www.telugubhakti.com Digest Number 4738

1 Message

Digest #4738

Message

Fri Aug 3, 2018 5:08 pm (PDT) . Posted by:

telugubhaktipages

దుర్గా సూక్తం
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః|
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాఽత్యగ్నిః||
జాతవేదసే సునవామ సోమ = అగ్నిదేవా సోమరసాన్ని పిండి అర్పిస్తాము.
వేదః అరాతీయతః నిదహాతి = అగ్ని దేవుడు మా అడ్డంకులను తొలగించు గాక.
నావా సింధుం ఇవ నః విశ్వా దుర్గాణి పర్షదతి = సముద్రాన్ని పడవ ఎలా దాటిస్తుందో అలా దుర్గాదేవి మమ్మల్ని కష్టాలనుంచి దాటించు గాక.
అగ్నిః దురితా అతి = అగ్నిదేవుడు మమ్మల్ని సమస్త పాపముల నుంచి గట్టెంకించాలి.
జాతం జాతం వేత్తి ఇతి జాతవేదః. పుట్టిన ప్రతివాడి గురించి తెలిసిన వాడు జాతవేదుడు. అగ్ని దేవుడు అందరి శరీరాలలోను ఉష్ణరూపంలో ఉండి కాపాడేవాడు. జాతవేదాః! నీకు సోమరసాన్ని పిండి అర్పిస్తాము. అగ్ని దేవుడు మా అడ్డంకులను తొలగించు గాక. అగ్నిదేవుడు మమ్మల్ని సమస్త పాపముల నుంచి గట్టెంకించాలి. సముద్రాన్ని పడవ ఎలా దాటిస్తుందో అలా దుర్గాదేవి మమ్మల్ని కష్టాలనుంచి దాటించు గాక.


తామగ్నివర్షాం తపసా జ్వలతీం వైరోచనీ కర్మఫలేషు జుష్టామ్‌||
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతసితసే తరసే నమః||
అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం = అగ్ని వర్ణం గలది, తపస్సు ద్వారా ప్రకాశించేదీ, భగవంతునకు చెందినది,
కర్మఫలేషు జుష్టామ్‌ దుర్గాం దేవీ = కర్మ ఫలాల్లో శక్తిగా నెలకొన్న దుర్గామాతను,
అహం ప్రపద్యే = నేను వేడుకొంటున్నాను.
తరసే సుతరసి నమః = తీరానికి చేర్చే ఓ మాతా నన్ను కడతేర్చు, నీకివే నా నమస్కారాములు.
అగ్ని వర్ణం గలది తపస్సు ద్వారా ప్రకాశించేదీ, భగవంతునకు చెందినది, కర్మ ఫలాలనివ్వడంలో శక్తిగా నెలకొన్న దుర్గామాతను, నేను వేడుకొంటున్నాను. తీరానికి చేర్చే ఓ మాతా నన్ను కడతేర్చు, నీకివే నా నమస్కారాములు..


అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్సస్తిభిరతి దుర్గాణి విశ్వా|
పూశ్చ పృథ్వి బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః||
అగ్నే త్వం నవ్యః = హే అగ్నిదేవా! నువ్వు కీర్తింప తగిన వాడవు.
స్వస్తిభిః అస్మాన్‌ విశ్వా దుర్గాణి అతిపారయ = సంతోషకరమైన మార్గాల ద్వారా మమ్మల్ని సమస్త దుఃఖాలనుండి సుదూరంగా తీసుసుకువెళ్ళు.
నః భూః పృథ్వీ ఉర్వీ చ బహులా = మా ఊరు, దేశమూ, ప్రంపంచమూ పోషింపబడుగాక.
తోకాయ తనయాయ శంయోః = మా పిల్లలకు వారి పిల్లలకు సుఖసంతోషాలనియ్యి.
హే అగ్నిదేవా! నువ్వు కీర్తింప తగిన వాడవు. సంతోషకరమైన మార్గాల ద్వారా మమ్మల్ని సమస్త దుఃఖాలనుండి సుదూరంగా తీసుసుకువెళ్ళు. మా ఊరు, దేశమూ, ప్రంపంచమూ పోషింపబడుగాక. మా పిల్లలకు వారి పిల్లలకు సుఖసంతోషాలనియ్యి.


విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధూన్న నావా దురితా తిపర్‌షి|
అగ్నే అత్రివన్మనసా గృణానోఽస్మాకం బోధ్యవితా తనూనామ్‌||
జాతవేదః విశ్వాని దుర్గహా = జాతవేదుడా! సమస్త దుఃఖాలను హరించేవాడా.
సింధుం నావా దురితాః అతిపర్షి = భవసాగరంలో నుండి, దురితాల నుంచి మోక్షమనే తీరానికి చేర్చు.
అగ్నే అస్మాకం తనూనాం అవితా = హే అగ్ని దేవా! మా శరీరాలను కాపాడు/రక్షించు.
మనసా ఘృణానః అత్రివత్‌ బోధి = పురాణాలు పదే పదే చెప్పుతున్న అత్రిమునిని మనస్సు ద్వారా గుర్తుచేసుకో, మమ్మల్ని కాపాడు.
జాతవేదుడా! సమస్త దుఃఖాలను హరించేవాడా. భవసాగరంలో నుండి, దురితాల నుంచి మోక్షమనే తీరానికి చేర్చు. హే అగ్ని దేవా! మా శరీరాలను కాపాడు/రక్షించు. పురాణాలు పదే పదే చెప్పుతున్న అత్రిమునిని మనస్సు ద్వారా గుర్తుచేసుకో, మమ్మల్ని కాపాడు.


పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమథ్సధస్థాత్‌|
స నః పర్‌షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాఽత్యగ్నిః||
పృతనా జితగ్‌ం సహమానం ఉగ్రం అగ్నిం = శత్రుసైన్యాన్ని నాశనం చేసేవాడు, ఉగ్రమైనవాడు అయిన అగ్ని దేవుణ్ణి;
పరమాత్‌ సథస్థాత్‌ హువేమ = అతి ఉన్నత స్థానం నుండి ఆహ్వానిస్తున్నాం..
సః విశ్వా దుర్గాణి క్షామాత్‌ దురితాత్‌ అతి పరిషత్‌ = మా సమస్త క్లేశాలను, పాపాలను నశింప చేసి మమ్మల్ని కాపాడుగాక.
శత్రుసైన్యాన్ని నాశనం చేసేవాడు, ఉగ్రమైనవాడు అయిన అగ్ని దేవుణ్ణి అతి ఉన్నత స్థానం నుండి ఆహ్వానిస్తున్నాం. ఆ అగ్నిదేవుడు మా సమస్త క్లేశాలను, పాపాలను నశింప చేసి మమ్మల్ని కాపాడుగాక.


ప్రత్నోషి కమీడో అధ్వరేషు సనాచ్ఛ హోతా నవ్యశ్చ సత్సి|
స్వాంచాఽగ్ని తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ||
అగ్నే అధ్వరేషు ఈఢ్యః కం ప్రత్నోషి = యాగాలలో కీర్తంపబడుతున్న ఓ అగ్నిదేవా! మా ఆనందాన్ని ఇనుమడింపచేయి.
హోతా సనాత్‌ చ నవ్య చ సత్సి = యాగం చేసేవారిలో సనాతనుడిగా నవ్యుడిగా ఒప్పారుతున్నావు.
స్వాం తనువం చ సౌభగం ఆయుజస్వ = నీ స్వరూపంగా ఉన్న మాకు సంతోషాన్ని సౌభాగ్యాన్ని అన్నివైపుల నుండి యివ్వు.
యాగాలలో కీర్తింపబడుతున్న ఓ అగ్నిదేవా! మా ఆనందాన్ని ఇనుమడింపచేయి. యాగం చేసేవారిలో సనాతనుడిగా నవ్యుడిగా ఒప్పారుతున్నావు. నీ స్వరూపంగా ఉన్న మాకు సంతోషాన్ని సౌభాగ్యాన్ని అన్నివైపుల నుండి యివ్వు.


గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ|
నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతామ్‌||
ఇంద్రః ఆయుజః = హే భగవంతుడా! పాపరహితుడా!
విష్ణోః గోభిః జుష్ఠ నిషిక్తం తవ అనుసంచరేమ = సకలం వ్యాపించినవాడా పశువులతో పరమానందం అపరిమితంగా పొందగోరి నిన్ను వెంబడిస్తున్నాము.
పృష్ఠం అభి నా కస్య సంవవస్యానః వైష్ణవీ ఇహ మాదయంతాం = ఉన్నతమైన దేవలోకంలో నివసించే వైష్ణవీ మాత మాకు సంతోషాన్ని ప్రసాదించు గాక.
హే భగవంతుడా! పాపరహితుడా! సకలం వ్యాపించిన వాడా! పశువులతో పరమానందం అపరిమితంగా పొందగోరి నిన్ను వెంబడిస్తున్నాము.ఉన్నతమైన దేవలోకంలో నివసించే వైష్ణవీ మాత మాకు సంతోషాన్ని ప్రసాదించు గాక.


ఓం కాత్యాయనాయా విధ్మహే కన్యకుమారి ధీమహి|
తన్నో దుర్గి ప్రచోదయాత్‌||
ఓం శాంతి శాంతి శాంతి||
కాత్యాయనాయ విద్మహే = కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము.
కన్యకుమారి ధీమహి = కన్యాకుమారిని ధ్యానిద్దాం.
తత్‌ దుర్గిః నః ప్రచోదయాత్‌ = దుర్గాదేవి మా బుద్ధిని ప్రచోదనం చేయు గాక.

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. కన్యాకుమారిని ధ్యానిద్దాం. దుర్గాదేవి మా బుద్ధిని ప్రచోదనం చేయు గాక. ఓం శాంతి శాంతి శాంతి||


www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

No comments: