[racchabanda] ఉదీచ్యవృత్తి #udIchyavRtti#

 

ఉదీచ్యవృత్తి - 

రెండు పాదములు చేర్చి రెండవ పాదములోని మొదటి రెండు లఘువులను మొదటి పాదముతో ఊతగా పెట్టుకొని వ్రాసినవి. వీటిని గేయములవలె పాడుకొన వీలగును. 

వైతాళీయ ఉదీచ్యవృత్తి - 

కళామయీ - కావ్యనాయకీ నీ 
తలఁపులతో - దాహ మయ్యెనే 
విలోల మీ - ప్రేమ డోలికల్ నీ 
కలరవమే - కామగీతికల్ 

వరమ్ములే - వాగ్వినోదినీ నీ 
స్వరములు భా-వార్థ రూపమే 
కరమ్ములే - కైత వ్రాయఁగా నా 
చరణములే - చక్కనౌ గతుల్ 

ఔపచ్ఛందసికా ఉదీచ్యవృత్తి - 

మదాలసా - మంజులాస్య రావా నీ 
పదములతో - భావతృప్తి నీవా 
సుధామయీ - సోయగాల దేవీ నా  
ముదమందునఁ - బూవు లీను తావీ

స్మరించెదను - శారదాంబ వాణీ నీ 
వరములతో - భావదీప్తు లిమ్మా 
విరించి సతి - వేదశాస్త్ర పాణి నీ 
దరిసెనమే - ధన్యుఁ జేయుఁ గాదా 

ఆపాతళికా ఉదీచ్యవృత్తి - 

అనంతమగు - నాశలతోడన్ నా 
మనమో నిను - మానిని గోరెన్ 
గనంగ నను - గామిని రావా నీ 
ప్రణయమ్మునఁ - బాటలఁ బాడన్ 

సుగమ్మిటను - సుంతయు లేదే నీ 
మొగమే నా - ముందర దోఁచెన్ 
జగమ్మునకు - స్వామియు నీవే నా 
జగమందున - శాంతియు లేదే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
udIchyavRtti - 

reMDu pAdamulu chErchi reMDava pAdamulOni modaTi reMDu laghuvulanu modaTi pAdamutO UtagA peTTukoni vrAsinavi. vITini gEyamulavale pADukona vIlagunu. 

vaitALIya udIchyavRtti - 

kaLAmayI - kAvyanAyakI nI 
tala@MpulatO - dAha mayyenE 
vilOla mI - prEma DOlikal nI 
kalaravamE - kAmagItikal 

varammulE - vAgvinOdinI nI 
svaramulu bhA-vArtha rUpamE 
karammulE - kaita vrAya@MgA nA 
charaNamulE - chakkanau gatul 

aupachChaMdasikA udIchyavRtti - 

madAlasA - maMjulAsya rAvA nI 
padamulatO - bhAvatRpti nIvA 
sudhAmayI - sOyagAla dEvI nA  
mudamaMduna@M - bUvu lInu tAvI

smariMchedanu - SAradAMba vANI nI 
varamulatO - bhAvadIptu limmA 
viriMchi sati - vEdaSAstra pANi nI 
darisenamE - dhanyu@M jEyu@M gAdA 

aapAtaLikA udIchyavRtti - 

anaMtamagu - nASalatODan nA 
manamO ninu - mAnini gOren 
ganaMga nanu - gAmini rAvA nI 
praNayammuna@M - bATala@M bADan 

sugammiTanu - suMtayu lEdE nI 
mogamE nA - muMdara dO@Mchen 
jagammunaku - svAmiyu nIvE nA 
jagamaMduna - SAMtiyu lEdE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: