[racchabanda] చిత్రవేశ - మాత్రాసమక వృత్తము #chitravESa - mAtrAsamaka vRttamu#

 

చిత్రవేశ - మాత్రాసమక వృత్తము 

ఆధారము - కల్పితము
స్ఫూర్తి - ఒక త్యాగరాజ కీర్తన (కనుక్కోండి)
అమరిక - నాలుగు త్రిమాత్రలు (లేక రెండు షణ్మాత్రలు) - చ/త్రి/చ 

చిత్రవేశ - (త్రి)4 - చ/త్రి/చ 
పాదమధ్యములో, పాదాంతములో విరామయతి 

మథన పడఁగ కారణమ్ము - మనసా నీకు తెలుసా 
వ్యధల వంగుటేల చెప్పు - బరువా బ్రతుకు తెరువా 
నిధిగ నాతఁ డుండ నీకు - నెలయే వెలుఁగు సెలయే 
మధురగీతిఁ బాడు మింక - మదిలో ముదపు నదిలో 

రామ రామ యన్న చాలు - రసమే యమృత రసమే 
నామ మదియు విన్న చాలు - నదమే పారు ముదమే 
యీమనస్సు నిండిపోవు - నిలపై శాంతి మలుపై 
మోమునందు నవ్వు లలరుఁ - బూలై మనికి మేలై 

రమ్ము నీవు నన్ను జూడ - రంగా ప్రేమ గంగా 
చిమ్ము చెలువములను శ్రీల - శృంగా కామ భృంగా 
ఇమ్ము మోముపైన ముద్దు - ఈశా చిత్ర వేశా 
వమ్ము సేయకాశ నమృత - పాత్రా మధుర గాత్రా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chitravESa - mAtrAsamaka vRttamu 

aadhAramu - kalpitamu
sphUrti - oka tyAgarAja kIrtana (kanukkOMDi)
amarika - nAlugu trimAtralu (lEka reMDu shaNmAtralu) - cha/tri/cha 

chitravESa - (tri)4 - cha/tri/cha 
pAdamadhyamulO, pAdAMtamulO virAmayati 

mathana paDa@Mga kAraNammu - manasA nIku telusA 
vyadhala vaMguTEla cheppu - baruvA bratuku teruvA 
nidhiga nAta@M DuMDa nIku - nelayE velu@Mgu selayE 
madhuragIti@M bADu miMka - madilO mudapu nadilO 

rAma rAma yanna chAlu - rasamE yamRta rasamE 
nAma madiyu vinna chAlu - nadamE pAru mudamE 
yImanassu niMDipOvu - nilapai SAMti malupai 
mOmunaMdu navvu lalaru@M - bUlai maniki mElai 

rammu nIvu nannu jUDa - raMgA prEma gaMgA 
chimmu cheluvamulanu SrIla - SRMgA kAma bhRMgA 
immu mOmupaina muddu - ISA chitra vESA 
vammu sEyakASa namRta - pAtrA madhura gAtrA 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: