[racchabanda] లఘు వృత్తము కన్యా #laghu vRttamu kanyA#

 

లఘు వృత్తము కన్యా - 

ఇది ప్రతిష్ఠ ఛందములోని మొదటి వృత్తము, పాదమునకు నాలుగు గురువులు. పేరేమో కన్యా, కాని గణములేమో మగ! క్రింద నా ఉదాహరణములు - 

కన్యా (గీతి, తీర్ణా) - మ/గ UUUU 
4 ప్రతిష్ఠ 1

సీతారామా 
చేతుల్ మోడ్తున్ 
గీతుల్ నీకే  
ప్రీతిన్ గొల్తున్

తల్లీ దేవీ 
యుల్లంబందున్ 
ద్రుళ్లంగా శో- 
బిల్లంగా రా 

రాధాకృష్ణా 
నాదబ్రహ్మా 
ఆధారమ్మై 
మోదమ్మీరా 

ప్రేమమ్మందున్ 
శ్రీమంతుండున్ 
సామాన్యుండున్ 
భామాదాసుల్ 

మాన్యుండన్ స-
త్కన్యారత్నా 
ధన్యుండన్ నే 
నన్యుండేనా 

శ్రీదేవా రా 
రాదా నీవే 
కాదా జీవ
మ్మే దీనన్ నేన్  

చివరి ఉదాహరణము వజ్రబంధమునకు సరిపోతుంది. అది యెట్లన్న - 

శ్రీ
దేవా 
రారాదా 
నీవే కాదా 
జీవమ్మే 
దీనన్ 
నేన్  

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
laghu vRttamu kanyA - 

idi pratiShTha ChaMdamulOni modaTi vRttamu, pAdamunaku nAlugu guruvulu. pErEmO kanyA, kAni gaNamulEmO maga! kriMda nA udAharaNamulu - 

kanyA (gIti, tIrNA) - ma/ga #UUUU# 
4 pratishTha 1

sItArAmA 
chEtul mODtun 
gItul nIkE  
prItin goltun

tallI dEvI 
yullaMbaMdun 
druLlaMgA SO- 
billaMgA rA 

rAdhAkRshNA 
nAdabrahmA 
aadhArammai 
mOdammIrA 

prEmammaMdun 
SrImaMtuMDun 
sAmAnyuMDun 
bhAmAdAsul 

mAnyuMDan sa-
tkanyAratnA 
dhanyuMDan nE 
nanyuMDEnA 

SrIdEvA rA 
rAdA nIvE 
kAdA jIva
mmE dInan nEn  

chivari udAharaNamu vajrabaMdhamunaku saripOtuMdi. adi yeTlanna - 

SrI
dEvA 
rArAdA 
nIvE kAdA 
jIvammE 
dInan 
nEn  

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: