[racchabanda] నవరాత్రి - 5 - కమలాక్షీ #navarAtri - 5 - kamalAxI#

 

నవరాత్రి - 5 - కమలాక్షీ 

ఆధారము - జయదామన్ 
నడక - చతురస్రగతి 

కమలలోచనా, కమలాక్షీ, చండీ - న/న/స/స/గ IIII IIII - UII UU 
13 అతిజగతి 1792

ఉమ యని పిలిచెద - నో కమలాక్షీ 
రమ యని యనెదను - రా కమలాక్షీ 
అమ నుడుగులచెలి-యా కమలాక్షీ 
మము భువి దయఁ గను-మా కమలాక్షీ 

తులువల నునుచుము - దూరము చండీ 
మలమును గడుగుము - మాహృది నుండి 
చెలువము నెపుడును - జిమ్ముము తల్లీ 
కలువ కనుల మముఁ - గాంచుము మళ్లి 
(చివరి లఘువు విరామమువలన పాడేటప్పుడు గురుతుల్యము) 

నవమగు రజనుల - నాదము నిమ్మా 
భువి యొక కొలువవఁ - బ్రోవుమ యమ్మా 
దివె లిల వెలిఁగెను - దేహళి యందున్ 
కవితల పదములఁ - గంఠము లెందున్ 

ముదమగు రచనల - మ్రుగ్గులు నీకే 
సదమల సుమముల - స్రక్కులు నీకే 
హృదయపు మమతల - నిచ్చెడు తల్లీ 
కదలుము గృహమునఁ - గాంచన వల్లీ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navarAtri - 5 - kamalAxI 

aadhAramu - jayadAman 
naDaka - chaturasragati 

kamalalOchanA, kamalAxI, chaMDI - na/na/sa/sa/ga #IIII IIII - UII UU# 
13 atijagati 1792

uma yani pilicheda - nO kamalAxI 
rama yani yanedanu - rA kamalAxI 
ama nuDugulacheli-yA kamalAxI 
mamu bhuvi daya@M ganu-mA kamalAxI 

tuluvala nunuchumu - dUramu chaMDI 
malamunu gaDugumu - mAhRdi nuMDi 
cheluvamu nepuDunu - jimmumu tallI 
kaluva kanula mamu@M - gAMchumu maLli 
(chivari laghuvu virAmamuvalana pADETappuDu gurutulyamu) 

navamagu rajanula - nAdamu nimmA 
bhuvi yoka koluvava@M - brOvuma yammA 
dive lila veli@Mgenu - dEhaLi yaMdun 
kavitala padamula@M - gaMThamu leMdun 

mudamagu rachanala - mruggulu nIkE 
sadamala sumamula - srakkulu nIkE 
hRdayapu mamatala - nichcheDu tallI 
kadalumu gRhamuna@M - gAMchana vallI 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: