[racchabanda] మూడు నడకలతో నిశాజ్యోతి #mUDu naDakalatO niSAjyOti#

 

మూడు నడకలతో నిశాజ్యోతి - 

ఆధారము - కల్పితము 
నడక - శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును తొలగించగా లభించినది ఈ వృత్తము

నిశాజ్యోతి - త/జ/భ/భ/ర/ర 18 ధృతి 77229

శార్దూలవిక్రీడితపు నడకతో UUI IUI UIIIU - UUI UUIU 

రారా యదువంశచంద్ర త్వరగా - రాజీవనేత్రా హరీ 
కారాగృహమందు నుంటి నిలపైఁ - గావంగ రావేలకో 
యీరాతిరియందుఁ జీఁకటులలో - నేరీతి నేనుందునో  
దూరమ్మున నుండె గమ్య మదియున్ - ద్రోవన్ వెలింగించరా 

4,5,5 - 4,5,5 మాత్రల విఱుపుతో సంపఁగి జాతి UU IIUI UIII - UU UIU UIU 

ఈనా మనమొక్క మందిరమె - యిందా దైవ మా నీవెగా 
వీణా స్వనమందు నీగళమె - ప్రేమారావమే నీవెగా 
వానల్ గురిపించు నేలపయిఁ - బ్రాణాధారమే నీవెగా 
రా నాగృహమందు వేచితిని - రమ్యాకారమున్ గాంచఁగా 

6,8 - 6,8 మాత్రల విఱుపుతో ఆనందార్ణవమువలె UUII UIUIII - UUU IUUIU 

ఆకాశపు టంచులో వెలిఁగె - నందమ్మై నిశాజ్యోతులే 
రాకాశశి రమ్యమై పిలిచె - రానంటిన్ రమించంగ లే
నేకాంతపు టెల్లలో నిచట - నేనుంటిన్ విచారమ్ముతో 
నీకాంతుల నెట్టు లుండగల - నీడెంద మ్మధీరమ్ముగా 

పదముల విఱుపుపై నడక ఆధారాపడి ఉంటుంది. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
mUDu naDakalatO niSAjyOti - 

aadhAramu - kalpitamu 
naDaka - SArdUlavikrIDitamulOni modaTi guruvunu tolagiMchagA labhiMchinadi ee vRttamu

niSAjyOti - ta/ja/bha/bha/ra/ra 18 dhRti 77229

SArdUlavikrIDitapu naDakatO #UUI IUI UIIIU - UUI UUIU# 

rArA yaduvaMSachaMdra tvaragA - rAjIvanEtrA harI 
kArAgRhamaMdu nuMTi nilapai@M - gAvaMga rAvElakO 
yIrAtiriyaMdu@M jI@MkaTulalO - nErIti nEnuMdunO  
dUrammuna nuMDe gamya madiyun - drOvan veliMgiMcharA 

4,5,5 - 4,5,5 mAtrala vi~ruputO saMpa@Mgi jAti #UU IIUI UIII - UU UIU UIU# 

eenA manamokka maMdirame - yiMdA daiva mA nIvegA 
vINA svanamaMdu nIgaLame - prEmArAvamE nIvegA 
vAnal guripiMchu nElapayi@M - brANAdhAramE nIvegA 
rA nAgRhamaMdu vEchitini - ramyAkAramun gAMcha@MgA 

6,8 - 6,8 mAtrala vi~ruputO aanaMdArNavamuvale #UUII UIUIII - UUU IUUIU# 

aakASapu TaMchulO veli@Mge - naMdammai niSAjyOtulE 
rAkASaSi ramyamai piliche - rAnaMTin ramiMchaMga lE
nEkAMtapu TellalO nichaTa - nEnuMTin vichArammutO 
nIkAMtula neTTu luMDagala - nIDeMda mmadhIrammugA 

padamula vi~rupupai naDaka aadhArApaDi uMTuMdi. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: