Re: [racchabanda] పుష్పితాగ్రా #pushpitAgrA#

 

cAlA bAvuMdi mOhana  gArU.
Murty.

2018-08-14 13:28 GMT-04:00 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com>:


పుష్పితాగ్రా - 

ఔపచ్ఛందసికకు లక్షణములు -
బేసి పాదములు - 6 మాత్రలు - ర/య
సరి పాదములు - 8 మాత్రలు - ర/య

పుష్పితాగ్ర ఒక అర్ధసమ వృత్తము. ఇది ఔపచ్ఛందసికయొక్క ఒకప్రత్యేకత. ఇందులో బేసి పాదములలలోని ఆఱు మాత్రలకు బదులు ఆఱు లఘువులు, సరి పాదములలో ఎనిమిది మాత్రలకు బదులు నలము + భ-గణము. అనగా బేసి పాదములు - న/న/ర/య, సరి పాదములు - న/జ/జ/ర/గ. క్రింద నా ఉదాహరణములు -  

పుష్పితాగ్రా - IIIIII - UIUIUU // IIII UII - UIUIUU

నిరతము నిను - నేను గోరుచుంటిన్  
వర వరదా యని - పాట పాడుచుంటిన్ 
మురహర కడు - మోద మీయ నాకున్  
స్వర సర మిత్తును - స్వామి చెంత రారా 

మది మురిసెను - మాధవా యనంగన్  
హృది యిది హాయిగ - నృత్య మాడ సాఁగెన్ 
నది కదలెను - నాద మొల్కుచుండన్  
వ్యధ యది లేదిఁక - యాశ పొంగి లేచెన్ 

తరుల విరులు - తారలై వెలింగెన్  
హరి హరుసమ్మిట - హాయితోడ నిండెన్ 
మురిసెడు మది - పుష్పితాగ్రమయ్యెన్ 
సిరి చెరువయ్యెను - చిత్తమందుఁ జిందుల్ 

కమలనయను - గంటి నిద్రలోనన్  
గమ గమ గంధము - గాలిలోనఁ దేలెన్ 
విమలవదను - బ్రేమ గీతులన్ నే  
విన విన మానస - వీణ మ్రోఁగె నిందున్ 

వీటినే క్రింది విధముగా వ్రాస్తే రెండు పాదములకు ఒకే లయ ఉంటుంది, ముందున్న రెండు లఘువులు ఒక ఊత పదముగా ఉంటుంది. ఇలా వ్రాస్తే పాడుకొనుటకు బాగుంటుందని నా ఉద్దేశము. ఈ అమరికలో కూడ ప్రాస చెల్లుతుంది. 

నిరతము నిను - నేను గోరుచుంటిన్ - వర 
వరదా యని - పాట పాడుచుంటిన్ 
మురహర కడు - మోద మీయ నాకున్ - స్వర 
సర మిత్తును - స్వామి చెంత రారా 

మది మురిసెను - మాధవా యనంగన్ - హృది 
యిది హాయిగ - నృత్య మాడ సాఁగెన్ 
నది కదలెను - నాద మొల్కుచుండన్ - వ్యధ 
యది లేదిఁక - యాశ పొంగి లేచెన్ 

తరుల విరులు - తారలై వెలింగెన్ - హరి 
హరుసమ్మిట - హాయితోడ నిండెన్ 
మురిసెడు మది - పుష్పితాగ్రమయ్యెన్ - సిరి 
చెరువయ్యెను - చిత్తమందుఁ జిందుల్ 

కమలనయను - గంటి నిద్రలోనన్ - గమ 
గమ గంధము - గాలిలోనఁ దేలెన్ 
విమలవదను - బ్రేమ గీతులన్ నే - విన 
విన మానస - వీణ మ్రోఁగె నిందున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
pushpitAgrA - 

aupachChaMdasikaku laxaNamulu -
bEsi pAdamulu - 6 mAtralu - ra/ya
sari pAdamulu - 8 mAtralu - ra/ya

pushpitAgra oka ardhasama vRttamu. idi aupachChaMdasikayokka okapratyEkata. iMdulO bEsi pAdamulalalOni aa~ru mAtralaku badulu aa~ru laghuvulu, sari pAdamulalO enimidi mAtralaku badulu nalamu + bha-gaNamu. anagA bEsi pAdamulu - na/na/ra/ya, sari pAdamulu - na/ja/ja/ra/ga. kriMda nA udAharaNamulu -  

pushpitAgrA - #IIIIII - UIUIUU# // #IIII UII - UIUIUU#

niratamu ninu - nEnu gOruchuMTin  
vara varadA yani - pATa pADuchuMTin 
murahara kaDu - mOda mIya nAkun  
svara sara mittunu - svAmi cheMta rArA 

madi murisenu - mAdhavA yanaMgan  
hRdi yidi hAyiga - nRtya mADa sA@Mgen 
nadi kadalenu - nAda molkuchuMDan  
vyadha yadi lEdi@Mka - yASa poMgi lEchen 

tarula virulu - tAralai veliMgen  
hari harusammiTa - hAyitODa niMDen 
muriseDu madi - pushpitAgramayyen 
siri cheruvayyenu - chittamaMdu@M jiMdul 

kamalanayanu - gaMTi nidralOnan  
gama gama gaMdhamu - gAlilOna@M dElen 
vimalavadanu - brEma gItulan nE  
vina vina mAnasa - vINa mrO@Mge niMdun 

vITinE kriMdi vidhamugA vrAstE reMDu pAdamulaku okE laya uMTuMdi, muMdunna reMDu laghuvulu oka Uta padamugaa uMTuMdi. ilA vrAstE pADukonuTaku bAguMTuMdani nA uddESamu. ee amarikalO kUDa prAsa chellutuMdi. 

niratamu ninu - nEnu gOruchuMTin - vara 
varadA yani - pATa pADuchuMTin 
murahara kaDu - mOda mIya nAkun - svara 
sara mittunu - svAmi cheMta rArA 

madi murisenu - mAdhavA yanaMgan - hRdi 
yidi hAyiga - nRtya mADa sA@Mgen 
nadi kadalenu - nAda molkuchuMDan - vyadha 
yadi lEdi@Mka - yASa poMgi lEchen 

tarula virulu - tAralai veliMgen - hari 
harusammiTa - hAyitODa niMDen 
muriseDu madi - pushpitAgramayyen - siri 
cheruvayyenu - chittamaMdu@M jiMdul 

kamalanayanu - gaMTi nidralOnan - gama 
gama gaMdhamu - gAlilOna@M dElen 
vimalavadanu - brEma gItulan nE - vina 
vina mAnasa - vINa mrO@Mge niMdun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#




__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: