[racchabanda] మంజరీద్విపదతో "విషమ" సీసము #maMjarIdvipadatO "vishama" sIsamu#

 

మంజరీద్విపదతో "విషమ" సీసము  - 

చూడుమా చంద్రుని - సుందరమ్ముగను 
నింగిలో వెలిఁగెను - నిండారి యిపుడు 
పాల వెన్నెలలోనఁ - బలు పూల తావి 
తేలె నీగాలిలో - దిక్కు దిక్కులకు 
మందమై పవనమ్ము - మధురమై వీచె 
కలరావ మొక్కటి - కలవోలె లేచెఁ 
బరువిడెన్ భావముల్ - వర కవిత్వముగ 
నది యయ్యె నదియు - నవరాగభరిత 

తే. మగుచు ముదమున నయ్యది యాత్మ నింపె 
ప్రణయ పదముల సుస్వర పంక్తితోడ 
నాలపించెడు వేళ యాహా యనంగ 
భామినీ మనకింక భావాబ్ధి మున్క 

ఇందులో విశేషాలు - తరువోజలో ఆద్యక్షరముతో అన్ని యతులు. కాని ఇక్కడ అర్ధ పాదాలకు సీసపు అర్ధ పాదములవలె యతి. అంతే కాక (ద్విపదలోవలె) మంజరికి ప్రాస లేదు. సీసములో కూడ అర్ధ పాదములకు ప్రాస ఐచ్ఛికమే, నియతము కాదు. తేటగీతి అమరికను గమనించండి. అది ద్విపద పాదమునకు కూడ సరిపోతుంది. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
maMjarIdvipadatO "vishama" sIsamu  - 

chUDumA chaMdruni - suMdarammuganu 
niMgilO veli@Mgenu - niMDaari yipuDu 
pAla vennelalOna@M - balu pUla tAvi 
tEle nIgAlilO - dikku dikkulaku 
maMdamai pavanammu - madhuramai vIche 
kalarAva mokkaTi - kalavOle lEche@M 
baruviDen bhAvamul - vara kavitvamuga 
nadi yayye nadiyu - navarAgabharita 

tE. maguchu mudamuna nayyadi yAtma niMpe 
praNaya padamula susvara paMktitODa 
nAlapiMcheDu vELa yAhA yanaMga 
bhAminI manakiMka bhAvAbdhi mun&ka 

iMdulO viSEshAlu - taruvOjalO aadyaxaramutO anni yatulu. kAni ikkaDa ardha pAdAlaku sIsapu ardha pAdamulavale yati. aMtE kAka (dvipadalOvale) maMjariki praasa lEdu. sIsamulO kUDa ardha pAdamulaku prAsa aichChikamE, niyatamu kAdu. tETagIti amarikanu gamaniMchaMDi. adi dvipada pAdamunaku kUDa saripOtuMdi. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: