[racchabanda] నవరాత్రి - 8 - అద్రితనయా #navarAtri - 8 - adritanayA#

 

నవరాత్రి - 8 - అద్రితనయా - 

అద్రితనయా లేక అశ్వలలిత (లలిత) ఒక సుందరమైన వృత్తము. దీనిని ఎన్నో విధములుగా వ్రాయవచ్చును. దీనిలో కొద్దిగా చంపకమాల నడక ఉన్నది. ఇది ఒక పురాతనమైన వృత్తమే, భట్టికావ్యములో నుపయోగించబడినది. వృత్తములలోని గణములను అమరికను పరిశీలిస్తే, భిన్నమైన గతులు మనకు గోచరిస్తాయి. తాళవృత్తముల నిర్మాణమునకు ఇట్టి పరిశీలన అత్యవసరము.  ఇవన్నీ పాడ దగినవే. 

అశ్వలలితా లేక అద్రితనయా - న/జ/భ/జ/భ/జ/భ/లగ 
23 వికృతి 3861424

IIII UIU III - UIU III UIU IIIU చంపకమాలవలె యతి

దిన మొక పద్మమాలికను - దేవి పాదములఁ దృప్తి నిత్తు బగితిన్  
వనమునఁ జంపకమ్ములను - వర్తులాకృతి నపర్ణ కిత్తు రమణన్ 
గణపతి కార్తికేయులకుఁ - గామధేనువగు కామినిన్ గరుణకై 
మనమున గొల్తు నెల్లపుడు - మన్మథారిసతి మాత నద్రితనయన్ 
(20 అక్టోబర్ 2017) 

IIII UIUI - IIUI UIII - UIU IIIU పది మాత్రల విఱుపుతో 

తపములతోడ నద్రి-తనయా మహేశ్వరుని - దారయైతివిగదా 
యపరిమితమ్ముగాను - హరుసమ్ము నింపుమమ - హారిణీ హరసతీ 
కృప నిటఁ జూపు కాంతి - కిరణాళిఁ జల్లుమమ - గేల నిచ్చి త్వరగా 
నెపుడును నన్ను గావు - మిలపైనఁ దీర్చుమమ - యీప్సితమ్ముల సదా 
(9 అక్టోబర్ 2016) 

తపమును జేసె నామె - తగు నిష్ఠతో శివుని - ధ్యానమం దిడుచు బల్ 
జపములఁ జేసె నామె - జగదేకరక్షకుని - స్వాంతమం దునుచుచున్ 
శపథము సేసె నామె - సరసేందుశేఖరుని - స్వామిగాఁ దలఁచుచున్ 
కృపఁ గను శంకరుండు - కెలవుంచి నవ్వి కొను - గేల నద్రితనయన్ 
(6 జూలై 2016)

IIII UIU - III UI UI - IIUI UIIIU తొమ్మిది మాత్రల విఱుపుతో ప్రాసయతితో 

అతులిత దీప్తితో - మతిని వెల్గనిమ్ము - గతి నీవె మాకు హిమజా 
నతులను భక్తితో - శ్రుతుల కింపుగాను - బ్రతి గీతి నిత్తు మగజా 
దితిజుల శక్తితో - మృతుల జేసినట్టి - జిత ఫాలనేత్ర విభవా 
ద్యుతులను జల్లుమా - సుతులపైన నీవు - చ్యుతి కల్గకుండఁ బ్రభవా 

IIII UIUIII - UIUIII - UIUIII U 
మొదటి నాలుగు మాత్రల తఱువాత UIUIII గణములతో; ఇది సురనర్తకిని జ్ఞప్తికి తెస్తుంది. నేను ప్రతి పాదములో (1, 11) అక్షరాలకు అక్షరసామ్య యతి, UIUIII లకు ప్రాసయతిని ఉంచినాను. ఈ ప్రాసయతి అన్ని పాదములకు కాదు, ప్రతి పాదములో మారుతూ ఉంటుంది. 

అచలజ కంబుకంఠి జగ-దంబ కావు శర-ణంబుఁ గోరితిమి రా 
సుచరిత ప్రేమరూపిణివి - సోమసుందరుని - భామ కాన మము రా 
అచలము నీదు కారుణము - హ్లాద మీయఁగను - బాధఁ దీర్చగను రా 
విచయము చాలు నింక శుభ - వేళ వచ్చెఁ గద - మేలుఁ గూర్చు లలితా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navarAtri - 8 - adritanayA - 

adritanayA lEka aSvalalita (lalita) oka suMdaramaina vRttamu. deenini ennO vidhamulugA vrAyavachchunu. deenilO koddigA chaMpakamAla naDaka unnadi. idi oka purAtanamaina vRttamE, bhaTTikAvyamulO nupayOgiMchabaDinadi. vRttamulalOni gaNamulanu amarikanu pariSIlistE, bhinnamaina gatulu manaku gOcharistAyi. tALavRttamula nirmANamunaku iTTi pariSIlana atyavasaramu.  ivannI pADa daginavE. 

aSvalalitA lEka adritanayA - na/ja/bha/ja/bha/ja/bha/laga 
23 vikRti 3861424

#IIII UIU III - UIU III UIU IIIU# chaMpakamAlavale yati

dina moka padmamAlikanu - dEvi pAdamula@M dRpti nittu bagitin  
vanamuna@M jaMpakammulanu - vartulAkRti naparNa kittu ramaNan 
gaNapati kArtikEyulaku@M - gAmadhEnuvagu kAminin garuNakai 
manamuna goltu nellapuDu - manmathArisati mAta nadritanayan 
(20 akTObar 2017) 

#IIII UIUI - IIUI UIII - UIU IIIU# padi mAtrala vi~ruputO 

tapamulatODa nadri-tanayA mahESvaruni - dArayaitivigadA 
yaparimitammugAnu - harusammu niMpumama - hAriNI harasatI 
kRpa niTa@M jUpu kAMti - kiraNALi@M jallumama - gEla nichchi tvaragA 
nepuDunu nannu gAvu - milapaina@M dIrchumama - yIpsitammula sadA 
(9 akTObar 2016) 

tapamunu jEse nAme - tagu nishThatO Sivuni - dhyAnamaM diDuchu bal 
japamula@M jEse nAme - jagadEkaraxakuni - svAMtamaM dunuchuchun 
Sapathamu sEse nAme - sarasEMduSEkharuni - svAmigA@M dala@Mchuchun 
kRpa@M ganu SaMkaruMDu - kelavuMchi navvi konu - gEla nadritanayan 
(6 jUlai 2016)

#IIII UIU - III UI UI - IIUI UIIIU# tommidi mAtrala vi~ruputO prAsayatitO 

atulita dIptitO - matini velganimmu - gati nIve mAku himajA 
natulanu bhaktitO - Srutula kiMpugAnu - brati gIti nittu magajA 
ditijula SaktitO - mRtula jEsinaTTi - jita phAlanEtra vibhavA 
dyutulanu jallumA - sutulapaina nIvu - chyuti kalgakuMDa@M brabhavA 

#IIII UIUIII - UIUIII - UIUIII U# 
modaTi nAlugu mAtrala ta~ruvAta #UIUIII# gaNamulatO; idi suranartakini j~naptiki testuMdi. nEnu prati pAdamulO (1, 11) axarAlaku axarasAmya yati, #UIUIII# laku prAsayatini uMchinAnu. ee prAsayati anni pAdamulaku kAdu, prati pAdamulO mArutU uMTuMdi. 

achalaja kaMbukaMThi jaga-daMba kAvu Sara-NaMbu@M gOritimi rA 
sucharita prEmarUpiNivi - sOmasuMdaruni - bhAma kAna mamu rA 
achalamu nIdu kAruNamu - hlAda mIya@Mganu - bAdha@M dIrchaganu rA 
vichayamu chAlu niMka Subha - vELa vachche@M gada - mElu@M gUrchu lalitA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: