[racchabanda] వందనంబులివె ..

 

వందనంబులివె ..
******************


చం.


పలికెడి తల్లి వీవనుచుఁ బ్రస్తుతి సల్పెద భక్తితోడ. నీ 
పలుకులె నాదు భాగ్యమని భావన సేయుచు నెల్లవేళలన్
సలలితమైన వాక్కులవి సంతసమీయఁగఁ బ్రేమ ధారలై 
యలయక నిన్నుఁ గొల్చెదను హాటకగర్భుని వ్రాత మెచ్చుచున్ 

తెలియదు పుణ్యమిట్టిదని దివ్యకృపారసమందనీవిధిన్ 
తెలియవు పూర్వజన్మముల దీక్షగఁ గొల్చిన తీరులైననున్ 
నిలువఁగ నామనంబిటుల నిత్యము నీపయినేమి హేతువో 
పులకల నొందునీతనువు పూర్ణకృపాలయ! తల్చినంతనే.

అతులిత మాధురీగరిమ నల్లఁగఁ జాలని రీతియైననున్
బ్రతిదినమేదొ వ్రాయకిట భావము దృప్తినిఁ జెందదంచు మూ 
రితి నొకటుంచి నీదెదుట హృద్యముగా మతినున్నదంతయున్
స్తుతమతి! నీకుఁ దెల్పుకొనఁ జుట్టెద నీగతిఁ బద్యమాలికల్

సలుపక కూర్మిభాషణల సంతసమేగతి యందునంచు నన్ 
బలుకఁగఁ జేయుదీవె కద ప్రత్యహమిట్టులఁ గూర్చి ప్రేరణన్
జిలుకను బోలిపల్కుదున చేతము నీదలరంగ రీతిగా 
నొలుకుచు మందహాసముల నొప్పుగ శ్రేయము గూర్చనిచ్చలున్ 

కలరవమొప్పు వీణియగఁ గమ్మఁగ గానము సేయకున్న నీ 
కలిగిన ప్రేమతో సతము గారవమొప్పఁగఁ బ్రోచుతల్లి! శ్రీ 
లలిత! దయామయీ! కొనుము లక్షణయుక్తము పద్యమందు నే 
సలిపెడి వందనంబులివె, సత్కృపనుంచుచు నిట్లె నిత్యమున్


సుప్రభ 
3:15 PM
08-30-2018

 
 
 

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: