[racchabanda] షట్పద - షట్పద "విషమ" సీసము - షట్పద సీసము # shaTpada - shaTpada "vishama" sIsamu - shaTpada sIsamu#

 

షట్పద - షట్పద "విషమ" సీసము - షట్పద సీసము 

షట్పద - ఇం/ఇం - ఇం/ఇం - ఇం/ఇం - చం
తెలుగులో షట్పద ఒక చతుష్పద! 

ఇంద్ర గణములు - IIII, IIIU, IIUI, UII, UIU, UUI 
కన్నడములో వీటితోబాటు UUU, IIUU లను కూడ విష్ణు గణములుగా వాడుతారు. 

చంద్ర గణములు - 
UUUI UUII UUIU IIUII IIUIU IIUUI IIIII 
IIIIU IIIUI IIIUU UIUI UIUU UIII UIIU

ఇందులో IIIUI, UIUI మాత్రమే రెండు సూర్య గణములు. IIIIII, UIIII రెండు సూర్య గణములైనా కూడ చంద్ర గణములు కావు. కన్నడములోని అంశ షట్పదిలో ఈ 14 గణములతోబాటు UUUU, IIUUU లను కూడ రుద్ర గణములుగా వాడుతారు. 

ప్రతి షట్పద పాదము మూడు షట్పది పాదములతో సమానము. అనగా - 
ఇం/ఇం
ఇం/ఇం
ఇం/ఇం - చం

రెండు షట్పద పాదములు ఒక షట్పది అవుతుంది. షట్పదలో రెండేసి గణములకు ప్రాసయతి అవసరము. చివరి చంద్ర గణముతో షట్పదిలోని మూడవ, ఆఱవ పాదములయందలి మొదటి అక్షరముతో అక్షరసామ్య యతి ఉండాలి. 

క్రింద షట్పదకు ఒక ఉదాహరణము - 

వరిచేలపై వచ్చె 
చిఱుగాలి మెల్లఁగా 
తరుపత్రములు మెల్ల - తల లూఁపఁగా 
చెరువు గట్టులపైన 
చిఱు పుల్గు లవి యెల్ల 
వరుసగా నడయాడు - వరుస బాగు 
కరములోఁ గఱ్ఱతో 
తిరుగాడె నొక రైతు 
త్వరగాను బాడుచున్ - తందానలన్ 
మరువంపు నునుతావి 
హరుసమ్ము నొసఁగఁగా 
విరిబోణి నను జూడు - వేవేగము 

పై ఉదాహరణములో రెండవ షట్పద పాదములో చివరి చంద్ర గణము (వరుస బాగు) రెండు సూర్య గణములకు సరిపోతుంది. అనగా అది ఒక సీస పద్యపు పాదము. మిగిలినవి కావు. 

షట్పదకు ఒక ఎత్తుగితిని చేర్చినప్పుడు మనకు సీసములాటిది లభిస్తుంది.. పై షట్పదను షట్పద "విషమ" సీసము చేద్దామా? 

షట్పద "విషమ" సీసము - 

షట్పద. వరిచేలపై వచ్చె 
చిఱుగాలి మెల్లఁగా 
తరుపత్రములు మెల్ల - తల లూఁపఁగా 
చెరువు గట్టులపైన 
చిఱు పుల్గు లవి యెల్ల 
వరుసగా నడయాడు - వరుస బాగు 
కరములోఁ గఱ్ఱతో 
తిరుగాడె నొక రైతు 
త్వరగాను బాడుచున్ - తందానలన్ 
మరువంపు నునుతావి 
హరుసమ్ము నొసఁగఁగా 
విరిబోణి నను జూడు - వేవేగ మీ  

తే. సరసమగు సందె వేళలో - నరుణ కాంతి 
మెఱయుచుండంగ నింగిలో - నెరులవోలె 
మురియు సమయమ్ము వచ్చెనే - సిరుల నొలికి 
స్వరసుమమ్ముల నర్చన - జరుపుదాము 

షట్పద వేవేగ మీ అనే పదముతో అసంపూర్ణముగా అంతమయినది. తేటగీతితో చేర్చినప్పుడుతప్ప దానికి సంపూర్ణత సిద్ధించదు. ఇది షట్పద "విషమ" సీసము. 

షట్పదలాటి అమరికతో సీస పద్యమును కూడ వ్రాయ వచ్చును. ఇది ఒక సీసభేదము. ఈ సీస భేదమును ఇంతవఱకు ఎవ్వరు చెప్పలేదు. 

సీస భేదము షట్పద సీసము - 

సీ. కలలోన నిను దల్తు 
నిలలోన నిను బిల్తు 
వలఱేని యానరా - వలపు నీకె  
నెలరాజు నడిమింట 
చెలికాని స్మృతి మంట 
శిలవోలె నిట నుంటిఁ - చేవ వీడె 
మలమీఁదఁ దెలిమంచు 
చలిగాలి కలిగించు 
పులకింతయో లేక - పొంగు లేదు 
జలబిందువులు బైట 
జలబిందువులు గంట 
చెలువంపు టనుభూతి - చెంత లేక 

ఆ. నిలిచి యుంటి నిచటఁ  
బిలుపు వినఁగ నేను 
లలిత నన్ను గనఁగ - రమ్ము వేగ 
బలము నీవె నాకు 
లలిత ముఖముఁ జూపు 
జలముఁ జల్ల నాదు - జ్వాలపైన 

(ఎత్తుగీతియైన ఆటవెలఁదిని కూడ ఒక షట్పది రూపములో వ్రాసినాను.)

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
shaTpada - shaTpada "vishama" sIsamu - shaTpada sIsamu 

shaTpada - iM/iM - iM/iM - iM/iM - chaM
telugulO shaTpada oka chatushpada! 

iMdra gaNamulu - #IIII, IIIU, IIUI, UII, UIU, UUI# 
kannaDamulO vITitObATu #UUU, IIUU# lanu kUDa vishNu gaNamulugA vADutAru. 

chaMdra gaNamulu - 
#UUUI UUII UUIU IIUII IIUIU IIUUI IIIII 
IIIIU IIIUI IIIUU UIUI UIUU UIII UIIU#

iMdulO #IIIUI, UIUI# mAtramE reMDu sUrya gaNamulu. #IIIIII, UIIII# reMDu sUrya gaNamulainA kUDa chaMdra gaNamulu kAvu. kannaDamulOni aMSa ShaTpadilO ee 14 gaNamulatObATu #UUUU, IIUUU# lanu kUDa rudra gaNamulugA vADutAru. 

prati shaTpada pAdamu mUDu shaTpadi pAdamulatO samAnamu. anagA - 
iM/iM
iM/iM
iM/iM - chaM

reMDu shaTpada pAdamulu oka shaTpadi avutuMdi. shaTpadalO reMDEsi gaNamulaku prAsayati avasaramu. chivari chaMdra gaNamutO shaTpadilOni mUDava, aa~rava pAdamulayaMdali modaTi axaramutO axarasAmya yati uMDAli. 

kriMda shaTpadaku oka udAharaNamu - 

varichElapai vachche 
chi~rugAli mella@MgA 
tarupatramulu mella - tala lU@Mpa@MgA 
cheruvu gaTTulapaina 
chi~ru pulgu lavi yella 
varusagA naDayADu - varusa bAgu 
karamulO@M ga~r~ratO 
tirugADe noka raitu 
tvaragAnu bADuchun - taMdAnalan 
maruvaMpu nunutAvi 
harusammu nosa@Mga@MgA 
viribONi nanu jUDu - vEvEgamu 

pai udAharaNamulO reMDava shaTpada pAdamulO chivari chaMdra gaNamu (varusa bAgu) reMDu sUrya gaNamulaku saripOtuMdi. anagA adi oka sIsa padyapu pAdamu. migilinavi kAvu. 

shaTpadaku oka ettugitini chErchinappuDu manaku sIsamulATidi labhistuMdi. pai shaTpadanu shaTpada "vishama" sIsamu chEddAmA? 

shaTpada "vishama" sIsamu - 

shaTpada. varichElapai vachche 
chi~rugAli mella@MgA 
tarupatramulu mella - tala lU@Mpa@MgA 
cheruvu gaTTulapaina 
chi~ru pulgu lavi yella 
varusagA naDayADu - varusa bAgu 
karamulO@M ga~r~ratO 
tirugADe noka raitu 
tvaragAnu bADuchun - taMdAnalan 
maruvaMpu nunutAvi 
harusammu nosa@Mga@MgA 
viribONi nanu jUDu - vEvEga mI  

tE. sarasamagu saMde vELalO - naruNa kAMti 
me~rayuchuMDaMga niMgilO - nerulavOle 
muriyu samayammu vachchenE - sirula noliki 
svarasumammula narchana - jarupudAmu 

shaTpada vEvEga mI anE padamutO asaMpUrNamugA aMtamayinadi. tETagItitO chErchinappuDutappa dAniki saMpUrNata siddhiMchadu. idi shaTpada "vishama" sIsamu. 

shaTpadalATi amarikatO sIsa padyamunu kUDa vrAya vachchunu. idi oka sIsabhEdamu. ee sIsa bhEdamunu iMtava~raku evvaru cheppalEdu. 

sIsa bhEdamu shaTpada sIsamu - 

sI. kalalOna ninu daltu 
nilalOna ninu biltu 
vala~rEni yAnarA - valapu nIke  
nelarAju naDimiMTa 
chelikAni smRti maMTa 
SilavOle niTa nuMTi@M - chEva vIDe 
malamI@Mda@M delimaMchu 
chaligAli kaligiMchu 
pulakiMtayO lEka - pomgu lEdu 
jalabiMduvulu baiTa 
jalabiMduvulu gaMTa 
cheluvaMpu TanubhUti - cheMta lEka 

aa. nilichi yuMTi nichaTa@M  
bilupu vina@Mga nEnu 
lalita nannu gana@Mga - rammu vEga 
balamu nIve nAku 
lalita mukhamu@M jUpu 
jalamu@M jalla nAdu - jvAlapaina 

(ettugItiyaina aaTavela@Mdini kUDa oka shaTpadi rUpamulO vrAsinAnu.)

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: