[racchabanda] అర్ధసమవృత్తము లీలాశుకము #rdhasamavRttamu lIlASukamu#

 

అర్ధసమవృత్తము లీలాశుకము - 

నశ్చపలా అని సూత్రము. అనగా బేసి పాదములలో 5,6,7 అక్షరములు న-గణముగా ఉండాలి చపలా అనే శ్లోకపు ప్రత్యేకతలో. ఈ లీలాశుకము ఆ చపలలోని ఒక ప్రత్యేకత. 

బేసి పాదములు - స/భ/లగ 
సరి పాదములు - స/ర/లగ 

శ్యామలా దండకములోని క్రింది శ్లోకము దీనికి సరి పోతుంది. అందుకే లీలాశుకము అనే పేరు కూడ. ఇట్టి అర్ధసమ వృత్తము  ఎక్కడ కనబడలేదు. అందువలన దీనిని కల్పించుట యవసరమే. 

జయ మాతంగతనయే 
జయ నీలోత్పలద్యుతే 
జయ సంగీత రసికే 
జయ లీలాశుకప్రియే 

లీలాశుకము - IIU UII IU / IIU UIU IU

విను లీలాశుకము దా 
నిను బిల్చెన్ బ్రియంవదా 
మనమందా ప్రియుఁడు నిన్ 
దను దల్చున్ గదా సదా 

కలహంసధ్వనులతోఁ  
గలగీతమ్ముఁ బాడుమా 
లలిత మ్మీరజనిలో 
లలనా నాట్య మాడుమా 

మనసే యీ క్షణములో 
నిను దల్చెన్ మనోహరీ 
ప్రణయమ్మే వరముగా 
కనవేలా కళావతీ 

చెలి నాతో పలుకదే 
చిలుకా యేల చెప్పవే 
మెల నీవే పిలువవే 
తలఁపే తల్పు లయ్యెనా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasamavRttamu lIlASukamu - 

naSchapalA ani sUtramu. anagA bEsi pAdamulalO 5,6,7 axaramulu na-gaNamugA uMDAli chapalA anE SlOkapu pratyEkatalO. ee lIlASukamu aa chapalalOni oka pratyEkata. 

bEsi pAdamulu - sa/bha/laga 
sari pAdamulu - sa/ra/laga 

SyAmalA daMDakamulOni kriMdi SlOkamu dIniki sari pOtuMdi. aMdukE lIlASukamu anE pEru kUDa. iTTi ardhasama vRttamu  ekkaDa kanabaDalEdu. aMduvalana dInini kalpiMchuTa yavasaramE. 

jaya mAtaMgatanayE 
jaya nIlOtpaladyutE 
jaya saMgIta rasikE 
jaya lIlASukapriyE 

lIlASukamu - #IIU UII IU / IIU UIU IU#

vinu lIlASukamu dA 
ninu bilchen briyaMvadA 
manamaMdA priyu@MDu nin 
danu dalchun gadA sadA 

kalahaMsadhvanulatO@M  
galagItammu@M bADumA 
lalita mmIrajanilO 
lalanA nATya mADumA 

manasE yI xaNamulO 
ninu dalchen manOharI 
praNayammE varamugA 
kanavElA kaLAvatI 

cheli nAtO palukadE 
chilukA yEla cheppavE 
mela nIvE piluvavE 
tala@MpE talpu layyenA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: