[racchabanda] కోర్కె యుండఁగలదే

 

కోర్కె యుండఁగలదే
====================

--

తన్వీ వృ.

--

శారద పాదాంబుజములఁ గొల్వన్ సంతసమౌఁగద యెవరికి నైనన్!
కోరిన పద్యాలొసఁగెడి తల్లిన్ గొల్చుట మోదమె యగుఁగద నీకున్!
..జారిన ఛందంబిడదయ తృప్తిన్! సాగదు వేగమె పరుగుల తోడన్!
..బోరని పించున్ నడకను జూడన్! మ్రొక్కెద వేరొకటిడవయ స్వామీ!

--
శా.
--

..రక్షాబంధము గట్టునట్టి దినమో రాజీవపత్రేక్షణా
..అక్షయ్యంబగు జ్ఞానమీయఁగలవా యానందసంధాత్రివై
..రక్షించున్ గద జ్ఞానమొక్కటె యిలన్ రాకుండ నేయాపదల్ 
..భిక్షాపాత్రము నిండనిమ్ము వడిగా విజ్ఞాన భిక్షాన్నమున్

--

నేనే రక్షగ నుందునీకు నిలపై నిత్యమ్ము నేచోటనున్
నేనే యిచ్చెదఁ గోరు జ్ఞానమదియున్ నిశ్శంకగాఁ బ్రేమతో
వాణీపుత్రివి యంచుఁ బల్క బుధులున్ వ్రాయింతు మోదమ్ముగా
వేనోళ్ళంగొనియాడ సాధుజనులున్ వీక్షించి నీ వైఖరిన్

--

"రక్ష" నూ.వృ ( త,జ,భ,జ,జ,త,గ --12 )

--

కోరంబనిలేదు నీకు నెదియున్ గొఱఁతైన యట్లేయెడన్
ఏరైనటు పారుచుండుఁ బలుకుల్ హితవైన వాక్యాలతో
వారింపఁగ లేని వేగమగుచున్ బరుగెత్తు నాశ్చర్యమై
సారమ్మును గ్రోలి తృప్తిఁ బడయన్ జగమంత నిక్కంబుగా

--

హారంబుల నల్లుచుండు పనియే యనిశమ్ము నైపుణ్యమున్
తీరైనవి శోభలీను సరముల్ త్రిపురేశికానందమై
వేరే నగలేల యంచుఁ దనకున్ బ్రియమారఁగా దాల్చఁగా
నేరోజును నీకుఁ గూడ మదిలో నెనలేని సంతోషమే

--

వారమ్ములు దొర్లిపోవ వడిగా వనజాక్షి సైదోడుగా
వేరొక్కరు వ్రాయలేని గతిలో విరచించుచున్ సత్కృతుల్
మీరావలె భక్తిపూర్ణవగుచున్ మృడురాణి నర్చించఁగా
వేరొక్కటి కోర్కె యుండఁగలదే వినుతించి ప్రార్థించఁగా

--

4:55 PM
08-25-2018

--

ఆర్కైవ్.ఆర్గ్ వద్ద యేదో గ్రంథమును జూస్తున్నప్పుడు "తన్వీ" వృత్తము కనిపించినది.వెంటనే అదే వృత్తములో "కోరిన పద్యాలిడెదను వడిగా. కూర్పఁగఁ దీయుము కలమును వేగన్" అనే వాక్యములో పలికి, మొదటి పద్యములోని మొదటి రెండు పాదములనివ్వగానే నడక బోర్ గొట్తున్నదని అనగానే అవే తరువాతి పాదాలుగా వ్రాయించి, ఛందము మార్చి శార్దూలవిక్రీడితములో రెండవ పద్యములో పలికించి సమాధానమన్నట్లుగా ఒక శా.వి, దానిలో కొంతమార్పు జేసి మిగిలిన పద్యములు వ్రాయించారు. మార్చి యిచ్చిన వృత్తము నా దగ్గర పట్టికలలో కనబడలేదు. అందువలన నాకు తోచిన విధముగా నామకరణము చేశాను.
--
తన్వీ-- గణములు -భ,త,న,స,భ,భ,న,య -- యతి 12

ఛందస్సులలో మార్పులే గాని పలుకులు మాత్రము మామూలే )-:


__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: