[racchabanda] ఏణాంశ #ENAMSa)

 

ఏణాంశ - 

ఆధారము - కల్పితము 
నడక - మిశ్రగతి, అష్టమాత్రాగతి 

త/ర/ర/య/జ/త/గ  UUI UI UUI UI UUI UI UUIU 
19 అతిధృతి 152213 

ఏమందు నిన్ను జెప్పంగజాల - నీసంధ్యవేళ యోనాచెలీ 
ప్రేమమ్ముతోడ నామానసమ్ము - వేగమ్ము పిల్చె నోనాసకీ 
వ్యోమమ్ములోన నెఱ్ఱంగ రంగు - లొల్కంగఁ జొచ్చె రమ్యమ్ములై  
శ్యామమ్ము వచ్చుఁ దారల్ జనించు - సంద్రమ్ములోని ముత్యమ్ములై

దూరమ్ములోని తారాగణమ్ము - తోఁచెన్ విభిన్న చిత్రమ్ములై 
హారమ్మువోలె హంసమ్మువోలె - హర్షమ్ము నిచ్చు నేత్రమ్ములై 
యీరాత్రిలోన హేమంతమందు - నేణాంశుబింబ భాసమ్ములో 
నీరూపమందు నందమ్ముఁ గంటి - స్నిగ్ధమ్ముగాను హాసమ్ములో 

ప్రాసయతితో - 

శ్రీరాముఁ బత్ని - యారావణేశుఁ - గారాగృహమ్ము నందుండఁగా 
వారాశి దాఁటి - వీరుండు వచ్చి - పోరున్ జయమ్ము వొందన్ బతిన్ 
జేరున్ దనంచుఁ - బేరిన్ జపించు - వేఱొండు దారి లేకుండఁగా 
దూరమ్మునందు - నారాఘవుండు - యిరామ నెంచె దుఃఖమ్ముతో 

ఆలోలమయ్యె - నాడెందమిందు - కాలమ్ము పారె స్రోతమ్ముగాఁ 
బూలన్ గ్రహించి - మాలల్ రచింతు - నాలస్య మేలకో కామినీ 
లాలించ రమ్ము - పాలించ రమ్ము - తేలించ రమ్ము హిందోళమై 
నీలాల నింగి - నాలక్ష్మి యన్న - మేలమ్ములాడఁ బిల్చెన్ జెలీ 
(ల-డలకు ప్రాస చెల్లుతుంది) 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ENAMSa - 

aadhAramu - kalpitamu 
naDaka - miSragati, ashTamAtrAgati 

ta/ra/ra/ya/ja/ta/ga  #UUI UI UUI UI UUI UI UUIU# 
19 atidhRti 152213 

EmaMdu ninnu jeppaMgajAla - nIsaMdhyavELa yOnAchelI 
prEmammutODa nAmAnasammu - vEgammu pilche nOnAsakI 
vyOmammulOna ne~r~raMga raMgu - lolkaMga@M jochche ramyammulai  
SyAmammu vachchu@M dAral janiMchu - saMdrammulOni mutyammulai

dUrammulOni tArAgaNammu - tO@Mchen vibhinna chitrammulai 
hArammuvOle haMsammuvOle - harshammu nichchu nEtrammulai 
yIrAtrilOna hEmaMtamaMdu - nENAMSubiMba bhAsammulO 
nIrUpamaMdu naMdammu@M gaMTi - snigdhammugAnu hAsammulO 

prAsayatitO - 

SrIrAmu@M batni - yArAvaNESu@M - gArAgRhammu naMduMDa@MgA 
vArASi dA@MTi - vIruMDu vachchi - pOrun jayammu voMdan batin 
jErun danaMchu@M - bErin japiMchu - vE~roMDu dAri lEkuMDa@MgA 
dUrammunaMdu - nArAghavuMDu - yirAma neMche du@hkhammutO 

aalOlamayye - nADeMdamiMdu - kAlammu pAre srOtammugA@M 
bUlan grahiMchi - mAlal rachiMtu - nAlasya mElakO kAminI 
lAliMcha rammu - pAliMcha rammu - tEliMcha rammu hiMdOLamai 
nIlAla niMgi - nAlaxmi yanna - mElammulADa@M bilchen jelI 
(la-Dalaku prAsa chellutuMdi) 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: