[racchabanda] విపులా, విపులాభేదములు, తద్విపులా #vipulA, vipulAbhEdamulu, tadvipulA#

 

విపులా, విపులాభేదములు, తద్విపులా - 

సామాన్య విపులకు అనుష్టుప్పు పథ్యకు ఏమియు భేదము లేదు. అనగా విపులకు కూడ సరి పాదములలో 5,6,7 అక్షరములు జగణముగా, బేసి పాదములలో ఆ అక్షరములు యగణముగా ఉంటుంది. మఱి ఈ విపులా భేదమును ఎందుకు వివరించారు అనే ప్రశ్న కలుగుతుంది. దీనికి కారణము బేసి పాదములలో 5,6,7 అక్షరములను న,త,భ,ర,మ,స గణములుగా ఉంచి వ్రాసినప్పుడు వాటిని ఆ గణముల పేరుతో విపులా అంటారు. అనగా బేసి 5,6,7 అక్షరములు త-గణముగా ఉంటే అది త-విపులా అవుతుంది, అది భ-గణముగా ఉంటే అది భ-విపులా అవుతుంది, ఇలాగే మిగిలినవి. వీటిని తద్విపులా అంటారు. 

రెండు బేసి పాదములలో ఆ గణములను అమర్చి వ్రాసినప్పుడు అది జాతిపక్ష విపులా, ఒక బేసి పాదములో (మొదటి కాని మూడవ పాదము కాని) ఆ గణముగా, మిగిలిన దానిని యగణముగా వ్రాసినప్పుడు అది వ్యక్తిపక్ష విపులా అవుతుంది. ఇలా వ్రాస్తే అవి ఆ విపులా భేదములకు పేరులా లేక జాతిగతముగా, వ్యక్తిగతముగా వీటిని వ్రాయాలా అనే విషయము నాకు పూర్తిగా అర్థము కాలేదు. పండితులను తెలుపగోరుతున్నాను. ఆఱు విధములైన విపులలను హేమచంద్రుడు పేర్కొన్నాడు. కాని న-విపులా ఎందుకు పేర్కొనబడినదో అర్థము కాలేదు. బేసి పాదములు నగణముగా ఉంటే అది అనుష్టుప్పు చపలా అవుతుంది కదా? 

య-విపులా అన్నది అనుష్టుప్పు పథ్యా, జ-విపులా అన్నది అనుష్టుప్పు సైతవము. కాని మిగిలిన ఆఱింటితో వీటిని కూడ ప్రత్యేకముగా వాగ్వల్లభకారుడు పేర్కొన్నాడు. 

భగవద్గీతలో ఉండే అనుష్టుప్పు శ్లోకాలలో ఇట్టి జాతిపక్ష, వ్యకతిపక్ష విపులా శ్లోకములు ఎక్కడెక్కడ వస్తాయి అనే విషయమును గీతాదర్పణము అనే పుస్తకములో స్వామీ రామసుఖదాసు వివరించారు. 

క్రింద ఆఱు విధములైన విపులా భేదములకు నా ఉదాహరణములు - 

న-విపులా - 

నన్ను జూడుమ సకియా 
విన్నవింతును నామొఱల్ 
కన్నుదోయి కలియఁగా 
మిన్ను దిగున్ ధరాస్థలిన్ (జాతి)

తిక్కనార్యుఁడు గవితల్ 
చక్కగా నాటకమ్మనన్ 
మక్కువన్ దాఁ దెలుంగందు 
నక్కజమ్ముగ రచించెన్ (వ్యక్తి)

త-విపులా - 

ఆకాశములోఁ దారక 
లేకాంతముగ నుండెనా 
రాకాశశియో రమ్యము 
చీఁకాకులు ధరాస్థలిన్ (జాతి)

కాలిదాసు కావ్యమ్ము లా 
కళారూపపు జ్యోతులే 
మాలదాల్చిన స్త్రీమూర్తుల్ 
శిలారూపపు చింతనల్ (వ్యక్తి)

భ-విపులా - 

మల్లికా సుమమ్ములతో 
వెల్లివిరిసె రమ్యమై 
చల్లఁగాను రాత్రియు రం-
జిల్లగా నిల నుల్లముల్ (జాతి)

శ్రీనాథకవీ కవితా 
శ్రీనాథసూన శారదా 
శ్రీనికేతన శృంగార 
శ్రీనికేతన చిన్మయా (వ్యక్తి) 

ర-విపులా 

ఆనందపు సంద్రమందు 
నేనుంటిని బ్రియున్ గనన్
వానిన్ గన మేన నాకుఁ 
దేనెలు ప్రవహించెనే (జాతి)

శ్రీకృష్ణరాయా నరేశా 
ప్రాకట కవినాయకా 
లోకోపకార సంకల్పా 
రాకాచంద్రనిభాననా (వ్యక్తి) 

మ-విపులా -

పద్మినీ పద్మాక్షీ దేవీ 
పద్మముఖీ నిరంజనా 
పద్మాసనీ పాలించన్ రా
పద్మనాభప్రియా రమా (జాతి)

కవివిష్ణూ కవిబ్రహ్మా 
కవిశంకర వాఙ్నిధీ 
కవిసార్వభౌమశ్రేష్ఠా 
కవి పెద్దన దీనిధీ (వ్యక్తి)  

స-విపులా 

మనసున మనసైన 
వనితా నిన్ను గోరితిన్ 
తనువునఁ దనువై రా 
కనులముందు ప్రేమతో (జాతి) 

సత్యనారాయణా నీవు 
సత్యముగా కవీంద్రుఁడే 
నిత్యము నిన్ను దలంతుఁ 
జిత్తమ్ములోన నొజ్జగా (వ్యక్తి)

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vipulA, vipulAbhEdamulu, tadvipulA - 

sAmAnya vipulaku anushTuppu pathyaku Emiyu bhEdamu lEdu. anagA vipulaku kUDa sari pAdamulalO 5,6,7 axaramulu jagaNamugA, bEsi pAdamulalO aa axaramulu yagaNamugA uMTuMdi. ma~ri ee vipulA bhEdamunu eMduku vivariMchAru anE praSna kalugutuMdi. deeniki kAraNamu bEsi pAdamulalO 5,6,7 axaramulanu na,ta,bha,ra,ma,sa gaNamulugA uMchi vrAsinappuDu vATini aa gaNamula pErutO vipulA aMTAru. anagA bEsi 5,6,7 axaramulu ta-gaNamugA uMTE adi ta-vipulA avutuMdi, adi bha-gaNamugA uMTE adi bha-vipulA avutuMdi, ilAgE migilinavi. vITini tadvipulA aMTAru. 

reMDu bEsi pAdamulalO aa gaNamulanu amarchi vrAsinappuDu adi jAtipaxa vipulA, oka bEsi pAdamulO (modaTi kAni mUDava pAdamu kAni) aa gaNamugA, migilina daanini yagaNamugA vrAsinappuDu adi vyaktipaxa vipulA avutuMdi. ilA vrAstE avi aa vipulA bhEdamulaku pErulA lEka jAtigatamugA, vyaktigatamugA vITini vrAyAlA anE vishayamu naaku pUrtigA arthamu kAlEdu. paMDitulanu telupagOrutunnAnu. aa~ru vidhamulaina vipulalanu hEmachaMdruDu pErkonnADu. kAni na-vipulA eMduku pErkonabaDinadO arthamu kAlEdu. bEsi pAdamulu nagaNamugA uMTE adi anushTuppu chapalA avutuMdi kadA? 

ya-vipulA annadi anushTuppu pathyA, ja-vipulA annadi anushTuppu saitavamu. kAni migilina aa~riMTitO vITini kUDa pratyEkamugA vAgvallabhakAruDu pErkonnADu. 

bhagavadgItalO uMDE anushTuppu SlOkAlalO iTTi jAtipaxa, vyakatipaxa vipulA SlOkamulu ekkaDekkaDa vastAyi anE vishayamunu gItAdarpaNamu anE pustakamulO svAmI rAmasukhadAsu vivariMchAru. 

kriMda aa~ru vidhamulaina vipulA bhEdamulaku nA udaaharaNamulu - 

na-vipulaa - 

nannu jooDuma sakiyaa 
vinnaviMtunu naamo~ral^ 
kannudOyi kaliya@Mgaa 
minnu digun^ dharaasthalin^ (jaati)

tikkanaaryu@MDu gavital^ 
chakkagaa naaTakammanan^ 
makkuvan^ daa@M deluMgaMdu 
nakkajammuga rachiMchen^ (vyakti)

ta-vipulaa - 

aakaaSamulO@M daaraka 
laekaaMtamuga nuMDenaa 
raakaaSaSiyO ramyamu 
chee@Mkaakulu dharaasthalin^ (jAti)

kaalidaasu kaavyammu laa 
kaLaaroopapu jyOtulae 
maaladaalchina streemoortul^ 
Silaaroopapu chiMtanal^ (vyakti)

bha-vipulA - 

mallikA sumammulatO 
vellivirise ramyamai 
challa@MgAnu rAtriyu raM-
jillagA nila nullamul (jAti)

SrInAthakavI kavitA 
SrInAthasUna SAradA 
SrInikEtana SRMgAra 
SrInikEtana chinmayA (vyakti) 

ra-vipulA 

aanaMdapu saMdramaMdu 
nEnuMTini briyun ganan
vAnin gana mEna nAku@M 
dEnelu pravahiMchenE (jAti)

SrIkRshNarAyA narESA 
prAkaTa kavinAyakA 
lOkOpakAra saMkalpA 
rAkAchaMdranibhAnanA (vyakti) 

ma-vipulA -

padminI padmAxI dEvI 
padmamukhI niraMjanA 
padmAsanI pAliMchan rA
padmanAbhapriyA ramA (jAti)

kavivishNU kavibrahmA 
kaviSaMkara vA~mnidhI 
kavisArvabhaumaSrEshThA 
kavi peddana dInidhI (vyakti)  

sa-vipulA 

manasuna manasaina 
vanitA ninnu gOritin 
tanuvuna@M danuvai rA 
kanulamuMdu prEmatO (jAti) 

satyanArAyaNA nIvu 
satyamugA kavIMdru@MDE 
nityamu ninnu dalaMtu@M 
jittammulOna nojjagA (vyakti)

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: