[racchabanda] అష్టపది - 34 - మాలావృత్తములతో అష్టపది #ashTapadi - 34 - mAlAvRttamulatO ashTapadi#

 

అష్టపది - 34 - మాలావృత్తములతో అష్టపది - 

చంపకమాలకు చందన చర్చిత పాటకు ఏమి సంబంధము అని అడగవచ్చును. సంబంధము ఉన్నది. శ్రీజయదేవుడు రెండు చతురస్రగతిలోని అష్టపదులలో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్రాను వాడినాడు. అవి - 

మదన మహీపతి "కనకదండరుచి" కేసర కుసుమ వికాసే - 3.4
"బంధుజీవ మధు"రాధర పల్లవకలిత దరస్మిత శోభం - 5.3

చంపకోత్పలమాలల లఘుగురువుల అమరికలను గమనిస్తే అవి ఈ విధముగా ఉన్నాయి - 4/8/4/4/8 మాత్రలు. మొత్తము 28 మాత్రలు పాదమునకు గీతగోవిందమునందలి చతురస్రగతి అష్టపదులవలె, ఉదా. చందన చర్చిత, ధీరసమీరే, ఇత్యాదులు. కావున రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్రను ఉపయోగించ వీలగును. అట్లు వ్రాసిన అష్టపదియే క్రిందిది. ఇందులో రెండు ఉత్పలమాలలు, రెండు చంపకమాలలు ఉన్నాయి. వీటికి మాలావృత్తములవలె యతిప్రాసలు కూడ ఉన్నాయి. అంతే కాక రెండేసి పాదాలకు అంత్యప్రాస కూడ గలదు. పదముల విఱుపు చాల ముఖ్యము.  ఒక కొత్త ప్రయోగము. ఇంతవఱకు ఎవ్వరు చేయలేదు. 

అనయము నిన్నె తల్తుఁగద యందము చిందెడు లోకబాంధవా 
మనమను మందిరమ్మునను మంత్రజపమ్ములు నీకె మాధవా 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - ధ్రువము (1) 

తనువిది నీవు స్పర్శ గొనఁ దాపము చెందెను జింత నుండెరా
ఘనమగు వర్షధారవలెఁ గామముఁ దీర్చఁగఁ జెంత నుండరా 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - (2)

పల్లవిఁ బాడఁగా మనసు పల్కుసుమమ్ములఁ బల్లవించుఁగా 
వల్లకి మీఁటఁగాఁ జెవులు స్వానమునందున మున్గి లేచుఁగా 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - (3) 

తెల్లని కాంతిలోఁ గనులు దృశ్యము లన్నిటి జ్ఞప్తి నుంచుఁగా 
మల్లెల మంచి గంధమును మత్తున నాసిక మెల్లఁ బీల్చుఁగా 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - (4) 

తెలియని వేదమా పలుకు దేవెరి వాక్కులొ తేనెముంతలో 
వెలుఁగిడు దీపమా మెఱయు ప్రేమపు రూపమొ పాలపుంతలో 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - (5) 

చెలువపు శృంగమా చెలిమి చిత్రపు రంగులొ యూఁగు డోలలో 
అలరుల మాలలా కలల హర్షపు పొంగులొ రేగు జ్వాలలో 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - (6) 

చంపకు నీవు నన్నిపుడు చంపక మాలల సౌరు దీప్తితో 
నొంపగు శ్వేతవర్ణముల యుత్పల మాలల చారు భాతితో 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - (7) 

రంపిక వద్దురా రమణ రమ్మిఁక పున్నమి రాత్రివేళలో 
ముంపునఁ దూలి తేలెదను మోహన రాగపు రాస హేలలో 
ప్రణయపు వెల్గులో మిడుతరా 
ప్రణవమ్మది నీదు నామమే - (8) 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ashTapadi - 34 - mAlAvRttamulatO ashTapadi - 

chaMpakamAlaku chaMdana charchita pATaku Emi saMbaMdhamu ani aDagavachchunu. saMbaMdhamu unnadi. SrIjayadEvuDu reMDu chaturasragatilOni ashTapadulalO reMDu chaturmAtralaku badulu oka ashTamAtrAnu vADinADu. avi - 

madana mahIpati "kanakadaMDaruchi" kEsara kusuma vikAsE - 3.4
"baMdhujIva madhu"rAdhara pallavakalita darasmita SObhaM - 5.3

chaMpakOtpalamAlala laghuguruvula amarikalanu gamanistE avi ee vidhamugA unnAyi - 4/8/4/4/8 mAtralu. mottamu 28 mAtralu pAdamunaku gItagOviMdamunaMdali chaturasragati ashTapadulavale, udA. chaMdana charchita, dhIrasamIrE, ityAdulu. kAvuna reMDu chaturmAtralaku badulu oka ashTamAtranu upayOgiMcha vIlagunu. aTlu vrAsina ashTapadiyE kriMdidi. iMdulO reMDu utpalamAlalu, reMDu chaMpakamAlalu unnAyi. vITiki mAlAvRttamulavale yatiprAsalu kUDa unnAyi. aMtE kAka reMDEsi pAdAlaku aMtyaprAsa kUDa galadu. padamula vi~rupu chAla mukhyamu. idi oka kotta prayOgamu. iMtava~raku evvaru chEyalEdu. 

anayamu ninne taltu@Mgada yaMdamu chiMdeDu lOkabAMdhavA 
manamanu maMdirammunanu maMtrajapammulu nIke mAdhavA 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - dhruvamu (1) 

tanuvidi nIvu sparSa gona@M dApamu cheMdenu jiMta nuMDerA
ghanamagu varshadhAravale@M gAmamu@M dIrcha@Mga@M jeMta nuMDarA 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - (2)

pallavi@M bADa@MgA manasu palkusumammula@M ballaviMchu@MgA 
vallaki mI@MTa@MgA@M jevulu svAnamunaMduna mun&gi lEchu@MgA 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - (3) 

tellani kAMtilO@M ganulu dRSyamu lanniTi j~napti nuMchu@MgA 
mallela maMchi gaMdhamunu mattuna nAsika mella@M bIlchu@MgA 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - (4) 

teliyani vaedamA paluku dEveri vaakkulo tEnemuMtalO 
velu@MgiDu dIpamA me~rayu prEmapu rUpamo pAlapuMtalO 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - (5) 

cheluvapu SRMgamA chelimi chitrapu raMgulo yU@Mgu DOlalO 
alarula mAlalA kalala harshapu poMgulo rEgu jvAlalO 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - (6) 

chaMpaku nIvu nannipuDu chaMpaka mAlala sauru dIptitO 
noMpagu SvEtavarNamula yutpala mAlala chAru bhAtitO 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - (7) 

raMpika vaddurA ramaNa rammi@Mka punnami rAtrivELalO 
muMpuna@M dUli tEledanu mOhana rAgapu rAsa hElalO 
praNayapu velgulO miDutarA 
praNavammadi nIdu nAmamE - (8) 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: