[racchabanda] సీసమా లేక ఉత్సాహ పద్యములా? #sIsamA lEka utsAha padyamulA?#

 

సీసమా లేక ఉత్సాహ పద్యములా? 

ఉత్సాహకు యతి ప్రాసలు, సీసము, ఆటవెలదికి ప్రాసలు సరిపోవాలి కనుక అక్కడక్కడ నడక కుంటువడింది, మన్నించగలరు. 

సీ. మనసు పిలిచె నిన్ను - మమత మధువు నిమ్ము 
సుందరీ ప్రణయినీ - శుభము గలుగు, 
వరముల నీయుము - త్వరగా వనజనేత్ర 
రజనిలోన వఱల - రమ్ము, రమ్య 
మై మినుకు మనెను - మందమై తిమిరము 
నడుమ నుడుపముల్, వ-నమునఁ దరులఁ 
జెలఁగెఁ జిఱు స్వనము - పులుఁగు సడులలో, న- 
నలవలెను సకియ - నగుచు నగుచు 

ఆ. నంద మొందగా న-నయ మిచటఁ, జెలువు  
నొల్కు హంస లనఁగ - నొప్పుగా, ని-
నుని గనువఱకు సకి - మన మిపుడుఁ జెలిమి 
నుందమా, నెనరున - నొరిమ సిరుల 

ఉత్సా. మనసు పిలిచె నిన్ను మమత - మధువు నిమ్ము సుందరీ 
ప్రణయినీ శుభము గలుగు, వ-రముల నీయుము త్వరగా  
వనజనేత్ర రజనిలోన - వఱల రమ్ము, రమ్యమై 
మినుకు మనెను మందమై తి-మిరము నడుమ నుడుపముల్, 
వనమునఁ దరులఁ జెలఁగెఁ జిఱు - స్వనము పులుఁగు సడులలో, 
ననలవలెను సకియ నగుచు - నగుచు నంద మొందగా 
ననయ మిచటఁ, జెలువు నొల్కు - హంస లనఁగ నొప్పుగా, 
నినుని గనువఱకు సకి మన - మిపుడుఁ జెలిమి నుందమా, 
నెనరున నొరిమ సిరుల... 

విషమ సీసము - 

ఉత్సా. మనసు పిలిచె నిన్ను మమత - మధువు నిమ్ము సుందరీ 
ప్రణయినీ శుభము గలుగు, వ-రముల నీయుము త్వరగా  
వనజనేత్ర రజనిలోన - వఱల రమ్ము, రమ్యమై 
మినుకు మనెను మందమై తి-మిరము నడుమ నుడుపముల్, 
(వనమునఁ దరులఁ జెలఁగెఁ జిఱు - స్వనము పులుఁగుల రొదలన్, 
ననలవలెను సకియ నగుచు - నగుచు) 

ఆ. నంద మొందగా న-నయ మిచటఁ, జెలువు  
నొల్కు హంస లనఁగ - నొప్పుగా, ని-
నుని గనువఱకు సకి - మన మిపుడుఁ జెలిమి 
నుందమా, నెనరున - నొరిమ సిరుల 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sIsamA lEka utsAha padyamulA? 

utsAhaku yati prAsalu, sIsamu, aaTaveladiki prAsalu saripOvAli kanuka akkaDakkaDa naDaka kuMTuvaDiMdi, manniMchagalaru. 

sI. manasu piliche ninnu - mamata madhuvu nimmu 
suMdaree praNayinee - Subhamu galugu, 
varamula neeyumu - tvaragaa vanajanaetra 
rajanilOna va~rala - rammu, ramya 
mai minuku manenu - maMdamai timiramu 
naDuma nuDupamul^, va-namuna@M darula@M 
jela@Mge@M ji~ru svanamu - pulu@Mgu saDulalO, na- 
nalavalenu sakiya - naguchu naguchu 

aa. naMda moMdagaa na-naya michaTa@M, jeluvu  
nolku haMsa lana@Mga - noppugaa, ni-
nuni ganuva~raku saki - mana mipuDu@M jelimi 
nuMdamaa, nenaruna - norima sirula 

utsA. manasu piliche ninnu mamata - madhuvu nimmu suMdaree 
praNayinee Subhamu galugu, va-ramula neeyumu tvaragaa  
vanajanaetra rajanilOna - va~rala rammu, ramyamai 
minuku manenu maMdamai ti-miramu naDuma nuDupamul^, 
vanamuna@M darula@M jela@Mge@M ji~ru - svanamu pulu@Mgu saDulalO, 
nanalavalenu sakiya naguchu - naguchu naMda moMdagaa 
nanaya michaTa@M, jeluvu nolku - haMsa lana@Mga noppugaa, 
ninuni ganuva~raku saki mana - mipuDu@M jelimi nuMdamaa, 
nenaruna norima sirula... 

vishama sIsamu - 

utsA. manasu piliche ninnu mamata - madhuvu nimmu suMdaree 
praNayinee Subhamu galugu, va-ramula neeyumu tvaragaa  
vanajanaetra rajanilOna - va~rala rammu, ramyamai 
minuku manenu maMdamai ti-miramu naDuma nuDupamul^, 
(vanamuna@M darula@M jela@Mge@M ji~ru - svanamu pulu@Mgula rodalan^, 
nanalavalenu sakiya naguchu - naguchu) 

aa. naMda moMdagaa na-naya michaTa@M, jeluvu  
nolku haMsa lana@Mga - noppugaa, ni-
nuni ganuva~raku saki - mana mipuDu@M jelimi 
nuMdamaa, nenaruna - norima sirula 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: