[racchabanda] సైతవ #saitava#

 

సైతవ - 

అనుష్టుప్పు లక్షణములను సంగ్రహముగా క్రింద ఇస్తున్నాను - 

1) మొదటి గణము స,న గణములుగా నుండరాదు. 5,6,7 అక్షరములు బేసి / సరి పాదములకు క్రింది విధములుగా ఉండును - 

వక్త్రా - య/య
పథ్యా - య/జ
విపరీతా - జ/య
చపలా - న/జ
విపులా - ?/న 
సైతవ - జ/జ

తద్విపులా - నతభరమస / జ 
వ్యక్తిపక్షములో మొదటి లేక మూడవ పాదములో 
జాతి పక్షములో మొదటి, మూడవ పాదములలో (నాలుగవ అక్షరము గురువు అన్ని పాదాలలో సామాన్యముగా) 

ఇందులో విపులలో బేసి పాదముల గణము స్పష్టముగా తెలుపబడ లేదు. అదే విధముగా తద్విపుల కూడ ఒక ప్రత్యేకమైనది. ఈ సందేశములో నేను సైతవ అనుష్టుప్పును గుఱించి చెప్పుతాను - 

ఇందులో అన్ని పాదములలో 5,6,7,8 అక్షరములు IUIUగా ఉంటుంది. ఈ జ/గ గణముల అమరిక ఒక చక్కటి మూస. ఇది రెండుసారులు పక్కపక్కన ఉంటే మనకు ప్రమాణిక లభిస్తుంది. రెండు ప్రమాణికలు చేరినప్పుడు అది పంచచామరము అవుతుంది. ఎన్నో వృత్తాలలో చివరి నాలుగు అక్షరాలు జ/గ గణములుగా ఉంటాయి, ఉదా. చంపకోత్పలమాలలు. నా ఉద్దేశములో నర్కుటకమునకు చివర IUIU తగిలించగా చంపకమాల ఉద్భవించినది. 

సైతవ - 5,6,7 అక్షరములు జ-గణము

లాలి మాధవ లాలిజో 
లాలి కేశవ లాలిజో
లాలి అచ్యుత లాలిజో 
లాలి నాకన్న లాలిజో 

ఏదృష్టి తాఁకకుండురా 
నిద్రలోఁ బ్రక్క నుందురా
నిద్రించవేల లాలిజో 
భద్రమ్ము నీవు లాలిజో 

నందకుమార రాత్రిలో 
బృందావనము పిల్చెరా 
వంద తారలు నింగిలో 
విందు పాటలు గాలిలో 

ముందు రమ్మిట మోహనా 
చిందఁగా సుధ ధారలై 
సుందరమ్మగు రాస మా 
నంద మిచ్చుర హాయిగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
saitava - 

anushTuppu laxaNamulanu saMgrahamugA kriMda istunnAnu - 

1) modaTi gaNamu sa,na gaNamulugA nuMDarAdu. 5,6,7 axaramulu bEsi / sari pAdamulaku kriMdi vidhamulugA uMDunu - 

vaktrA - ya/ya
pathyA - ya/ja
viparItA - ja/ya
chapalA - na/ja
vipulA - ?/na 
saitava - ja/ja

tadvipulA - natabharamasa / ja 
vyaktipaxamulO modaTi lEka mUDava pAdamulO 
jAti paxamulO modaTi, mUDava pAdamulalO (nAlugava axaramu guruvu anni pAdAlalO sAmAnyamugA) 

iMdulO vipulalO bEsi pAdamula gaNamu spashTamugA telupabaDa lEdu. adE vidhamugA tadvipula kUDa oka pratyEkamainadi. ee saMdESamulO nEnu saitava anushTuppunu gu~riMchi chepputAnu - 

iMdulO anni pAdamulalO 5,6,7,8 axaramulu #IUIU#gA uMTuMdi. ee ja/ga gaNamula amarika oka chakkaTi mUsa. idi reMDusArulu pakkapakkana uMTE manaku pramANika labhistuMdi. reMDu pramANikalu chErinappuDu adi paMchachAmaramu avutuMdi. ennO vRttAlalO chivari nAlugu axarAlu ja/ga gaNamulugA uMTAyi, udA. chaMpakOtpalamAlalu. nA uddESamulO narkuTakamunaku chivara #IUIU# tagiliMchagA chaMpakamAla udbhaviMchinadi. 

saitava - 5,6,7 axaramulu ja-gaNamu

lAli mAdhava lAlijO 
lAli kESava lAlijO
lAli achyuta lAlijO 
lAli nAkanna lAlijO 

EdRshTi tA@MkakuMDurA 
nidralO@M brakka nuMdurA
nidriMchavEla lAlijO 
bhadrammu nIvu lAlijO 

naMdakumAra rAtrilO 
bRMdAvanamu pilcherA 
vaMda tAralu niMgilO 
viMdu pATalu gAlilO 

muMdu rammiTa mOhanA 
chiMda@MgA sudha dhAralai 
suMdarammagu rAsa mA 
naMda michchura hAyigA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: