[racchabanda] కామపుష్ప #kAmapushpa#

 

కామపుష్ప - 

ఆధారము - కల్పితము 
నడక - మిశ్రగతి (5,3 లేక 3,5 మాత్రలు), అష్టమాత్రలు

కామపుష్ప - త/ర/య/జ/త/ర/గ UIUUI - UIUUI - UIUUI - UIUU 
19 అతిధృతి 84563 

నామనమ్మందు శిల్పమై వెల్గి - నవ్వులన్ జిందు నాదరూపా 
వ్యోమమం దుండు తారకా శ్రేణి - పూల రాజిల్లు మాలలేమో 
ప్రేమతో నిన్ను బిల్వఁగా రావు - ప్రేమ లేదన్న మాటయేనా 
రామ నాముందు మోము రాజిల్ల - రమ్ము నాసామి రంగరంగా 

నీవు లేకుండ నేను లేనిందు - నెమ్మిఁ జూపంగ వేగ రావా 
ఈవసంతమ్ము కామ పుష్పమ్ము - లెందు జూడంగ నాకు నీకై 
భావ దీపమ్ము వెల్గ గీతమ్ము - పాడుదా మిప్డు కూడ నీతో 
దేవు నంశమ్మె ప్రేమ రూపమ్ము - దివ్య కావ్యమ్ము వ్రాయ రావా 

ప్రాసయతితో షట్పదిగా - 

దారియే లేదు - దూరమందుండు - నూరిఁ నేనెట్లు - నొంటనౌనో 
భారమీ మన్కి - ఘోర మీరాత్రి - తారలే లేవు - ధాత్రి సోలెన్ 
రార చూపంగ - వేఱు మార్గమ్ముఁ - గోరుచుంటిన్ జ-కోరమై నేన్ 
తూరుపం దెప్డు - నీరజాప్తుండు - తేరుపై వచ్చు - దీప్తితోడ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kAmapushpa - 

aadhAramu - kalpitamu 
naDaka - miSragati (5,3 lEka 3,5 mAtralu), ashTamAtralu

kAmapushpa - ta/ra/ya/ja/ta/ra/ga #UIUUI - UIUUI - UIUUI - UIUU
19 atidhRti 84563 

nAmanammaMdu Silpamai velgi - navvulan jiMdu nAdarUpA 
vyOmamaM duMDu tArakA SrENi - pUla rAjillu mAlalEmO 
prEmatO ninnu bilva@MgA rAvu - prEma lEdanna mATayEnA 
rAma nAmuMdu mOmu rAjilla - rammu nAsAmi raMgaraMgA 

nIvu lEkuMDa nEnu lEniMdu - nemmi@M jUpaMga vEga rAvA 
eevasaMtammu kAma pushpammu - leMdu jUDaMga nAku nIkai 
bhAva dIpammu velga gItammu - pADudA mipDu kUDa nItO 
dEvu naMSamme prEma rUpammu - divya kAvyammu vrAya rAvA 

prAsayatitO shaTpadigA - 

dAriyE lEdu - dUramaMduMDu - nUri@M nEneTlu - noMTanaunO 
bhAramI man&ki - ghOra mIrAtri - tAralE lEvu - dhAtri sOlen 
rAra chUpaMga - vE~ru mArgammu@M - gOruchuMTin ja-kOramai nEn 
tUrupaM depDu - nIrajAptuMDu - tErupai vachchu - dIptitODa 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: