[racchabanda] ఇందుముఖీ #iMdumukhI#

 

ఇందుముఖీ - 

ఆధారము - కల్పితము 
నడక - ఆఱుమాత్రలు లేక నాలుగు మాత్రలు
ఇది రూపక తాళమునకు, ఆది తాళమునకు సరిపోతుంది. అంతే కాదు. ఇందులో సంగీత పరముగా ప్రతి పాదములో ఒక మ-గణము కూడ ఉన్నది (మూడు గురువులు, ఒక గురువుకు ఎనిమిది మాత్రలు చతురస్రగతిలో). 

ఈ వృత్తమును క్లుప్తముగా వేఱు ఉదాహరణములతో Feb 21, 2007 ప్రస్తావించినాను. 

ఇందుముఖీ - భ/త/య/స/భ/గ 
16 అష్టి 26215 

UIIU UIIU - UIIU UIIU విఱుపుతో - అక్షరసామ్య యతి 

సుందరమౌ వెన్నెలలో - సొంపిడు నాకాశములో 
వందలుగా తారక లా-హ్వానమిడెన్ నా మదిలో 
ఇందుముఖీ రమ్ము సఖీ - యెప్పుడు నీ ధ్యానములే 
ముందుగ రా నన్ను గనన్ - మోహన మా రాగములే

ప్రాసయతి - 

మందముగా మారుత మా-నందములన్ దూరమిడన్ 
గుందిలు నా రేతిరిలో - డెందములో నేడుపుతో 
నిందుకళన్ నిందలిడున్ - జందనమున్ జీ యనుచున్ 
సుందరునిన్ జూడఁగఁ దాఁ - బందిరిలో నుండుఁ గదా 

UII UU IIU - UII UU IIU విఱుపుతో -

శారద వేళన్ గనుమా - చక్కని చంద్రుం డలరెన్ 
హారము తారా గణముల్ - హ్లాదము లీయన్ జెలఁగెన్ 
నేరము నీవుం డటులన్ - నెమ్మిగ రా నా యెదుటన్ 
సారస నేత్రీ చలిలో - జాబిలి నీడల్ నుదుటన్ 

UII UU - IIU UII - UU IIU విఱుపుతో - 

పౌర్ణమి నేఁడే - వరమై వెల్గెను - భావద్యుతితో 
వర్ణము లెన్నో - వలపుల్ దొడిగెన్ - వైనమ్ములతో 
కర్ణములందున్ - గమనీయముగా - గానస్వరముల్ 
నిర్ణయ మేమో - నెనరుంచఁగ రా - నీవే వరముల్ 
(ఇక్కడ మ-గణ స్వరూపమును గమనించ వీలగును) 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
iMdumukhI - 

aadhAramu - kalpitamu 
naDaka - aa~rumAtralu lEka nAlugu mAtralu
idi rUpaka tALamunaku, aadi tALamunaku saripOtuMdi. aMtE kAdu. iMdulO saMgIta paramugA prati pAdamulO oka ma-gaNamu kUDa unnadi (mUDu guruvulu, oka guruvuku enimidi mAtralu chaturasragatilO). 

ee vRttamunu kluptamugA vE~ru udAharaNamulatO #Feb 21, 2007# prastAviMchinanu. 

iMdumukhI - bha/ta/ya/sa/bha/ga 
16 ashTi 26215 

#UIIU UIIU - UIIU UIIU# vi~ruputO - axarasAmya yati 

suMdaramau vennelalO - soMpiDu nAkASamulO 
vaMdalugA tAraka lA-hvAnamiDen nA madilO 
iMdumukhI rammu sakhI - yeppuDu nI dhyAnamulE 
muMduga rA nannu ganan - mOhana mA rAgamulE

prAsayati - 

maMdamugA mAruta mA-naMdamulan dUramiDan 
guMdilu nA rEtirilO - DeMdamulO nEDuputO 
niMdukaLan niMdaliDun - jaMdanamun jI yanuchun 
suMdarunin jUDa@Mga@M dA@M - baMdirilO nuMDu@M gadA 

#UII UU IIU - UII UU IIU# vi~ruputO -

SArada vELan ganumA - chakkani chaMdruM Dalaren 
hAramu tArA gaNamul - hlAdamu lIyan jela@Mgen 
nEramu nIvuM DaTulan - nemmiga rA nA yeduTan 
sArasa nEtrI chalilO - jAbili nIDal nuduTan 

#UII UU - IIU UII - UU IIU# vi~ruputO - 

paurNami nE@MDE - varamai velgenu - bhAvadyutitO 
varNamu lennO - valapul doDigen - vainammulatO 
karNamulaMdun - gamanIyamugA - gAnasvaramul 
nirNaya mEmO - nenaruMcha@Mga rA - nIvE varamul 
(ikkaDa ma-gaNa svarUpamunu gamaniMcha vIlagunu) 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: