[racchabanda] నవరాత్రి - 4 - శ్రీ #navarAtri - 4 - SrI#

 

నవరాత్రి - 4 - శ్రీ - 

ఆధారము - జయదామన్
ఇతర నామములు - కుడ్మలదంతీ, రుచిరా, సాంద్రపద, భద్రపద, మౌక్తికమాలా, అనుకూలా, ప్రత్యవబోధా 

శ్రీ - భ/త/న/గగ UII UU - IIII UU
11 త్రిష్టుప్పు 487 

కాముని తల్లీ - కమలజ వల్లీ 
కోమల గాత్రా - కువలయ నేత్రా 
సోముని చెల్లీ - సుమధుర మల్లీ 
శ్రీమతి రావా - చెలువము తేవా 

జీవన దాతా - సిరులకు నేతా 
ప్రోవుము దేవీ - ముదముల క్రోవీ 
త్రోవలఁ జూపన్ - రుతముల నేర్పన్ 
నీవిట రావా - నిరుపమ రావా 

మాధురి నీవే - మమతయు నీవే 
వేదము నీవే - విజయము నీవే 
ఖేదము వద్దా - కెలువము నీవే 
మోదము నింపన్ - బులకలఁ దేవే 

నాతులు వేయన్ - నవమగు మ్రుగ్గుల్ 
చేతులలోనన్ - సిరివలె దివ్వెల్ 
గీతులతోడన్ - గృహములు నిండున్ 
బ్రీతుల నీవే - ప్రియమగు దేవీ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navarAtri - 4 - SrI - 

aadhAramu - jayadAman
itara naamamulu - kuDmaladaMtI, ruchirA, sAMdrapada, bhadrapada, mauktikamAlA, anukUlA, pratyavabOdhA 

SrI - bha/ta/na/gaga #UII UU - IIII UU#
11 trishTuppu 487 

kAmuni tallI - kamalaja vallI 
kOmala gAtrA - kuvalaya nEtrA 
sOmuni chellI - sumadhura mallI 
SrImati rAvA - cheluvamu tEvA 

jIvana dAtA - sirulaku nEtA 
prOvumu dEvI - mudamula krOvI 
trOvala@M jUpan - rutamula nErpan 
nIviTa rAvA - nirupama rAvA 

mAdhuri nIvE - mamatayu nIvE 
vEdamu nIvE - vijayamu nIvE 
khEdamu vaddA - keluvamu nIvE 
mOdamu niMpan - bulakala@M dEvE 

nAtulu vEyan - navamagu mruggul 
chEtulalOnan - sirivale divvel 
gItulatODan - gRhamulu niMDun 
brItula nIvE - priyamagu dEvI 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: