[racchabanda] నవరాత్రి - 3 - గాయత్రీ #navarAtri - 3 - gAyatrI#

 

నవరాత్రి - 3 - గాయత్రీ 

చాల పురాతనమైన ఛందస్సులలో గాయత్రి ఒకటి. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఈ విధముగా అంటాడు - 

బృహత్సామా తథా సామ్నాం
గాయత్రీ ఛందసామహమ్ 
మాసానాం మార్గశీర్షోఽహం 
ఋతూనాం కుసుమాకరః - భగవద్గీత, 10.35
(సామవేదములో బృహత్సామము, ఛందస్సులో గాయత్రీ ఛందము, నెలలలో మార్గశిరము, ఋతువులలో వసంతఋతువు నేను.)

గాయత్రీ ఛందము త్రిపద. అందుకే దీనిని త్రిపద గాయత్రి అంటారు. పాదమునకు ఎనిమిది అక్షరాలు. చివరి నాలుగు అక్షరములు రెండు లగములు. మొదటి నాలుగు ఏవైనా ఉండవచ్చును. మొత్తము 24 అక్షరాలు. కాని న-గణముతో ఆరంభమవదు. లౌకిక ఛందస్సులో వృత్తమునకు ఎప్పుడు నాలుగు పాదములు. అందువలన 24 అక్షరములతో ఉండే గాయత్రిని ఆఱవ ఛందముగా పేర్కొన్నారు. కాని త్రిపద గాయత్రిలో పాదమునకు అనుష్టుప్పు ఛందములోవలె ఎనిమిది అక్షరాలే. 

అనంతమైన విశ్వమా 
అనాదియైన రూపమా 
ప్రణామమ్ములు మాతృకా 

గాయత్రీ లోకపూజితా 
వేయితలల వేద్య మా 
సాయ మ్మెప్పుడు నీవెగా 

సాంద్రానంద ముఖ ద్యుతీ 
చంద్ర సూర్యాగ్ని లోచనా 
ఇంద్రాది సుర పూజితా 

బొమ్మల కొల్వులోన నో 
యమ్మ ముందుండుమా సదా 
వమ్ము సేయకు నమ్మికల్ 

అకలంకా అనింద్య మా 
సకలమ్మిల నీవెగా 
శకలమ్ములఁ జేర్చుమా 

సునాదినీ సుధానిధీ 
ప్రణవమంత్ర యోగినీ 
జననీ మముఁ గావుమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navarAtri - 3 - gAyatrI 

chAla purAtanamaina ChaMdassulalO gAyatri okaTi. bhagavadgItalO SrIkRshNaparamAtma ee vidhamugA aMTADu - 

bRhatsAmA tathA sAmnAM
gAyatrI ChaMdasAmaham 
mAsAnAM mArgaSIrshO@2haM 
RtUnAM kusumAkara@h - bhagavadgIta, 10.35
(sAmavEdamulO bRhatsAmamu, ChaMdassulO gAyatrI ChaMdamu, nelalalO mArgaSiramu, RtuvulalO vasaMtaRtuvu nEnu.)

gAyatrI ChaMdamu tripada. aMdukE dInini tripada gAyatri aMTAru. pAdamunaku enimidi axarAlu. chivari naalugu axaramulu reMDu lagamulu. modaTi nAlugu EvainA uMDavachchunu. mottamu 24 axarAlu. kAni na-gaNamutO aaraMbhamavadu. laukika ChaMdassulO vRttamunaku eppuDu nAlugu pAdamulu. aMduvalana 24 axaramulatO uMDE gAyatrini aa~rava ChaMdamugA pErkonnAru. kAni tripada gAyatrilO pAdamunaku anushTuppu ChaMdamulOvale enimidi axarAlE. 

anaMtamaina viSvamA 
anAdiyaina rUpamA 
praNAmammulu mAtRkA 

gAyatrI lOkapUjitA 
vEyitalala vEdya mA 
sAya mmeppuDu nIvegA 

sAMdrAnaMda mukha dyutI 
chaMdra sUryAgni lOchanA 
iMdrAdi sura pUjitA 

bommala kolvulOna nO 
yamma muMduMDumA sadA 
vammu sEyaku nammikal 

akalaMkA aniMdya mA 
sakalammila nIvegA 
Sakalammula@M jErchumA 

sunAdinI sudhAnidhI 
praNavamaMtra yOginI 
jananI mamu@M gAvumA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: