[racchabanda] మత్తకోకిల - సైతవము #mattakOkila - saitavamu#

మత్తకోకిల - సైతవము - 

మత్తకోకిల వృత్తములో శ్లోకములోని ఒక ప్రత్యేకతయైన సైతవము దాగి యున్నది. సైతవములో అన్ని పాదములలో 5,6,7 అక్షరములు జ-గణము. 

మత్తకోకిల - 

ప్రేమ వేణువు నూఁదు వేగము - వీణ మీటెదఁ జక్కఁగా 
స్వామి గానమునందు రావము - ప్రాణమందున మ్రోఁగెఁగా 
శ్యామ సుందర మూర్తిఁ జూడఁగ - నంద మెల్లెడ నిండుఁగా 
ప్రేమ మందిరమందు నీకొక - విందు నిచ్చెదఁ జల్లఁగా 

ఇందులోని సైతవములు - 

వేణువు నూఁదు వేగము  
వీణ మీటెదఁ జక్కఁగా 
గానమునందు రావము 
ప్రాణమందున మ్రోఁగుఁగా 

సుందర మూర్తిఁ జూడఁగ  
నంద మెల్లెడ నిండుఁగా 
మందిరమందు నీకొక  
విందు నిచ్చెదఁ వేడిగా  

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
mattakOkila - saitavamu - 

mattakOkila vRttamulO SlOkamulOni oka pratyEkatayaina saitavamu dAgi yunnadi. saitavamulO anni pAdamulalO 5,6,7 axaramulu ja-gaNamu. 

mattakOkila - 

prEma vENuvu nU@Mdu vEgamu - vINa mITeda@M jakka@MgA 
svAmi gAnamunaMdu raavamu - prANamaMduna mrO@Mge@MgA 
SyAma suMdara mUrti@M jUDa@Mga - naMda melleDa niMDu@MgA 
prEma maMdiramaMdu nIkoka - viMdu nichcheda@M jalla@MgA 

iMdulOni saitavamulu - 

vENuvu nU@Mdu vEgamu  
vINa mITeda@M jakka@MgA 
gAnamunaMdu raavamu 
prANamaMduna mrO@Mgu@MgA 

suMdara mUrti@M jUDa@Mga  
naMda melleDa niMDu@MgA 
maMdiramaMdu nIkoka  
viMdu nichcheda@M vEDigA  

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 8

శ్లోకాలలో కొత్త లోకాలు - 8 

కన్నులతోడఁ గవ్వించున్ 
జెన్నుగ మాట లాడుచున్ 
వెన్నెలలోన నవ్వించున్ 
జిన్నది నన్ను గొన్నదో  

ఈరోజు మంచి రోజేమో 
నీరూపు నేను జూచితిన్ 
తీరమ్ములేని సంద్రాన 
దూరాన భూమి కన్బడెన్ 

కాలమాగదు నీకోసం 
ఖేలి యాగఁడు నింగిలో 
ఫాలమందలి యావ్రాతన్ 
వాఁడు దిద్దునె యేడ్చినన్ 

తెలుఁగులోన శ్లోకమ్ము 
వెలుఁగు నిచ్చు ఛందమే 
లలితమైన వృత్తమ్మే 
లలిని బెంచు నిత్యమే 

విధేయుడు - మోహన 

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] సరోజినీ - శ్లోకము #sarOjinI - SlOkamu#

సరోజినీ - శ్లోకము 

ఉత్పలమాలలోని 7,8,9 అక్షరములైన న-గణమును గలముగా మార్చి వ్రాసిన వృత్తము సరోజినీ. అప్పుడు దానిని 6,8 - 6,8 మాత్రలుగా వ్రాసి పాడుకోవచ్చును. ఈ సరోజినీవృత్తపు అమరికలో శ్లోకపు అమరిక కూడ ఉన్నది. మధ్య ఉన్న భ-గణపు వంతెన వరణము ఇందులో. 

UIIU IUUI - UII - UIIU IUIU - ఇందులో మొదటి భాగము శ్లోకపు బేసి పాదము, రెండవ భాగము (UII) వరణము, మూడవ భాగము శ్లోకపు సరి పాదము. క్రింద ఒక ఉదాహరణము - 

సరోజినీ - భ/ర/ర/స/స/జ/గ UII UIU UI - UII - UII UIUIU
19 అతిధృతి 177815

మందము మందమై రమ్ము - మానస - 
సుందరి చింద నందముల్ 
చందురుఁ జూడఁగా రమ్ము - చక్కని 
చందన గంధినీ చెలీ 

విందుల నీయఁగా రమ్ము - వేగమె - 
నందనమందు హాయిగా 
కుందన శిల్పమై రమ్ము - కోమలి - 
స్యందనమందుఁ బోవఁగా 

వరణమును తొలగించి చదివితే ఇది శ్లోకము అవుతుంది. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sarOjinI - SlOkamu 

utpalamAlalOni 7,8,9 axaramulaina na-gaNamunu galamugA mArchi vrAsina vRttamu sarOjinI. appuDu dAnini 6,8 - 6,8 mAtralugA vrAsi pADukOvachchunu. ee sarOjinIvRttapu amarikalO SlOkapu amarika kUDa unnadi. madhya unna bha-gaNapu vaMtena varaNamu iMdulO. 

#UIIU IUUI - UII - UIIU IUIU# - iMdulO modaTi bhAgamu SlOkapu bEsi pAdamu, reMDava bhAgamu (#UII#) varaNamu, mUDava bhAgamu SlOkapu sari pAdamu. kriMda oka udAharaNamu - 

sarOjinI - bha/ra/ra/sa/sa/ja/ga #UII UIU UI - UII - UII UIUIU#
19 atidhRti 177815

maMdamu maMdamai rammu - maanasa - 
suMdari chiMda naMdamul^ 
chaMduru@M jooDa@Mgaa rammu - chakkani 
chaMdana gaMdhinee chelee 

viMdula neeya@Mgaa rammu - vaegame - 
naMdanamaMdu haayigaa 
kuMdana Silpamai rammu - kOmali - 
syaMdanamaMdu@M bOva@Mgaa 

varaNamunu tolagiMchi chadivitE idi SlOkamu avutuMdi. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 7

శ్లోకాలలో కొత్త లోకాలు - 7

చూడుమా చందమామా నా 
గోడులన్ వినవేలకో 
రాఁడు వాడిట నెందుండెన్ 
బాడు బుద్ధులు వానికిన్ 

అరవిందము నేత్రమ్ముల్ 
మఱువలేని యందమే 
యరుణారుణ వర్ణమ్ము 
మురువా లేక కోపమా 

ఆనందము మనసులో 
వీణియవలె మ్రోఁగఁగా 
నేనను స్థితి గలదా 
నేనయితిని నీవుగా 
(ఇది చపాలా భేదము) 

నల్లనల్లని మేఘమ్ముల్ 
దెల్లవారఁగ మెల్లఁగా 
వెల్లువై వెలుఁగుల్ పారన్ 
దెల్లతెల్లఁగ మారెఁగా 

యోగమ్మును వియోగమ్మున్
రాగటంకంపు వైపులా 
యోగమెప్డు వియోగమ్మే 
భాగమయ్యెను మన్కిలో 

విధేయుడు - మోహన 

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 6

శ్లోకాలలో కొత్త లోకాలు - 6

ఈవసంతము నేకాంత,  
పూవు లెల్లెడ రంగులన్ 
జీవరాగము శోకమ్ము 
త్రోవ కానని యాత్రలో 

వెన్నెలలోన క్షీరమ్ము 
గిన్నెలనుండి త్రాఁగ రా 
కన్నులలోన దీపాలు 
పున్నమిలోనఁ దాపమే 

తల్లీ నిన్ను దలంతున్ నా 
యుల్లమం దుండుమా సదా 
యెల్ల విద్యల నేర్పించు 
ఫుల్లాబ్జాక్షీ సరస్వతీ 

జలజనాభు దేవేరీ 
జలజాక్షీ జలోద్భవా 
లలితాంగీ రమా లక్ష్మీ 
యిల మాకిమ్ము సంపదల్ 

అనంతరూపిణీ దేవీ 
వినంతులన్ గొనంగ రా 
మనమ్ములో సదా నీవే 
మనోజారిప్రియా సతీ 