[racchabanda] హేమాద్రి #hEmAdri#

 

హేమాద్రి - 

ఆధారము - కల్పితము 
మొదటి, చివరి భాగముల ఏడక్షరముల అమరిక ఒకటే. మధ్యన ఉండే వరణము రెండు లఘువులు. మూడు చతుర్మాత్రలు, ఒక వరణము, మళ్లీ మూడు చతుర్మాత్రలతో త్యాగరాజ కీర్తనలు ఉన్నాయి.

హేమాద్రి - త/య/భ/త/య/గ 
UUII UUU - II - UUII UUU లేక UU IIU UU - II - UU IIU UU
యతి 1,8; ప్రాసయతి 1, 10 (ప్రాసాక్షరాలు 2, 11)
16 అష్టి 6541

పాలించుమురా రంగా - పరి 
పాలించుమురా రంగా 
ఆలించుము శ్యామాంగా - వ్యధ 
నాలించుము శ్యామాంగా 
లాలించుమురా దేవా - లలిఁ 
దేలించుమురా దేవా 
చాలించుమురా స్వామీ - శఠ 
మేలా యిట్టుల నాపై 

ఏమో నిను జూడంగా - హృది 
ప్రేమమ్మున మున్గెన్గా 
నామానస సంద్రమ్మే - నవ 
కామోర్మిక లోలమ్మే 
ఆమోదము లీయంగా - నవి 
యా మోదము లయ్యెన్గా 
ప్రేమామృత మెందుండున్ - ప్రియ 
హేమాద్రుల యందుండున్ 

రామా యనుమా నాల్కా - రఘు 
రామా యనుమా నాల్కా 
కామాదుల నిర్జించన్ - గడు
ప్రేమమ్మున నో నాల్కా 
నేమమ్ములతో నుండన్ - నెఱ 
నామమ్ము జపించంగా 
శ్యామా యనుమా నాల్కా - ఘన 
శ్యామా యనుమా నాల్కా 
(ఘన తఱువాత విరామము ఉన్నది) 

నీవుండఁగ నాచెంతన్ - నిజ 
భావమ్ముల చేతమ్మే 
నీవుండఁగ నాచెంతన్ - నిశి 
రావమ్ముల గీతమ్మే 
నీవుండఁగ నాచెంతన్ - నెల 
గావించెడు ద్యోతమ్మే 
నీవుండఁగ నాచెంతన్ - నెఱ 
జీవమ్మొక స్రోతమ్మే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
hEmAdri - 

aadhAramu - kalpitamu 
modaTi, chivari bhAgamula EDaxaramula amarika okaTE. madhyana uMDE varaNamu reMDu laghuvulu. mUDu chaturmAtralu, oka varaNamu, maLlI mUDu chaturmAtralatO tyAgarAja kIrtanalu unnAyi.

hEmAdri - ta/ya/bha/ta/ya/ga 
#UUII UUU - II - UUII UUU# lEka #UU IIU UU - II - UU IIU UU#
yati 1,8; prAsayati 1, 10 (prAsAxarAlu 2, 11)
16 ashTi 6541

pAliMchumurA raMgA - pari 
pAliMchumurA raMgA 
aaliMchumu SyAmAMgA - vyadha 
nAliMchumu SyAmAMgA 
lAliMchumurA dEvA - lali@M 
dEliMchumurA dEvA 
chAliMchumurA svAmI - SaTha 
mElA yiTTula nApai 

EmO ninu jUDaMgA - hRdi 
prEmammuna mun&gen&gA 
nAmAnasa saMdrammE - nava 
kAmOrmika lOlammE 
aamOdamu lIyaMgA - navi 
yA mOdamu layyen&gA 
prEmAmRta meMduMDun - priya 
hEmAdrula yaMduMDun 

rAmA yanumA nAlkA - raghu 
rAmA yanumA nAlkA 
kAmAdula nirjiMchan - gaDu
prEmammuna nO nAlkA 
nEmammulatO nuMDan - ne~ra 
nAmammu japiMchaMgA 
SyAmA yanumA nAlkA - ghana 
SyAmA yanumA nAlkA 
(ghana ta~ruvAta virAmamu unnadi) 

nIvuMDa@Mga nAcheMtan - nija 
bhAvammula chEtammE 
nIvuMDa@Mga nAcheMtan - niSi 
rAvammula gItammE 
nIvuMDa@Mga nAcheMtan - nela 
gAviMcheDu dyOtammE 
nIvuMDa@Mga nAcheMtan - ne~ra 
jIvammoka srOtammE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: