[racchabanda] పల్లవి #pallavi#

 

పల్లవి - 

ఇది ఒక పాట ఛందస్సు. మొదటి రెండు పంక్తులలో పాదమునకు ఏడు చతుర్మాత్రలు. అక్కడక్కడ రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్రను ఉపయోగించవచ్చును. తఱువాత మూడు చిన్న పాదములు, ఇందులో ఒక్కొక్కట్కి మూడు చతుర్మాత్రలు. ఇది ఒక సుప్రసిద్ధమైన పాటకు ఛందోనిర్మాణము మాత్రమే. పాటను మీరే కనుక్కోండి చూద్దాము! 

సుందర యామిని - సురుచిర కౌముది - శోభిత శశి గగనములో 
విందుగ గానము - వీనులఁ దేనెలు - ప్రేమయు పొంగెను మదిలో 

గంధము విరుల వనములో 
సందడులే పవనములో 
చిందులె నాయీ హృదిలో 

నందన వనమున - నాదము లెల్లెడ - నాకములోఁ గన నిదియో 
సుందర యామిని - సురుచిర కౌముది - శోభిత శశి గగనములో 

చల్లఁగఁ జూచిరి - సప్తర్షులఁ గను - చదలం దుత్తర దిశలో 
వల్లకి మీటుము - పాటను బాడుము - స్వర రాగముల సరళిలో 

ఉల్లము పొంగును ద్రుటిలో 
వెల్లువయగు హర్షములో 
హల్లీసకమే హృదిలో 

ఇందునిభాస్యా - యీయామనిలో - నీప్సితములు నా మదిలో
సుందర యామిని - సురుచిర కౌముది - శోభిత శశి గగనములో 

నిను నే గోరితి - నీవును నటులే - నిశ్చయముగఁ బ్రేమములో 
మనమున నీవే - మధుర రాత్రిలో - మత్తుగ వత్తువు కలలో 

ననుగన నిప్పుడు రావా 
కనుగవ వేచెనుగాదా 
మనమేకమ్మై యవఁగా 

బంధము వీడదు - పల్లవి బ్రతుకను - పాటకు నిది యీ భువిలో 
సుందర యామిని - సురుచిర కౌముది - శోభిత శశి గగనములో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
pallavi - 

idi oka pATa ChaMdassu. modaTi reMDu paMktulalO pAdamunaku EDu chaturmAtralu. akkaDakkaDa reMDu chaturmAtralaku badulu oka ashTamAtranu upayOgiMchavachchunu. ta~ruvAta mUDu chinna pAdamulu, iMdulO okkokkaTki mUDu chaturmAtralu. idi oka suprasiddhamaina pATaku ChaMdOnirmANamu mAtramE. pATanu mIrE kanukkOMDi chUddAmu! 

suMdara yAmini - suruchira kaumudi - SObhita SaSi gaganamulO 
viMduga gAnamu - vInula@M dEnelu - prEmayu poMgenu madilO 

gaMdhamu virula vanamulO 
saMdaDulE pavanamulO 
chiMdule nAyI hRdilO 

naMdana vanamuna - nAdamu lelleDa - nAkamulO@M gana nidiyO 
suMdara yAmini - suruchira kaumudi - SObhita SaSi gaganamulO 

challa@Mga@M jUchiri - saptarshula@M ganu - chadalaM duttara diSalO 
vallaki mITumu - pATanu bADumu - svara rAgamula saraLilO 

ullamu poMgunu druTilO 
velluvayagu harshamulO 
hallIsakamE hRdilO 

iMdunibhAsyA - yIyAmanilO - nIpsitamulu nA madilO
suMdara yAmini - suruchira kaumudi - SObhita SaSi gaganamulO 

ninu nE gOriti - nIvunu naTulE - niSchayamuga@M brEmamulO 
manamuna nIvE - madhura rAtrilO - mattuga vattuvu kalalO 

nanugana nippuDu rAvA 
kanugava vEchenugAdA 
manamEkammai yava@MgA 

baMdhamu vIDadu - pallavi bratukanu - pATaku nidi yI bhuvilO 
suMdara yAmini - suruchira kaumudi - SObhita SaSi gaganamulO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: