[racchabanda] మళ్లీ వనమయూరము #maLlI vanamayUramu#

 

మళ్లీ వనమయూరము -  

నాకు నచ్చిన వృత్తములలో వనమయూరము ఒకటి. ఇది కూడ తాళవృత్తమే. ఇంతకు ముందే చెప్పియున్నాను ఈ వృత్తములో నరసింహస్తోత్రము (శ్రీమదకలంక పరిపూర్ణ...) చాల ప్రసిద్ధమైనది. 

వనమయూరము - భ/జ/స/న/గగ
14 శక్వరి 3823 

శారదను దల్చ నవ - చారుమతి గల్గున్ 
మేర లిఁక లేక కడు - మేలు గలిగించున్ 
హారములె భావములు - హర్షలత పూయున్ 
చేరువగుఁ జిత్రముగఁ - జెల్వముల గీతుల్ 

ఈదినము మంచి దిన - మెల్లరకుఁ గాదా 
ఖేదములు మాయమగుఁ - గృష్ణుఁ డనరాదా 
మోదమిడు రాగ మది - మోహనము గాదా 
సాధానము సేతు నిఁక - సారిగపధాసా 

సందె యరుణార్ణవము - శ్యామలము రాత్రుల్ 
మంద మృదు రావమును - మారుతము దెచ్చెన్ 
విందు లిడు వేళ యిది - ప్రేమ మధు పాత్రన్  
సందియము లెందు కిఁక - సాకి దయ నీవా 

విధేయుడు - మోహన

#
maLlI vanamayUramu -  

nAku nachchina vRttamulalO vanamayUramu okaTi. idi kUDa tALavRttamE. iMtaku muMdE cheppiyunnAnu ee vRttamulO narasiMhastOtramu (SrImadakalaMka paripUrNa...) chAla prasiddhamainadi. 

vanamayUramu - bha/ja/sa/na/gaga
14 Sakvari 3823 

SAradanu dalcha nava - chArumati galgun 
mEra li@Mka lEka kaDu - mElu galigiMchun 
hAramule bhAvamulu - harshalata pUyun 
chEruvagu@M jitramuga@M - jelvamula gItul 

eedinamu maMchi dina - mellaraku@M gAdA 
khEdamulu mAyamagu@M - gRshNu@M DanarAdA 
mOdamiDu rAga madi - mOhanamu gAdA 
sAdhAnamu sEtu ni@Mka - sArigapadhAsA 

saMde yaruNArNavamu - SyAmalamu rAtrul 
maMda mRdu rAvamunu - mArutamu dechchen 
viMdu liDu vELa yidi - prEma madhu pAtran  
saMdiyamu leMdu ki@Mka - sAki daya nIvA 

vidhEyuDu - mOhana
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: