[racchabanda] భావినీ, జాతి పద్యము పుష్పలత #bhAvinI, jAti padyamu pushpalata#

 

భావినీ, జాతి పద్యము పుష్పలత - 

భావినీ వృత్తమునకు ఆధారము - నాట్యశాస్త్రము, రత్నమంజూష, హేమచంద్రుడు
నడక - త్ర్యస్రగతి 
ఇతర నామములు - తరంగవతీ, కామినీ

భావినీ (తరంగవతీ, కామినీ) - ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171

కొండగాలి వీచుచుండఁగా 
గుండెలోన మ్రోఁత నిండఁగా 
నండగాను నీవు నిల్తువా 
మెండు ప్రీతిఁ బేరు పిల్తువా 

రాగవీణ మీట రమ్మురా 
భోగగీతి నొండు తెమ్మురా 
యోగవేళఁ బ్రేమయే కదా 
సాఁగనిమ్ము మోదమున్ సదా 

నీరాజాక్షి పద్య మియ్యఁగాఁ 
గోరుచుంటిఁ బాడఁ దియ్యఁగా 
వేఱు మాటలేల కామినీ 
మేరలేని హాళి భావినీ 

ఎదురు నడకలేని త్రిమాత్రలతో (UI, III) వ్రాస్తే స్వాతంత్ర్యము ఎక్కువగా ఉంటుంది. అట్టి జాతి పద్యమును పుష్పలత అని పిలువ దలచినాను. క్రింద జాతి పద్యము పుష్పలతకు ఉదాహరణములు - 

మన్నుఁ దినుట మాను మన్నయా 
వెన్న నారగించు కన్నయా 
చిన్ని పదము లెంతొ ముద్దురా 
కన్నులందు దృష్టి కద్దురా 

ఆననమ్ముఁ జూడ మనసులో 
గానగంగ పారె క్షణములో 
వేణుగానరవపు టలలలో 
నేను నన్ను మఱతుఁ గలలలో 

ప్రేమపుష్ప లతలు పూయఁగా 
రామచిలుక పాడెఁ దీయఁగాఁ  
గామబాణ మొండు గ్రుచ్చఁగా 
నామనస్సు మారె వెచ్చఁగా 

త్యాగరాజు రెండు పుష్పలత పాదములను చేర్చి కీర్తనను వ్రాసినాడు. కనుక్కోండి చూద్డాము! 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
bhAvinI, jAti padyamu pushpalata - 

bhAvinI vRttamunaku aadhAramu - nATyaSAstramu, ratnamaMjUsha, hEmachaMdruDu
naDaka - tryasragati 
itara naamamulu - taraMgavatI, kAminI

bhAvinI (taraMgavatI, kAminI) - ra/ja/ra #UI UI UI UIU#
9 bRhati 171

koMDagAli vIchuchuMDa@MgA 
guMDelOna mrO@Mta niMDa@MgA 
naMDagAnu nIvu niltuvA 
meMDu prIti@M bEru piltuvA 

rAgavINa mITa rammurA 
bhOgagIti noMDu temmurA 
yOgavELa@M brEmayE kadA 
sA@Mganimmu mOdamun sadA 

nIrAjAxi padya miyya@MgA@M 
gOruchuMTi@M bADa@M diyya@MgA 
vE~ru mATalEla kAminI 
mEralEni hALi bhAvinI 

eduru naDakalEni trimAtralatO (#UI, III#) vrAstE svAtaMtryamu ekkuvagA uMTuMdi. aTTi jAti padyamunu pushpalata ani piluva dalachinAnu. kriMda jAti padyamu pushpalataku udAharaNamulu - 

mannu@M dinuTa mAnu mannayA 
venna nAragiMchu kannayA 
chinni padamu leMto muddurA 
kannulaMdu dRshTi kaddurA 

aananammu@M jUDa manasulO 
gAnagaMga pAre xaNamulO 
vENugAnaravapu TalalalO 
nEnu nannu ma~ratu@M galalalO 

prEmapushpa latalu pUya@MgA 
rAmachiluka pADe@m dIya@MgA@M  
gAmabANa moMDu gruchcha@MgA 
nAmanassu mAre vechcha@MgA 

tyAgarAju reMDu pushpalata pAdamulanu chErchi kIrtananu vrAsinADu. kanukkOMDi chUdDAmu! 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: