Hiking trail – J.H. ఏమీ లేదు ఎవరూ లేరిక్కడ అని అనుకుంటాను. ఏమీ ఉండని బండచరియల్లో ఉలుకూ పలుకూ లేకుండా మెల్లి మెల్లిగా వంకర దారుల్లో ఎక్కుతూ పోతే ఎన్ని సెలయేళ్లు, ఎన్ని ఏస్పెన్, ఎన్ని అల్లిబిల్లి తీవలు. రేటిల్ వినిపిస్తుంది. రేటిల్ స్నేక్ ఉండే ఉంటుంది. భయపడతాను. అకస్మాత్తుగా గ్రిజ్లీ బేర్ కూడా అప్పుడే గుర్తుకొచ్చి, నా దగ్గర బేర్ స్ప్రే లేదని బిగుసుకుపోతాను. హకల్ బెర్రీ బుష్ లు కనిపిస్తే, మరి ఎలుగుబంటి ఫేమిలీ దగ్గర్లో ఉండదా అని గుండె గడగడలాడిపోతుంది. ఫోర్ సీజన్స్ లో వరండాలో ఫైర్ పిట్ దగ్గర, సిల్వర్ ప్లాటర్ లో తెస్తే షేంపేన్ తాగే యోగం ఇక లేదా, ఎందుకు ఈ ట్రెయిల్ - నైకీ షూలూ నాకెందుకు! అడివిలో ఏకాంతంలో పొదలలో కొయ్య మీద ఆని గులకరాళ్ల మీద గలగల పారే నీటిని వింటూ గట్టిగా ఊపిరి తీస్తే, లంగ్స్ అంతా ఆక్సిజన్, మెదడెంతో తేలిక. చుట్టూతా అడివి పూలు ఎన్నెన్నో ఎర్రెర్రగా ఎప్పుడూ చూడనివి. అడివి కొమ్మల మధ్యల్లో ఇరుకుగా నడవగా ఎక్కగా ఎక్కగా అకస్మాత్తుగా చదును ప్రదేశం వస్తుంది. కాలు మోపగానే ఒక్కసారిగా చుట్టూ పర్వతాలన్నీ లేచినుంచుంటాయి. Lyla
Posted by: lylayfl@aol.com
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (278) |
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
No comments:
Post a Comment