[racchabanda] పరుగిడి పోయె....

 

పరుగిడి పోయె..
------------------------

--

చం.

--

పరుగిడి పోయెఁ గాలమది పండుగలన్నియుఁ జూడముచ్చటై.
గురుసముఖంబులోనిచటఁ గూర్చుని, చేసిన బోధలానుచున్ 
గురు కరుణాకటాక్షమునఁ గొందలమన్నది లేక యుండఁగా,
జరిగెను బెక్కు రోజులవి సజ్జన గోష్ఠుల, టెక్ససందునన్

--

చదువఁగ లేదు పోస్టులను ఛందము నందున సైతమీతెరన్ 
కదలక యుండ లేఖినియుఁ గైతలనల్లఁగఁ దోచనట్లుగా, 
వదలక యుండినన్ జనని, పల్కుల రాల్చక మిన్నకుండఁగా 
ముదముగ వ్రాయనైతినిట ముద్దుగఁ బద్యము నొక్కటేనియున్

--

ఘనముగ నుండెనన్నియును గన్నుల పండుగ గాఁగ నిత్యమున్ 
చనువును జూపు మిత్రులను, సాదరమొప్పఁగఁ బల్కువారలన్ 
దినదినమిచ్చటన్ గలసి తృప్తిగ గడ్పితి సార్థకంబుగా
మనమున నిల్పి సద్గురుని మాటలనన్నియు భక్తిభావమున్

--

కడు రుచివంతమైనవవి కమ్మగ నంద ప్రసాదమై సదా 
కుడువఁగ లోటు గాకెటులఁ గూర్చుని వంటను జేయకుండినన్ 
గడపుదు వారమింకొకటి కాదని చెప్పక సద్గురూక్తికిన్ 
గుడినిట నున్న వేల్పులకుఁ గూర్మినొసంగుచు వేల జోతలన్

--

స్పందననీయలేదనుచు బాధను బొందకుఁ డెవ్వరీ గుమిన్
సందియమేమిలేకెటుల సాగఁగ లేఖిని దేవిసత్కృపన్ 
ఛందము లోన ముందువలె శారద కాన్కలఁ బంచుకొంచు మీ 
యందఱి కిత్తు స్పందనల నందిన వీలునుబట్టి నాకిటన్

--

వందనములతో 
సుప్రభ

--

సరగుననిత్తుఁ బద్యములఁ జక్కనివే కడు కూర్మి తోడ , నే 
కొఱఁతయు లేనియట్టివయి గుండెకుఁ గూర్చఁగఁ దృప్తియెంతయో 
పరుగులు దీయ వర్ణములు భావము తోడుతఁ జూడనింపుగా 
మఱి మఱి మోదమిచ్చునవి మందికి నైనను నెట్టుపైనటన్

--

9వ తారీఖున బయలుదేరి 1500 మైళ్ళు ప్రయాణము చేసి సద్గురుసందర్శనము కొఱకు టెక్సస్ రాష్ట్రములోని ఫ్రిస్కో పట్టణమునకు వచ్చాను. వచ్చిన దగ్గరనుండి యిక్కడ జరిగే కార్యక్రమములను తిలకిస్తూ గడుపటముతో సమయము లేక యెక్కువగా స్పందనలివ్వలేకపోయాను. ఈరోజు సమయము చిక్కినదని కొంచెము సేపు తెరపైన గడుపగానే పై పద్యము నుపోద్ఘాతముగా నిడి వ్రాయించినవి.

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: