Re: [racchabanda] సార్థకనామ వృత్తము "గజాస్య" #sArthakanAma vRttamu "gajAsya"#

 

cAlA bAguMdi mOhana gArU.
mUrti

2018-09-12 17:37 GMT-04:00 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com>:


సార్థకనామ వృత్తము "గజాస్య" -

ఆధారము - కల్పితము 
నడక - వనమయూరపు ఖండ గతి
గణములు - గ/జ/జ/స/య 

గజాస్య - ర/స/న/ర/గ UIU IIUI - IIUI UU
13 అతిజగతి 1499

మ్రొక్కెదన్ గణనాథ - ముదమార నిన్నే 
చిక్కులన్ విడదీసి - చెలువమ్ము నీవా 
మక్కువన్ మముఁ గావు - మమతన్ గజాస్యా 
స్రక్కులన్ నిను గొల్తు - సరసాభిరామా 

దండిగా సిరులిమ్ము - దయతోడ మాకున్ 
మెండుగా చదువిమ్ము - మృదువైన వాణిన్ 
దుండగమ్ముల నాపి - దురితమ్ముఁ బాపన్ 
దొండమున్ దలనుంచు - తొలిజియ్య సామీ 

సుందారాకృతితోడ - శుభహస్త మిమ్మా 
నందయంతికిఁ బుత్ర - నవమోహనాంగా 
ముందుగా నిను గొల్తుఁ - బువులన్ దళాలన్ 
విందుగాఁ గొనుమయ్య - ప్రియ మోదకమ్ముల్ 

కష్టముల్ దొలగించి - కరుణించు జియ్యా 
యిష్టమైనవి నీకు - నిపుడిత్తు నయ్యా 
మృష్టమౌ తినుబండ - మిడెదన్ గణేశా 
దుష్టులన్ బరిమార్చు - ధ్రువమై మహేశా 

మోదకమ్ములు నీకు - పులగమ్ము నీకే 
నాదగీతము నీకు - నటనమ్ము నీకే 
వేదపాఠము నీకు - విరిదండ నీకే 
బీదవానిది గోడు - వినుమయ్య దేవా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sArthakanAma vRttamu "gajAsya" -

aadhAramu - kalpitamu 
naDaka - vanamayUrapu khaMDa gati
gaNamulu - ga/ja/ja/sa/ya 

gajAsya - ra/sa/na/ra/ga #UIU IIUI - IIUI UU#
13 atijagati 1499

mrokkedan gaNanAtha - mudamAra ninnE 
chikkulan viDadIsi - cheluvammu nIvA 
makkuvan mamu@M gAvu - mamatan gajAsyA 
srakkulan ninu goltu - sarasAbhirAmA 

daMDigA sirulimmu - dayatODa mAkun 
meMDugA chaduvimmu - mRduvaina vANin 
duMDagammula nApi - duritammu@M bApan 
doMDamun dalanuMchu - tolijiyya sAmI 

suMdArAkRtitODa - Subhahasta mimmA 
naMdayaMtiki@M butra - navamOhanAMgA 
muMdugA ninu goltu@M - buvulan daLAlan 
viMdugA@M gonumayya - priya mOdakammul 

kashTamul dolagiMchi - karuNiMchu jiyyA 
yishTamainavi nIku - nipuDittu nayyA 
mRshTamau tinubaMDa - miDedan gaNESA 
dushTulan barimArchu - dhruvamai mahESA 

mOdakammulu nIku - pulagammu nIkE 
nAdagItamu nIku - naTanammu nIkE 
vEdapAThamu nIku - viridaMDa nIkE 
bIdavAnidi gODu - vinumayya dEvA

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#




__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: