[racchabanda] నవరాత్రి - 6 - చపలా #navarAtri - 6 - chapalA#

 

నవరాత్రి - 6 - చపలా -

చపలా ఒక శ్లోక భేదము. ఇందులో బేసి పాదములలోని 5,6,7 అక్షరములు న-గణముగా నుండును. 

చంచలమ్ము సిరిగదా 
పంచగాఁ బెఱుఁగున్ గదా 
వంచనతో సిరి పటా- 
పంచలగును లక్ష్మిచే 

క్షీరసముద్రము గదా 
యూరు పుట్టిల్లు సింధుజా 
చేరువనుండు హరియున్ 
గోరికలను దీర్చుమా 

భాగ్యమ్ముల నొసఁగు వై-
రాగ్యమ్ముల నొసంగుమా 
యోగ్యులకు నొసఁగుమా 
భోగ్యములను బద్మినీ  

చపలా యనెదరు నిన్ 
చపలమ్ములు మావియే 
ప్రపన్నులను గని నీ 
కృపఁ జూపుము వైష్ణవీ 

నీనవ్వే యగు సిరిగా 
నీనడలే సదా సిరుల్ 
వానితోడఁ దెలుపుమా 
మా నలఁతల మెల్లఁగా 

మహాలక్ష్మీ కరుణతో 
సహాయమును జేయవే 
సుహాసినీ అజితహృ-
ద్విహారిణీ హరిప్రియా 

పద్మజా పద్మనయనా 
పద్మనాభ హృదీశ్వరీ 
పద్మసంభవు జననీ 
పద్మరాగద్యుతీ రమా 

మము పాలించుము సదా 
రమణీ దివ్యసుందరీ 
భ్రమలన్ బాపుము సిరీ 
విమలా విశ్వ మాతృకా 

అష్టకమ్ముఁ జదువఁగాఁ 
గష్టమ్ములు శమించుఁగా 
వృష్టిగాఁ గురియు సిరుల్ 
తుష్టి గల్గును మన్కిలో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navarAtri - 6 - chapalA -

chapalA oka SlOka bhEdamu. iMdulO bEsi pAdamulalOni 5,6,7 axaramulu na-gaNamugA nuMDunu. 

chaMchalammu sirigadA 
paMchagA@M be~ru@Mgun gadA 
vaMchanatO siri paTA- 
paMchalagunu laxmichE 

xIrasamudramu gadA 
yUru puTTillu siMdhujA 
chEruvanuMDu hariyun 
gOrikalanu dIrchumA 

bhAgyammula nosa@Mgu vai-
rAgyammula nosaMgumA 
yOgyulaku nosa@MgumA 
bhOgyamulanu badminI  

chapalA yanedaru nin 
chapalammulu mAviyE 
prapannulanu gani nI 
kRpa@M jUpumu vaishNavI 

nInavvE yagu sirigA 
nInaDalE sadA sirul 
vAnitODa@M delupumA 
mA nala@Mtala mella@MgA 

mahAlaxmI karuNatO 
sahAyamunu jEyavE 
suhAsinI ajitahR-
dvihAriNI haripriyA 

padmajA padmanayanA 
padmanAbha hRdISvarI 
padmasaMbhavu jananI 
padmarAgadyutI ramA 

mamu pAliMchumu sadA 
ramaNI divyasuMdarI 
bhramalan bApumu sirI 
vimalA viSva mAtRkA 

ashTakammu@M jaduva@MgA@M 
gashTammulu SamiMchu@MgA 
vRshTigA@M guriyu sirul 
tushTi galgunu man&kilO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAVu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: