[racchabanda] నవనీతము - శ్లోకము #navanItamu - SlOkamu#

 

నవనీతము - శ్లోకము 

ఆధారము - కల్పితము 
స్ఫూర్తి - కృష్ణాష్టోత్తర శతనామవాళియందలి ఒక రెండు పాదములు (చిన్న మార్పుతో) 
నడక - 6,5 - 6,5 మాత్రలు

నవనీతము - స/స/భ/జ/జ/గ IIUII UUI - IIUII UIU
16 అష్టి 23452 

నవనీతము డెందమ్ము - నవనీతపు ప్రేమలో 
ద్రవమైతిని నేనిందు - ధవళాంశ తుషారమై 
భువనమ్మొక చిత్రమ్ము - పువులెల్లెడఁ బూయఁగా 
నవజీవన మీనాకు - నవమై యెపుడో హరీ 

ఋతురాగము లెందెందు - నృతిఁ జేసెను శోభతో 
నతులమ్ముగ మోదమ్ము - లతివా నిను జూడఁగా 
గతమెల్లను వాదమ్ము - గతి గమ్యము ముందుకే 
జతగా నిఁక పోదాము - జతిఁ దప్పక మన్కిలో 

యమునానది తీరమ్ము - యమళమ్ముల సొంపులే
కమనీయము గీతమ్ము - గమకమ్ముల వంపులే 
రమణీయము రాగమ్ము - రమియించఁగ హృద్యమే 
సుమచంచల భావమ్ము - సుమనోహర పద్యమే 

ఈ మూడు పద్యములను రెండేసి శ్లోకములుగా వ్రాయవచ్చును.. ఒక దానికి క్రింద ఉదాహరనము - 

యమునానది తీరమ్ము  
యమళమ్ముల సొంపులే
కమనీయము గీతమ్ము 
గమకమ్ముల వంపులే 

రమణీయము రాగమ్ము  
రమియించఁగ హృద్యమే 
సుమచంచల భావమ్ము 
సుమనోహర పద్యమే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navanItamu - SlOkamu 

aadhAramu - kalpitamu 
sphUrti - kRshNAshTOttara SatanAmavALiyaMdali oka reMDu pAdamulu (chinna mArputO) 
naDaka - 6,5 - 6,5 mAtralu

navanItamu - sa/sa/bha/ja/ja/ga #IIUII UUI - IIUII UIU#
16 ashTi 23452 

navanItamu DeMdammu - navanItapu prEmalO 
dravamaitini nEniMdu - dhavaLAMSa tushAramai 
bhuvanammoka chitrammu - puvulelleDa@M bUya@MgA 
navajIvana mInAku - navamai yepuDO harI 

RturAgamu leMdeMdu - nRti@M jEsenu SObhatO 
natulammuga mOdammu - lativA ninu jUDa@MgA 
gatamellanu vAdammu - gati gamyamu muMdukE 
jatagA ni@Mka pOdAmu - jati@M dappaka man&kilO 

yamunAnadi tIrammu - yamaLammula soMpulE
kamanIyamu gItammu - gamakammula vaMpulE 
ramaNIyamu rAgammu - ramiyiMcha@Mga hRdyamE 
sumachaMchala bhAvammu - sumanOhara padyamE 

ee mUDu padyamulanu reMDEsi SlOkamulugA vrAyavachchunu. oka dAniki kriMda udAharanamu - 

yamunAnadi tIrammu  
yamaLammula soMpulE
kamanIyamu gItammu 
gamakammula vaMpulE 

ramaNIyamu rAgammu  
ramiyiMcha@Mga hRdyamE 
sumachaMchala bhAvammu 
sumanOhara padyamE 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: