిపినప్పుడు మనకు మత్తకోకిల లయతో ఉండే ఈవృత్తము లభ్యమవుతుంది. యతి గాని ప్రాసయతి గాని ఉంచవచ్చును. క్రింద నా ఉదాహరణములు - 

లలితగీతిక - న/భ/ర/న/స/స/లగ III UII UI UII III UII UIU
20 కృతి 376504

III UII UIU - II - III UII UIU యతి, ప్రాసయతులతో -

కలను గంటిని గమ్మఁగాఁ - గఱి 
జలజనేత్రుని నందులో 
వలపు హెచ్చెను గుండెలోఁ - బలు 
తలఁపు లెన్నియొ మెండుగా 
వెలుఁగు నిండెను గీములో - విరి 
చెలువ మెల్లెడఁ దోఁటలో 
మెలగ లేచెను రాగముల్ - మృదు 
కలరవధ్వని మ్రోఁగఁగా 

శిలగ మారితి నిప్పుడే - చెలి 
యలుకఁ జెందుచు వెళ్లఁగా 
శిలకుఁ బ్రాణము వచ్చునా - చెలి 
జలజ చుబ్రము నవ్వునా 
వలపు వీణను మీటునా - వర 
లలిత గీతికఁ బాడునా 
శిలయె నాకిఁక రూపమా - సెల 
జలము నన్నిఁక ముంచునా 

మధ్యగల వంతెనను తొలగిస్తే ఇవి రాజమరాళములే! అలా మొదటి పద్యము - 

కలను గంటిని గమ్మఁగాఁ 
జలజనేత్రుని నందులో 
వలపు హెచ్చెను గుండెలోఁ 
తలఁపు లెన్నియొ మెండుగా 

వెలుఁగు నిండెను గీములో 
చెలువ మెల్లెడఁ దోఁటలో 
మెలగ లేచెను రాగముల్ 
కలరవధ్వని మ్రోఁగఁగా 

మత్తకోకిల లయతో - III UII UI UII - III UII UIU

హరిని జూడఁగ నాకుఁ గల్గెను - హరుస మీ హృదయమ్ములో 
వరదుఁ డన్న మనస్సు పొంగును - బ్రలపనమ్ములు వీడఁగా 
సరసమై యతఁ డూఁద వేణువు - శ్రవణముల్ వికసింఛుఁగా 
హరిహరీ దయతోడ రా దరి - యలయఁ జేయక వేగమే 

సరసిజాసన సామవేదపు - స్వరము మీఁటఁగ వీణపై 
వరద పారెను వార్ధిఁ జేరఁగ - వర మధూదయ వేళలో 
సరసఁ జేరె నజుండు నవ్వుచుఁ - జరణముల్ దను పాడఁగా
హరిహరాదులు హ్లాదమందిరి - సరస మెల్లెడ నిండెఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
lalitagItika - 

aadhAramu - kalpitamu

reMDu karaSayA (kiSOra, rAjamarALa) vRttamulanu lala #II# vaMtena dvArA kalipinappuDu manaku mattakOkila layatO uMDE eevRttamu labhyamavutuMdi. yati gAni prAsayati gAni uMchavachchunu. kriMda nA udAharaNamulu - 

lalitagItika - na/bha/ra/na/sa/sa/laga #III UII UI UII III UII UIU#
20 kRti 376504

#III UII UIU - II - III UII UIU# yati, prAsayatulatO -

kalanu gaMTini gamma@MgA@M - ga~ri 
jalajanEtruni naMdulO 
valapu hechchenu guMDelO@M - balu 
tala@Mpu lenniyo meMDugA 
velu@Mgu niMDenu gImulO - viri 
cheluva melleDa@M dO@MTalO 
melaga lEchenu rAgamul - mRdu 
kalaravadhvani mrO@Mga@MgA 

Silaga mAriti nippuDE - cheli 
yaluka@M jeMduchu veLla@MgA 
Silaku@M brANamu vachchunA - cheli 
jalaja chubramu navvunA 
valapu vINanu mITunA - vara 
lalita gItika@M bADunA 
Silaye nAki@Mka rUpamA - sela 
jalamu nanni@Mka muMchunA 

madhyagala vaMtenanu tolagistE ivi rAjamarALamulE! alA modaTi padyamu - 

kalanu gaMTini gamma@MgA@M 
jalajanEtruni naMdulO 
valapu hechchenu guMDelO@M 
tala@Mpu lenniyo meMDugA 

velu@Mgu niMDenu gImulO 
cheluva melleDa@M dO@MTalO 
melaga lEchenu rAgamul 
kalaravadhvani mrO@Mga@MgA 

mattakOkila layatO - #III UII UI UII - III UII UIU#

harini jUDa@Mga nAku@M galgenu - harusa mI hRdayammulO 
varadu@M Danna manassu poMgunu - bralapanammulu vIDa@MgA 
sarasamai yata@M DU@Mda vENuvu - SravaNamul vikasiMChu@MgA 
hariharI dayatODa rA dari - yalaya@M jEyaka vEgamE 

sarasijAsana sAmavEdapu - svaramu mI@MTa@Mga vINapai 
varada pArenu vArdhi@M jEra@Mga - vara madhUdaya vELalO 
sarasa@M jEre najuMDu navvuchu@M - jaraNamul danu pADa@MgA
hariharAdulu hlAdamaMdiri - sarasa melleDa niMDe@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: