[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 22 #SlOkAlalO kotta lOkAlu - 22#

 

శ్లోకాలలో కొత్త లోకాలు - 22 
అనుసరణలు - అనుకరణలు 

జలదమ్ముల జలముల్ 
జలధిం జేరు నట్టులే 
యిల దేవులకు నతుల్ 
గడకుం జేరుఁ గేశవున్ 
(చపలా భేదము)

ఇప్పు డొసంగుము ప్రభూ 
పప్పన్నమ్మును నెయ్యితోఁ 
గప్పురంపు ధవళిమన్ 
దొప్పలో దధితోడుతన్ 
(చపలా భేదము)

సందేహ మెందుకో తండ్రీ 
యిందందుఁ గాన నుండుఁగా 
నెందు వెదుక నందుండు
నిందీవరాక్షుఁ డాతఁడున్ 

అమ్మా నీ పుత్ర రత్నమ్ము 
గమ్మఁగా మెక్కు క్షీరమున్ 
వమ్ము మేమిందు నుండంగా 
నిమ్ము వీడెద మిప్పుడే 

వసుదేవ తనూజా స-
త్ప్రసూతి హృదయోల్లసా 
శ్వశురాంతక మల్లారీ 
యసితాంగా నమస్కృతుల్ 

మాతంగతనయా జోతల్ 
మాతా గానలోలినీ 
చేతిలోఁ జిల్కతోఁ గేళిన్ 
బ్రీతి సల్పెడు శ్యామలా 
 
గిరిజాస్యారవిందార్కా 
కరిచుబ్రా దలంతు నిన్ 
వరా యనేకదా భక్తిన్ 
స్మరింతు నేకదంత నిన్ 

విధేయుడు - మోహన 
#
SlOkAlalO kotta lOkAlu - 22 
anusaraNalu - anukaraNalu 

jaladammula jalamul 
jaladhiM jEru naTTulE 
yila dEvulaku natul 
gaDakuM jEru@M gESavun 
(chapalA bhEdamu)

ippu DosaMgumu prabhU 
pappannammunu neyyitO@M 
gappuraMpu dhavaLiman 
doppalO dadhitODutan 
(chapalA bhEdamu)

saMdEha meMdukO taMDrI 
yiMdaMdu@M gAna nuMDu@MgA 
neMdu veduka naMduMDu
niMdIvarAxu@M DAta@MDun 

ammA nI putra ratnammu 
gamma@MgA mekku xIramun 
vammu mEmiMdu nuMDaMgA 
nimmu vIDeda mippuDE 

vasudEva tanUjA sa-
tprasUti hRdayOllasA 
SvaSurAMtaka mallArI 
yasitAMgA namaskRtul 

mAtaMgatanayA jOtal 
mAtA gAnalOlinI 
chEtilO@M jilkatO@M gELin 
brIti salpeDu SyAmalA 
 
girijAsyAraviMdArkA 
karichubrA dalaMtu nin 
varA yanEkadA bhaktin 
smariMtu nEkadaMta nin 

vidhEyuDu - mOhana 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: