[racchabanda] వృత్తము - శ్లోకము #vRttamu - SlOkamu#

 

వృత్తము - శ్లోకము 

ఆధారము - కల్పితము 
బేసి పాదములు - పద్మమాలా - ర/ర/గగ 
సరి పాదములు - ర/ర/లగ 

శ్లోకము - ర/ర/గగ // ర/ర/లగ 
UIU UIU UU // UIU UIUIU

వేగమే నింపుమా సాకీ 
రాగపీయూష పాత్రలో 
యోగమేగా సదా నాకీ 
రాగచైతన్య యాత్రలో 

నాదమే యా తరంగమ్మా 
నాదమే యంతరంగమా 
మోదమే భావరాగమ్మా 
బాధయే జీవనాగమా 

ర/ర/గగ/ర/ర/లగ ఒకే పాదముగ వృత్తము 
ర/ర/మ/య/జ/గ 16 అష్టి 21011

ఆలయమ్మందు నున్నావా - యాలకించంగ లేవుగా 
మూలలో దాఁగియున్నావా - పూలతోఁ జూడ రావుగా 
జాలమే లేద నన్నావా - జాలితో మాట లాడవే 
కాలమే కాచు నన్నావా - కాలమైపోయెఁ గూడవే 

నేరమా నిన్ను జూడంగా - నీర మీకళ్ల గాథయా 
భార మీగుండె యయ్యెన్గా - పారమే లేని బాధయా 
దారి లేదెందుఁ బోవంగాఁ - దారలే లేని రాత్రిలో 
కోరితిన్ నిన్ను జేరంగాఁ - గోరికల్ వాడె ధాత్రిలో 

ప్రతి పద్యమును రెండు శ్లోకములుగా వ్రాయ వీలగును. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vRttamu - SlOkamu 

aadhAramu - kalpitamu 
bEsi pAdamulu - padmamAlA - ra/ra/gaga 
sari pAdamulu - ra/ra/laga 

SlOkamu - ra/ra/gaga // ra/ra/laga 
#UIU UIU UU // UIU UIUIU#

vEgamE niMpumA sAkI 
rAgapIyUsha pAtralO 
yOgamEgA sadA nAkI 
rAgachaitanya yAtralO 

nAdamE yA taraMgammA 
nAdamE yaMtaraMgamA 
mOdamE bhAvarAgammA 
bAdhayE jIvanAgamA 

ra/ra/gaga/ra/ra/laga okE paadamuga vRttamu 
ra/ra/ma/ya/ja/ga 16 ashTi 21011

aalayammaMdu nunnAvA - yAlakiMchaMga lEvugA 
mUlalO dA@MgiyunnAvA - pUlatO@M jUDa rAvugA 
jAlamE lEda nannAvA - jAlitO mATa lADavE 
kAlamE kAchu nannAvA - kAlamaipOye@M gUDavE 

nEramA ninnu jUDaMgA - nIra mIkaLla gAthayA 
bhAra mIguMDe yayyen&gA - pAramE lEni bAdhayA 
dAri lEdeMdu@M bOvaMgA@M - dAralE lEni rAtrilO 
kOritin ninnu jEraMgA@M - gOrikal vADe dhAtrilO 

prati padyamunu reMDu SlOkamulugA vrAya vIlagunu. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: