[racchabanda] నాదబిందువు - గతి గర్భ కవిత్వము #nAdabiMduvu - gati garbha kavitvamu#

 

నాదబిందువు - గతి గర్భ కవిత్వము - 

ఆధారము - కల్పితము
నడక - మిశ్రగతిలో మత్తకోకిలవలె, త్ర్యస్రగతిలో ఉత్సాహమువలె (ఉత్సాహముకన్న ఒక సూర్యగణము ఎక్కువ)

నాదబిందువు - ర/న/న/జ/న/న/ర 
21 ప్రకృతి 785403 

మిశ్రగతి - UI UII III IIU - III IIII UIU విఱుపుతో - 

మోద మీయుము పులక లిడ నీ - పువుల తనువుకు యోగమే 
నాద బిందువు లలలవలె నా - నదిగఁ బరువిడు వేగమే 
నాది నీయది నిజము సకియా - నవము బ్రదుకగు నందమై 
నీది నాయది నిరత మిలపై - నెనరు కలుపఁగ బంధమై 

మానసమ్మొక పసిమి గుడియే - మమత నొసఁగును దైవమే 
గాన వారిధి స్వరపు మణులే - గతులఁ జెలువపు భావమే 
ప్రాణమందునఁ దలఁపు లతఁడే - బగితి మనమున రాగమై 
నేను బుష్పము చరణములపై - నెనరు నతనికి భాగమై 

త్ర్యస్రగతి - UI UI III III - UI III III UIU విఱుపుతో -

మోద మిమ్ము పులక లిడఁగఁ - బూల తనువు కిపుడు యోగమే 
నాద బిందు వలలఁ జెలఁగ - నవ్వు టలలు పరువు వేగమే 
నాది నీది నిజము సకియ - నవ్య మగును బ్రదుకు నందమై 
నీది నాది నిరత మిలను - నెమ్మి మనలఁ గలుపు బంధమై 

మానసమ్ము పసిమి గుడియె - మాల్మి మమత నొసఁగు దైవమే 
గాన వార్ధి స్వరపు మణులె - కాన గతుల లలిత భావమే 
ప్రాణమందుఁ దలఁపు లతఁడె - భక్తి మనము నలరు రాగమై 
నేను బువ్వు చరణములను - నెమ్మి నతని కగుదు భాగమై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు 
#
nAdabiMduvu - gati garbha kavitvamu - 

aadhAramu - kalpitamu
naDaka - miSragatilO mattakOkilavale, tryasragatilO utsAhamuvale (utsAhamukanna oka sUryagaNamu ekkuva)

nAdabiMduvu - ra/na/na/ja/na/na/ra 
21 prakRti 785403 

miSragati - #UI UII III IIU - III IIII UIU# vi~ruputO - 

mOda mIyumu pulaka liDa nI - puvula tanuvuku yOgamE 
nAda biMduvu lalalavale nA - nadiga@M baruviDu vEgamE 
nAdi nIyadi nijamu sakiyA - navamu bradukagu naMdamai 
nIdi nAyadi nirata milapai - nenaru kalupa@Mga baMdhamai 

mAnasammoka pasimi guDiyE - mamata nosa@Mgunu daivamE 
gAna vAridhi svarapu maNulE - gatula@M jeluvapu bhAvamE 
prANamaMduna@M dala@Mpu lata@MDE - bagiti manamuna rAgamai 
nEnu bushpamu charaNamulapai - nenaru nataniki bhAgamai 

tryasragati - #UI UI III III - UI III III UIU# vi~ruputO -

mOda mimmu pulaka liDa@Mga@M - bUla tanuvu kipuDu yOgamE 
nAda biMdu valala@M jela@Mga - navvu Talalu paruvu vEgamE 
nAdi nIdi nijamu sakiya - navya magunu braduku namdamai 
nIdi nAdi nirata milanu - nemmi manala@M galupu baMdhamai 

mAnasammu pasimi guDiye - mAlmi mamata nosa@Mgu daivamE 
gAna vArdhi svarapu maNule - kAna gatula lalita bhAvamE 
prANamaMdu@M dala@Mpu lata@MDe - bhakti manamu nalaru rAgamai 
nEnu buvvu charaNamulanu - nemmi natani kagudu bhAgamai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: