సీసము - ఉత్సాహ - "విషమ" సీసము
త్ర్యస్రగతిలో సీసము, ఆటవెలఁది. ఆటవెలఁది సీసమునకు కూడ సరిపోతుంది.
సీ. మోహనాంగ త్వరగ - ముదపు ముద్దు లొసఁగు
వేళరా ప్రియముగఁ - బ్రేమ నొలుక
దాహమయ్యెఁ గదర - దప్పి దయను దీర్ప
రమ్మురా సలిలము - నిమ్ము నీయ
వాహనంపు సడులు - పజ్జ వచ్చు ననుచు
నుంటిరా సరసపు - పంట నీవు
వాహినిగను నన్ను - వలపు వఱదలోన
ముంచుమా తరఁగల - పులక లిడఁగ
ఆ. రాయ సొబగు నిండు - రేయి రమ్య తతము
మీటనా స్వరముల - మృదువుగాను
హాయి గల్గు మనకుఁ - దీయనైన ఘడియ
పిల్చెరా వదలఁగఁ - దల్చనీకు
(తతము = వీణవంటి వాద్యము)
ఉత్సాహ -
మోహనాంగ త్వరగ ముదపు - ముద్దు లొసఁగు వేళరా
దాహమయ్యెఁ గదర దప్పి - దయను దీర్ప రమ్మురా
వాహనంపు సడులు పజ్జ - వచ్చు ననుచు నుంటిరా
వాహినిగను నన్ను వలపు - వఱదలోన ముంచుమా
రాయ సొబగు నిండు రేయి - రమ్య తతము మీటనా
హాయి గల్గు మనకుఁ దీయ-నైన ఘడియ పిల్చెరా
విషమ సీసము -
ఉత్సాహ. మోహనాంగ త్వరగ ముదపు - ముద్దు లొసఁగు వేళరా
దాహమయ్యెఁ గదర దప్పి - దయను దీర్ప రమ్మురా
వాహనంపు సడులు పజ్జ - వచ్చు ననుచు నుంటిరా
వాహినిగను నన్ను వలపు - వఱదలోన ముంచు మా-
ఆ. రాయ సొబగు నిండు - రేయి రమ్య తతము
మీటనా స్వరముల - మృదువుగాను
హాయి గల్గు మనకుఁ - దీయనైన ఘడియ
పిల్చెరా వదలఁగఁ - దల్చనీకు
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sIsamu - utsAha - "vishama" sIsamu
tryasragatilO sIsamu, aaTavela@Mdi. aaTavela@Mdi sIsamunaku kUDa saripOtuMdi.
sI. mOhanAMga tvaraga - mudapu muddu losa@Mgu
vELarA priyamuga@M - brEma noluka
dAhamayye@M gadara - dappi dayanu dIrpa
rammurA salilamu - nimmu nIya
vAhanaMpu saDulu - pajja vachchu nanuchu
nuMTirA sarasapu - paMTa nIvu
vAhiniganu nannu - valapu va~radalOna
muMchumA tara@Mgala - pulaka liDa@Mga
aa. rAya sobagu niMDu - rEyi ramya tatamu
mITanA svaramula - mRduvugAnu
hAyi galgu manaku@M - dIyanaina ghaDiya
pilcherA vadala@Mga@M - dalchanIku
(tatamu = vINavaMTi vAdyamu)
utsAha -
mOhanAMga tvaraga mudapu - muddu losa@Mgu vELarA
dAhamayye@M gadara dappi - dayanu dIrpa rammurA
vAhanaMpu saDulu pajja - vachchu nanuchu nuMTirA
vAhiniganu nannu valapu - va~radalOna muMchumA
rAya sobagu niMDu rEyi - ramya tatamu mITanA
hAyi galgu manaku@M dIya-naina ghaDiya pilcherA
vishama sIsamu -
utsAha. mOhanAMga tvaraga mudapu - muddu losa@Mgu vELarA
dAhamayye@M gadara dappi - dayanu dIrpa rammurA
vAhanaMpu saDulu pajja - vachchu nanuchu nuMTirA
vAhiniganu nannu valapu - va~radalOna muMchu mA-
aa. rAya sobagu niMDu - rEyi ramya tatamu
mITanA svaramula - mRduvugAnu
hAyi galgu manaku@M - dIyanaina ghaDiya
pilcherA vadala@Mga@M - dalchanIku
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
SPONSORED LINKS
.
__,_._,___
No comments:
Post a Comment