[racchabanda] అష్టపది - 33 #ashtapadi - 33#

 

అష్టపది - 33

కన్నడములో సాంగత్యము అని ఒక ఛందస్సు ఉన్నది. ఇది సీసములోని మార్పు అని చెప్పవచ్చును. సీసములోని చివరి సూర్య గణమును తొలగిస్తే మనకు సాంగత్యము లభిస్తుంది. సాంగత్యపు లక్షణములు - వి/వి - వి/వి // వి-వి-బ్ర 
రెండు అర్ధ పాదములకు ప్రాస ఉన్నది. తెలుగులోని ఇంద్ర గణములతో UUU, IIUU చేర్చినప్పుడు మనకు కన్నడములో విష్ణు గణములు లభిస్తాయి. అదే విధముగా UI, III లతో UU, IIU లను చేర్చినప్పుడు బ్రహ్మ గణములు లభిస్తాయి. నిజముగా ఇది విలోమ ప్రక్రియ. బ్రహ్మ గణములనుండి సూర్య గణములు, విష్ణు గణములనుండి ఇంద్ర గణములు పుట్టాయి. 

సాంగత్యము ఏ విధముగా పుట్టినదనే చర్చ కన్నడములో విపులముగా నున్నది. కాని వారు ఎందువలన సీసమునుండి అది జనించ లేదో అనే విషయమును మఱచారు. అదే విధముగా సాంగత్యము అష్టపదులనుండి కూడ జనించి ఉండవచ్చును. 

సాంగత్యమును ఆధారముగా చేసికొని వ్రాసిన అష్టపది యిది. రెండేసి గణములకు ప్రాసయతి. ఇందులో నేను ఇంద్ర గణములకు బదులుగా పంచ మాత్రలను, సూర్య గణములకు బదులుగా త్రిమాత్ర లేక చతుర్మాత్రను ఉపాయోగించినాను.  

అష్టపది - పం/పం - పం/పం  - పం/పం/త్రి(చ) 

ఇందువదనమ్ములోఁ - జిందు సుధ లీయఁగా - నిందీవరాక్షి యిట రావా 
సుందర మ్మీనిశియు - వందలగు తారకలు - విందు లిడు వెన్నెలలు నీవా - 1
ప్రియా జీవితములో - నయోత్సాహములతోఁ - బ్రయాణమ్మును జేయ రావా 
- ధ్రువము 

దూరమున సంద్రమిడు - హోరు సడి వీనులకు - నేరుగను జేరెఁగద వినుమా 
స్ఫారమగు కాంతి యా - నీరములపైఁ బడఁగ - మాఱు నల తళతళలఁ గనుమా - 2

శృంగములు నల్లబడ - రంగులవి మాయమవ - చెంగలువ వికసించెఁ జూడు
భృంగములు నిదురించె - జంగమము నిలబడెను - సంగీతమును నీవు పాడు - 3

మెల్లగను వ్యాళములు - మల్లె తీవలఁ బ్రాకఁ - బెల్లుబికె గాలిలోఁ దావి 
నల్లనగు చీఁకటుల - నుల్లములు పొంగగను - చల్లనగు ఘడియ లిఁక నీవి - 4

వాదములు వలదింక - ఖేదములు వలదింక - వేదములఁ బంచమము ప్రేమ 
మోదముల తెరలలో - నాదముల వఱదలో - నాదరికి రమ్మిపుడు రామ - 5

పద్యమును వ్రాయనా - గద్యమును జదువనా - హృద్యముగఁ బాడనా నీకు 
చోద్యమగు బ్రతుకులో - నాద్యమది నీవు నై-వేద్యమ్ము నొసఁగనా నీకు - 6

నీలోన నను గనెద - నాలోన నిన్ను గను - మీలోక మగు సుందరమ్ము 
పూలఋతు వీమనికి - కాలమ్ము స్థంబించు - పాలపాత్రను జేతి కిమ్ము - 7

శ్యామసుందర రజని - నీమనోమందిరము - ప్రేమవర్ణోజ్వలము సకియా 
రా మోహనమ్ముగా - వ్యోమమును గనుచు నీ - భూమిని రమించుదము చెలియా - 8

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ashTapadi - 33

kannaDamulO sAMgatyamu ani oka ChaMdassu unnadi. idi sIsamulOni mArpu ani cheppavachchunu. sIsamulOni chivari sUrya gaNamunu tolagistE manaku sAMgatyamu labhistuMdi. sAMgatyapu laxan'amulu - vi/vi - vi/vi // vi-vi-bra 
reMDu ardha pAdamulaku prAsa unnadi. telugulOni iMdra gaNamulatO #UUU, IIUU# chErchinappuDu manaku kannaDamulO vishNu gaNamulu labhistAyi. adE vidhamugA #UI, III# latO #UU, IIU# lanu chErchinappuDu brahma gaNamulu labhistAyi. nijamugA idi vilOma prakriya. brahma gaNamulanuMDi sUrya gaNamulu, vishNu gaNamulanuMDi iMdra gaNamulu puTTAyi. 

sAMgatyamu E vidhamugA puTTinadanE charcha kannaDamulO vipulamugA nunnadi. kAni vAru eMduvalana sIsamunuMDi adi janiMcha lEdO anE vishayamunu ma~rachAru. adE vidhamugA sAMgatyamu asht'apadulanuMDi kUDa janiMchi uMDavachchunu. 

sAMgatyamunu aadhAramugA chEsikoni vrAsina ashTapadi yidi. reMDEsi gaNamulaku prAsayati. iMdulO nEnu iMdra gaNamulaku badulugA paMcha mAtralanu, sUrya gaNamulaku badulugA trimAtra lEka chaturmAtranu upAyOgiMchinAnu.  

ashTapadi - paM/paM - paM/paM  - paM/paM/tri(cha) 

iMduvadanammulO@M - jiMdu sudha lIya@MgA - niMdIvarAxi yiTa rAvA 
suMdara mmIniSiyu - vaMdalagu tArakalu - viMdu liDu vennelalu nIvA - 1
priyA jIvitamulO - nayOtsAhamulatO@M - brayANammunu jEya rAvA 
- dhruvamu 

dUramuna saMdramiDu - hOru saDi vInulaku - nEruganu jEre@Mgada vinumA 
sphAramagu kAMti yA - nIramulapai@M baDa@Mga - mA~ru nala taLataLala@M ganumA - 2

SRMgamulu nallabaDa - raMgulavi mAyamava - cheMgaluva vikasiMche@M jUDu
bhRMgamulu niduriMche - jaMgamamu nilabaDenu - saMgItamunu nIvu pADu - 3

mellaganu vyALamulu - malle tIvala@M brAka@M - bellubike gAlilO@M dAvi 
nallanagu chI@MkaTula - nullamulu poMgaganu - challanagu ghaDiya li@Mka nIvi - 4

vAdamulu valadiMka - khEdamulu valadiMka - vEdamula@M baMchamamu prEma 
mOdamula teralalO - nAdamula va~radalO - nAdariki rammipuDu rAma - 5

padyamunu vrAyanA - gadyamunu jaduvanA - hRdyamuga@M bADanA nIku 
chOdyamagu bratukulO - nAdyamadi nIvu nai-vEdyammu nosa@MganA nIku - 6

nIlOna nanu ganeda - nAlOna ninnu ganu - mIlOka magu suMdarammu 
pUlaRtu vImaniki - kAlammu sthaMbiMchu - pAlapAtranu jEti kimmu - 7

SyAmasuMdara rajani - nImanOmaMdiramu - prEmavarNOjvalamu sakiyA 
rA mOhanammugA - vyOmamunu ganuchu nI - bhUmini ramiMchudamu cheliyA - 8

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu 
#
__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: