[racchabanda] పాదాకులకము #pAdAkulakamu#

 

పాదాకులకము - 

లహు గురు ఏక్క ణి్అమ ణాహి జేహా 
పఅ పఅ లేక్ఖఉ ఉత్తమరేహా 
సుకఇ ఫణిందహ కంఠహ వలఅం 
సోలహమత్తం పాఆకులఅం - ప్రాకృతపైంగలము, 1-129

లఘుగురు నియమములు పాదములో లేవు, పాదములలో ఉత్తమముగా ఉండేటట్లు మాత్రలను వాడవలెను. అది సుకవి ఫణీంద్రుని (పింగళ నాగుని) కంఠములో హారము వలె నుంటుంది. 16 మాత్రలతో పాదాకులక ఛందము నిర్మితము. 

తెలుగులో తొమ్మిదవ మాత్రతో అక్షరసామ్య యతి, ప్రాస ఉండాలి. అంత్యప్రాస తప్పని సరి. 

పాదాకులకము - 16 మాత్రలు

ఆనన మ్మొక్క - యరవిందమ్మా 
మేని వర్ణ మది - మేఘపు సొమ్మా 
వేణువాదనము - ప్రేమరాగమా 
నీనవ్వులు నా - నెనరు యోగమా 

అశాంతి నిండిన - యవనికి రోదన
బ్రశాంతికొఱకై - ప్రజలకు వేదన 
నిశీథ కాలపు - నిద్ర లేమితో 
దృశించునో యిది - తెలుపు స్వామితో 

కాలము మారెను - కలలే యాసలు 
గాలిలోఁ జేరె - గమ్మున బాసలు 
మేలిమి యెక్కడ - మృణ్మయమందున 
లీలలు వానివి - లేమియు పొందున 

మనసు పిలిచె నిను - మఱచినావొకో 
వినఁగరావు సక - విసిగినావొకో 
దినము రాత్రి నీ - దివ్య నామమే 
వనజనయన నీ-వనఁగఁ బ్రేమమే 

వెన్నెలలో నీ - వేణువు గానము 
కన్నెలతో నా - గంగా స్నానము 
వన్నెలుగా నీ - వాక్చాతుర్యము 
లెన్నని చెప్పుట - హృదిలో ధైర్యము

హలాహలా యన - హాయిగ నక్కడ 
చెలీ చెలీ యని - చిక్కితి నిక్కడ 
వలపు కౌగిలుల - వాలఁగ రావే 
తెలుపో నలుపో - తేల్చుము నీవే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
pAdAkulakamu - 

lahu guru Ekka Ni^ama NAhi jEhA 
pa&a pa&a lEkkha&u uttamarEhA 
suka&i phaNiMdaha kaMThaha vala&aM 
sOlahamattaM pAAkula&aM - prAkRtapaiMgalamu, 1-129

laghuguru niyamamulu pAdamulO lEvu, pAdamulalO uttamamugA uMDETaTlu mAtralanu vADavalenu. adi sukavi phaNIMdruni (piMgaLa nAguni) kaMThamulO hAramu vale nuMTuMdi. 16 mAtralatO pAdaakulaka ChaMdamu nirmitamu. 

telugulO tommidava mAtratO axarasAmya yati, prAsa uMDAli. aMtyaprAsa tappani sari. 

pAdAkulakamu - 16 mAtralu

aanana mmokka - yaraviMdammA 
mEni varNa madi - mEghapu sommA 
vENuvAdanamu - prEmarAgamA 
nInavvulu nA - nenaru yOgamA 

aSAMti niMDina - yavaniki rOdana
braSAMtiko~rakai - prajalaku vEdana 
niSItha kAlapu - nidra lEmitO 
dRSiMchunO yidi - telupu svAmitO 

kAlamu mArenu - kalalE yAsalu 
gAlilO@M jEre - gammuna bAsalu 
mElimi yekkaDa - mRNmayamaMduna 
lIlalu vAnivi - lEmiyu poMduna 

manasu piliche ninu - ma~rachinAvokO 
vina@MgarAvu saka - visiginAvokO 
dinamu rAtri nI - divya naamamE 
vanajanayana nI-vana@Mga@M brEmamE 

vennelalO nI - vENuvu gAnamu 
kannelatO nA - gaMgA snAnamu 
vannelugA nI - vAkchAturyamu 
lennani cheppuTa - hRdilO dhairyamu

halAhalA yana - hAyiga nakkaDa 
chelI chelI yani - chikkiti nikkaDa 
valapu kaugilula - vAla@Mga rAvE 
telupO nalupO - tElchumu nIvE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: