[racchabanda] శంబరము - తరువు పూత - "విషమ" సీసము #SaMbaramu - taruvu pU@Mta - "vishama" sIsamu#

 

శంబరము - తరువు పూత - "విషమ" సీసము - 

ద్రుతవిలంబిత వృత్తపు రెట్టింపు శంబర వృత్తము. 
ఆధారము - వాగ్వల్లభ

శంబరము - న/భ/భ/ర/న/భ/భ/ర 
24 సంకృతి 5993912 

అక్షరసామ్య యతితో - 

మదనమోహన చెంతకు రమ్మురా - మనసు వేగెను జేతులఁ గొమ్మురా 
వదలకుండని యాశలు సొమ్మురా - బ్రతుకు నీవిట నుండక వమ్మురా 
మధుర రాగపు వేణువు నూఁదరా - మదికిఁ దక్కిన వెల్లను జేఁదురా 
అదరు కన్నులు రాకకుఁ జూచెరా - అధరముల్ సుధఁ గోరుచు వేచెరా 

ప్రాస యతితో - 

వనమునందునఁ బువ్వులఁ జూడరా - దినమునందున వెల్గుల నీడరా 
మనము నాకిటఁ గోర్కెల కూటరా - మనసు చక్కని వన్నెల కోటరా 
అనిశ మచ్చట వెల్గుల బాటరా - ప్రణయ మచ్చట గానపు తేటరా 
స్వనము లెల్లను రాగపు చిందురా - సునయనా యిరుగన్నుల ముందు రా 

ఈ అమరికను ఆధారముగ నుంచుకొని, ఒక జాతి పద్యమును మనము కల్పించ వీలగును. దాని గణములు - సూ/ఇం/ఇం/ఇం - సూ/ఇం/ఇం/ఇం. ఇది తరువోజ, సీసము లాటిది. ఇందులో కూడ పాదమునకు 8 గణములు, ఆఱు ఇంద్ర, రెండు సూర్య గణములు. 

సీసములో - రెండు సూర్య గణములు చివర ఉంటాయి.
తరువోజలో - అవి అర్ధ పాదముల చివర ఉంటాయి. 
ఇందులో (దీనికి తరువు పూత అని పేరుంచినాను) - అవి అర్ధ పాదముల ఆరంభములో ఉంటాయి. 

నిదుర గనులను దాఁకక నున్నది - నిముస మొక్కటి యుగముగ నున్నది 
కదలి ప్రతి క్షణ మూఁగుచు నున్నది - కడలి యలవలెఁ బొంగుచు నున్నది 
మదియు వదలక తలచుచు నున్నది - మలయ పవనము వీచుచు నున్నది 
యిదియె మోహమో ప్రేమపు దాహమో - యిదియె జీవనతరువుకుఁ బూతయో 

నీదు ముఖచంద్ర బింబముఁ దాఁకక - నీరజాప్తుఁడు మఱుగయ్యె నీనాఁడు 
వేద మనినావె యానాఁడు ప్రేమను - భేద మెందుకు కల్గెను దృష్టిలో 
నీదు ప్రేమ దీపమ్మున శలభమై - నేను మాడఁగ నుంటిని జూడవా 
వేదనల చితిలోన దహన మేమొ - మోదమను జల్లు కురియునో కురియదో 

తరువోజలా యతులతో - 

తల్లి సీతమ్మ - తన చుట్టు నుండెడు - దైత్య వనితల - తప్పు మాటల విని 
యుల్లమందున - నురుతర దుఃఖమ్ము - నొందెఁ బతిదేవు - నూహించి మదిలోన 
మెల్లఁగా వినె - మృదువైన స్వరమొండు - మిగుల శాంతితో - "మేదినీనాథుండు 
చల్లఁగా నుండె - సైన్యమ్ముతో వచ్చు - సాగరము దాఁటి - స్వామినిన్ గాపాడు" 

ఈ తరువు పూత జాతి పద్యమును విషమ సీసము చేద్దామా? క్రింద 

తరువు పూత "విషమ" సీసము - 

తల్లి సీతమ్మ - తన చుట్టు నుండెడు - 
  దైత్య వనితల - తప్పు మాటల విని 
యుల్లమందున - నురుతర దుఃఖమ్ము - 
  నొందెఁ బతిదేవు - నూహించి మదిలోన 
మెల్లఁగా వినె - మృదువైన స్వరమొండు - 
  మిగుల శాంతితో - "మేదినీనాథుండు 
చల్లఁగా నుండె - సైన్యమ్ముతో వచ్చు - 
  సాగరము దాఁటి - స్వామినిన్ గాపాడు" 

తే. ననఁగ, నది విని తలబోసె - నామె యపుడు 
"నిదియు రాక్షస మాయయో - యేమొ యెఱుగ,"  
"వలదు వలదమ్మ సందేహ - మిలను నీకు 
రామదూతను నే, నంపె - రాముఁడు నను"

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
SaMbaramu - taruvu pU@Mta - "vishama" sIsamu - 

drutavilaMbita vRttapu reTTiMpu SaMbara vRttamu. 
aadhAramu - vAgvallabha

SaMbaramu - na/bha/bha/ra/na/bha/bha/ra 
24 saMkRti 5993912 

axarasAmya yatitO - 

madanamOhana cheMtaku rammurA - manasu vEgenu jEtula@M gommurA 
vadalakuMDani yASalu sommurA - bratuku nIviTa nuMDaka vammurA 
madhura rAgapu vENuvu nU@MdarA - madiki@M dakkina vellanu jE@MdurA 
adaru kannulu rAkaku@M jUcherA - adharamul sudha@M gOruchu vEcherA 

prAsa yatitO - 

vanamunaMduna@M buvvula@M jUDarA - dinamunaMduna velgula nIDarA 
manamu nAkiTa@M gOrkela kUTarA - manasu chakkani vannela kOTarA 
aniSa machchaTa velgula bATarA - praNaya machchaTa gAnapu tETarA 
svanamu lellanu rAgapu chiMdurA - sunayanA yirugannula muMdu rA 

ee amarikanu aadhAramuga nuMchukoni, oka jAti padyamunu manamu kalpiMcha vIlagunu. dAni gaNamulu - sU/iM/iM/iM - sU/iM/iM/iM. idi taruvoeja, sIsamu lATidi. iMdulO kUDa pAdamunaku 8 gaNamulu, aa~ru iMdra, reMDu sUrya gaNamulu. 

sIsamulO - reMDu sUrya gaNamulu chivara uMTAyi.
taruvOjalO - avi ardha pAdamula chivara uMTAyi. 
iMdulO (dIniki taruvu pU@Mta ani pEruMchinAnu) - avi ardha pAdamula aaraMbhamulO uMTAyi. 

nidura ganulanu dA@Mkaka nunnadi - nimusa mokkaTi yugamuga nunnadi 
kadali prati xaNa mU@Mguchu nunnadi - kaDali yalavale@M boMguchu nunnadi 
madiyu vadalaka talachuchu nunnadi - malaya pavanamu vIchuchu nunnadi 
yidiye mOhamO prEmapu dAhamO - yidiye jIvanataruvuku@M bU@MtayO 

nIdu mukhachaMdra biMbamu@M dA@Mkaka - nIrajAptu@MDu ma~rugayye nInA@MDu 
vEda maninAve yAnA@MDu prEmanu - bhEda meMduku kalgenu dRshTilO 
nIdu prEma dIpammuna Salabhamai - nEnu mADa@Mga nuMTini jUDavA 
vEdanala chitilOna dahana mEmo - mOdamanu jallu kuriyunO kuriyadO 

taruvOjalA yatulatO - 

talli sItamma - tana chuTTu nuMDeDu - daitya vanitala - tappu mATala vini 
yullamaMduna - nurutara du@hkhammu - noMde@M batidEvu - nUhiMchi madilOna 
mella@MgA vine - mRduvaina svaramoMDu - migula SAMtitO - "mEdinInAthuMDu 
challa@MgA nuMDe - sainyammutO vachchu - sAgaramu dA@MTi - svAminin gApADu" 

ee taruvu pU@Mta jAti padyamunu vishama sIsamu chEddAmA? kriMda 

taruvu pU@Mta "vishama" sIsamu - 

talli sItamma - tana chuTTu nuMDeDu - 
  daitya vanitala - tappu mATala vini 
yullamaMduna - nurutara du@hkhammu - 
  noMde@M batidEvu - nUhiMchi madilOna 
mella@MgA vine - mRduvaina svaramoMDu - 
  migula SAMtitO - "mEdinInAthuMDu 
challa@MgA nuMDe - sainyammutO vachchu - 
  sAgaramu dA@MTi - svAminin gApADu" 

tE. nana@Mga, nadi vini talabOse - nAme yapuDu 
"nidiyu rAxasa mAyayO - yEmo ye~ruga,"  
"valadu valadamma saMdEha - milanu nIku 
rAmadUtanu nE, naMpe - rAmu@MDu nanu"

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: